Jogulamba Gadwal Incident
క్రైమ్, లేటెస్ట్ న్యూస్

Love Marriage: ప్రేమించి సీక్రెట్‌గా పెళ్లి చేసుకొని.. కానిస్టేబుల్ జాబ్ వచ్చాక!

Love Marriage: సమాజంలో ప్రేమ పేరుతో రోజురోజుకూ మోసాలు పెరిగిపోతున్నాయి. నిజంగా ఇది ఆందోళన కలిగించే అంశం. ఇది వ్యక్తుల జీవితాలను, నమ్మకాలను తీవ్రంగా ప్రభావితం చేసే ఒక సామాజిక సమస్యగా మారుతోంది. ప్రేమించుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆ తర్వాత కులం, డబ్బు, ఉద్యోగం వంటి కారణాలతో సంబంధాలను తెంచుకోవడం, లేదా ఆర్థికంగా, శారీరకంగా మోసం చేయడం వంటివి నిత్యకృత్యం అవుతున్నాయి. ఈ వార్త చదివిన తర్వాత చీ.. ఛీ ఇలాంటోళ్లు కూడా సభ్య సమాజంలో ఉంటారా? అని మీకూ సందేహాలు వచ్చేస్తాయి. ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తూ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జోగులాంబ గద్వాల జిల్లా, గట్టు మండల పోలీస్ స్టేషన్‌లో యువకుడిపై చీటింగ్ కేసు నమోదైంది. నిందితుడు రఘునాథ్ గౌడ్ శాంతినగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

Read Also- Pawan Kalyan: నాగబాబు మంత్రి పదవిపై ఒక్క మాటలో తేల్చేసిన పవన్

పరిచయం.. ప్రేమ.. పెళ్లి ఇలా!
పూర్తి వివరాల్లోకెళితే.. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన ప్రియాంక అనే యువతి, 2023లో హైదరాబాద్‌లో కాంపిటీటివ్ ఉద్యోగ పరీక్షల కోచింగ్ తీసుకుంటున్న సమయంలో గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామానికి చెందిన రఘునాథ్ గౌడ్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారి, 2024లో రహస్యంగా వివాహం చేసుకున్నాడు. అయితే.. అప్పటి వరకూ బాగున్న ఈ జంట.. రఘుకు పోలీస్ ఉద్యోగం రావడంతో ఒక్కసారిగా సీన్ మొత్తం మార్చేశాడు. దీంతో ఆ యువతి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తామిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని.. అయితే పోలీస్ ట్రైనింగ్ అనంతరం గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంటానని రఘునాథ్ గౌడ్ తనను నమ్మిస్తూ వచ్చాడని మీడియాకు వెల్లడించారు. శాంతినగర్‌లో రఘునాథ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడని, తాను తరచుగా కలిసేదానినని చెప్పారు. పలుమార్లు పెళ్లి విషయం అడిగినా వాయిదా వేసుకుంటూ వచ్చాడని తెలిపారు. తన కులం తక్కువ కావడంతో రఘు కుటుంబ సభ్యులు ఒప్పుకోకుండా, దూరం పెడుతున్నాడని యువతి మీడియా ఎదుట కంటతడి పెట్టారు. అతను గౌడ్ కావడం.. ఈమె తక్కువ కులం కావడమే పెళ్లికి ఒప్పుకోకపోవడానికి రఘు ఇంట్లో వచ్చిన సమస్య. తనకు న్యాయం చేయాలని పోలీసులను ప్రియాంక వేడుకుంటున్నారు.

Priyanka Lover

నిరసన, ఆత్మహత్యాయత్నం!
ఈ నెల 14న ప్రియాంక చిన్నోనిపల్లిలోని రఘునాథ్ గౌడ్ స్వగ్రామానికి చేరుకుని పెళ్లి విషయం గురించి మాట్లాడింది. అయితే, అతని కుటుంబ సభ్యులు వివాహానికి నిరాకరించారు. ఆగస్టు 16న మరోసారి గ్రామానికి చేరుకుని నిలదీయగా, ఇరువురి మధ్య మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో రఘునాథ్ గౌడ్ సమీప బంధువు ఒకరు తనపై దాడి చేశారని ప్రియాంక తెలిపింది. తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియాంక, ప్రేమించిన యువకుడి ఇంటి వద్దే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో అపస్మారక స్థితికి చేరుకోవడంతో స్థానికులు గమనించి వెంటనే ఆమెను గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రియాంక ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా గట్టు మండల పోలీసులు వివరాలు సేకరించారు. ఈ ఘటనపై డీఎస్పీ మొగులయ్య మాట్లాడుతూ.. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన కానిస్టేబుల్ రఘునాథ్ గౌడ్‌పై ఈ నెల 17న యువతి ఫిర్యాదు మేరకు గట్టు మండల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని తెలిపారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, యువతి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసి, పూర్తిస్థాయిలో విచారణ అనంతరం చట్ట ప్రకారం తదుపరి చర్యలు చేపడతామని డీఎస్పీ హామీ ఇచ్చారు.

DSP Mogulayya

తస్మాత్ జాగ్రత్త..!
స్కూళ్లు, కాలేజీలు, స్టడీ సెంటర్లు.. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు కొత్త వ్యక్తులతో పరిచయాలను సులభతరం చేస్తున్నాయి. అయితే, వ్యక్తిగత సమాచారం ఏమాత్రం తెలుసుకోకుండానే స్నేహం, ప్రేమ ఏర్పడటానికి ఇది దారితీస్తున్నది. కొంతమంది ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రేమను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. డబ్బులు తీసుకోవడం, ఖరీదైన బహుమతులు పొందడం, లేదా భాగస్వామి ఆర్థిక స్థిరత్వంపై ఆధారపడటం వంటివి ఇందులో ఉంటాయి. పెళ్లి పేరుతో శారీరకంగా దగ్గరై, ఆ తర్వాత మాట తప్పడం అనేది చాలా సాధారణ మోసంగా మారింది. ఇది బాధితులకు మానసికంగా, సామాజికంగా తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. ఈ ఆధునిక కాలంలో కూడా కులం, మతం వంటి అంశాలు ప్రేమ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తమ కుటుంబాల అంగీకారం లేదని లేదా తక్కువ కులం/మతం అని చెప్పి సంబంధాన్ని తెంచుకోవడం పరిపాటిగా మారింది. కొందరు వ్యక్తులు నిజమైన ప్రేమ కంటే తాత్కాలిక సంతోషం లేదా స్వార్థ ప్రయోజనాల కోసం సంబంధాలను ఏర్పరుచుకుంటారు. ప్రేమలో ఉన్నప్పుడు వ్యక్తులు తరచుగా భావోద్వేగాలకు లోనై, భాగస్వామి గురించి పూర్తి వివరాలను సేకరించడంలో నిర్లక్ష్యం చేస్తారు. బాధితులు తీవ్రమైన మానసిక ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన.. ఆత్మవిశ్వాసం కోల్పోతారు. కొన్ని సందర్భాల్లో బాధితులు ఆర్థికంగా నష్టపోతారు.

Read Also- Pawan Kalyan: 2019లో ఓడిపోయినప్పుడు.. ‘జానీ’ ఫెయిల్యూర్ నాకు బాగా హెల్ప్ చేసింది

ఏం చేయాలి..?
కొత్త సంబంధాలు ఏర్పడినప్పుడు, వ్యక్తి గురించి పూర్తి వివరాలను తెలుసుకోవాలి. వారి కుటుంబ నేపథ్యం, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి వంటివాటిని పరిశీలించాలి. ముఖ్యంగా పెళ్లి విషయంలో పెద్దల సలహాలను, సూచనలను పరిగణనలోకి తీసుకోవడం మంచిది. తొందరపడి పెళ్లి లాంటి నిర్ణయాలు తీసుకోకుండా, భావోద్వేగాలను నియంత్రించుకోవడం ముఖ్యం. ప్రేమ పేరుతో మోసం జరిగితే, చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో తెలుసుకోవాలి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. మోసపోయిన వారు మానసికంగా కోలుకోవడానికి కౌన్సెలింగ్ తీసుకోవడం మంచిది. సమాజంలో ఈ సమస్యను తగ్గించడానికి అవగాహన పెంచడం, చట్టపరమైన చర్యలను కఠినతరం చేయడం, యువతలో బాధ్యతాయుతమైన సంబంధాల పట్ల అవగాహన కల్పించడం చాలా అవసరం. అయినా ఈ కాలంలో సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్‌లు ఓ రేంజిలో వస్తున్నాయి.. అందులోనూ ఇలాంటి ప్రేమ, పెళ్లి కథలు చూస్తున్నప్పటికీ పదే పదే యువతులు మోసపోతూ ఉండటం గమనార్హం. మరీ ముఖ్యంగా సమాజంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ అలాంటి తప్పులే చేస్తూ ఇలా ఇబ్బందుల పాలవ్వడం ఎంతవరకూ కరెక్ట్.. అమ్మాయిలూ అప్రమత్తంగా ఉండండి..!

Read Also- Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో అదిరిపోయే పథకం.. త్వరగా తెలుసుకోండి!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు