Andhra Pradesh Program
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో అదిరిపోయే పథకం.. త్వరగా తెలుసుకోండి!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో అదిరిపోయే పథకాన్ని తీసుకొస్తోంది. నిజంగా ఇది అదిరిపోయే పథకం అని చెప్పుకోవచ్చు. ఆ పథకం వివరాలేంటి? ప్రయోజనమేంటి? అనే విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి. రాష్ట్రంలో సిజేరియ‌న్ ప్రస‌వాల త‌గ్గింపుపై వైద్యారోగ్య శాఖ (Health Department) ప్రత్యేక దృష్టిని సారించింది. ఈ దిశ‌గా సుశిక్షితులైన మిడ్‌వైవ్స్ (ప్రసూతి సహాయ‌కులు) ద్వారా స‌హ‌జ ప్రస‌వాల్ని (Natural Births) ప్రోత్సహించే ప‌థకానికి వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్ (Minister Satya Kumar Yadav) ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ప్రస‌వ‌ స‌మ‌యాల్లో ప్రభుత్వ ఆసుప‌త్రుల్లోని స్టాఫ్ న‌ర్సులే ప్రసూతి సేవ‌ల్ని అందిస్తున్నారు. వీరికి వివిధ అంశాల‌పై త‌గిన ప‌రిజ్ఞానం, శిక్షణ కొర‌వ‌డ‌డంతో సిజేరియ‌న్ ప్రస‌వాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. ఈలోటును తీర్చేందుకు ఎంపిక చేసిన స్టాప్ న‌ర్సుల‌కు 18 నెల‌ల పాటు ప్రస‌వానికి ముందు, ప్రస‌వ స‌మ‌యం, ప్రస‌వానంత‌ర సేవ‌ల‌కు సంబంధించిన అంశాల‌పై స‌మ‌గ్ర శిక్షణ అందించి మ‌హిళ‌లు స‌హ‌జ ప్రస‌వాల ప‌ట్ల మొగ్గు చూపేలా ఈ ప్రత్యేక ప‌థకాన్ని రూపొందించారు.

Read Also- Pawan Kalyan: నాగబాబు మంత్రి పదవిపై ఒక్క మాటలో తేల్చేసిన పవన్

Normal Delivery

పథకంతో ఏం ప్రయోజనం?
తొలి విడ‌త‌లో సంవ‌త్సరానికి 600 నుంచి 6వేలకు పైగా ప్రస‌వాలు జ‌రుగుతున్న 86 ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో సుశిక్షితులైన 1264 మంది ప్రసూతి స‌హాయ‌కుల్ని(Midwife Program) నియ‌మిస్తారు. వీరు వివిధ స‌మ‌యాల్లో అందించాల్సిన సేవ‌లు, విధులపై స‌మ‌గ్ర జాబ్ చార్టును రూపొందించి ప్రసూతి సేవ‌ల నాణ్యత‌ను ఈ ప‌థకం కింద పెంచుతారు. ఔట్ పేషెంట్(ఓపీ) స‌ర్వీసుల్లో భాగంగా గ‌ర్భవ‌తుల పూర్వ ఆరోగ్య వివ‌రాలు, ప్రస్తుత స్థితి, ప్రస‌వ విష‌య ప‌రిజ్ఞానం, స‌రైన పోష‌ణ‌, వ్యాయామ అవ‌స‌రాలు, స‌హ‌జ ప్రస‌వాల వ‌ల్ల క‌లిగే లాభాల‌ను శిక్షణ పొందిన మిడ్‌వైవ్స్ అందిస్తారు. లేబ‌ర్ రూముల్లో ప్రస‌వ నొప్పుల‌కు సంబంధించిన విష‌య ప‌రిజ్ఞానం, వాటిని భ‌రించే విధానం, స‌హ‌జ ప్రస‌వానికి అవ‌స‌ర‌మైన స‌ల‌హాలు, ఏవైనా క్లిష్ట ప‌రిస్థితులు ఎదురయ్యే అవ‌కాశాల గుర్తింపు, చేప‌ట్టాల్సిన చ‌ర్యల‌పై వీరు త‌గు స‌ల‌హాలిస్తూ అప్రమ‌త్తంగా ఉంటారు. ప్రస‌వానంత‌రం త‌ల్లి, బిడ్డ ఆరోగ్య ప‌రిస్థితి అంచ‌నా, త‌ల్లిపాల విశిష్టత‌ను వివ‌రించ‌డంతో పాటు త‌ల్లీబిడ్డల మ‌ధ్య మాన‌సిక అనుబంధాన్ని పెంచ‌డం, ప్రస‌వానంత‌రం ఎదురయ్యే స‌మ‌స్యల‌పై దృష్టి పెడ‌తారు. ప్రస్తుత స్టాఫ్ న‌ర్సుల (Staff Nurse) విష‌య ప‌రిజ్ఞానం, శిక్షణా రాహిత్యాల వ‌ల‌న ప్రస‌వ స‌మ‌యాల్లో డాక్టర్ల పాత్ర ఎక్కువ‌గా ఉండ‌డంతో సిజేరియ‌న్ (Cesarean) ప్రస‌వాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయ‌ని ఒక అంచ‌నా.

Read Also- Air India: ఎయిరిండియా విమానంలో మంటలు.. మరో షాకింగ్ ఘటన

Satya Kumar Yadav

ఎక్కడ ఎన్ని ప్రసవాలు?
కేంద్ర ప్రభుత్వ సాయంతో జాతీయ ఆరోగ్య మిష‌న్‌(National Health Mission) కింద అమ‌ల‌య్యే ఈ ప‌ధ‌కానికి సంబంధించిన ప‌లు అంశాల్ని లోతుగా చ‌ర్చించి మంత్రి ఆమోదం తెలిపారు. ఈ ప‌థకం విస్తృతిని పెంచాల‌ని, గిరిజ‌న, గ్రామీణ ప్రాంతాల్లో ప్రస‌వాలు నిర్వహించే ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి కేంద్రంలోనూ ఒక సుశిక్షిత ప్రసూతి స‌హాయ‌కురాలు(మిడ్‌వైఫ్‌) ఉండేలా చ‌ర్యలు చేప‌ట్టాల‌ని మంత్రి ఆదేశించారు. ఈ ప‌థకం కింద ఎంపిక చేసిన ప్రతి స్టాఫ్ నర్సుకు 18 నెల‌ల పాటు స‌మ‌గ్రమైన శిక్షణ అందించ‌డానికి స్టైపెండ్‌తో క‌లిపి రూ.2.50 ల‌క్షలు ఖ‌ర్చవుతుంద‌ని అంచ‌నా. 2024-25 ఆర్థిక సంవ‌త్సరంలో రాష్ట్రంలో మొత్తం ప్రస‌వాల్లో 56.12 శాతం సిజేరియ‌న్ ప్రస‌వాలు జ‌రిగిన‌ట్లు స‌మాచారం. ఇందులో ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో జ‌రిగిన ప్రస‌వాల్లో 41.40 శాతం సిజేరియ‌న్లు కాగా ప్రైవేట్ ఆసుప‌త్రుల్లో 67.71 శాతం మేర‌కు సిజేరియ‌న్ ప్రస‌వాలు జ‌రిగాయి.

Read Also- Bhairavam OTT: ఓటీటీలో దుమ్మురేపుతోన్న ‘భైరవం’.. రికార్డుల వేట మొదలైంది!

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు