Bhairavam Still
ఎంటర్‌టైన్మెంట్

Bhairavam OTT: ఓటీటీలో దుమ్మురేపుతోన్న ‘భైరవం’.. రికార్డుల వేట మొదలైంది!

Bhairavam OTT: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas), నారా రోహిత్‌ (Nara Rohith), మంచు మ‌నోజ్ (Manchu Manoj) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ‘భైరవం’ (Bhairavam). విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ ఈ సినిమాను నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గాడా సమర్పించిన ఈ సినిమా మే 30న థియేటర్లలో విడుదలై మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఆనంది శంక‌ర్‌, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటించారు. ఓ గ్రామంలోని ముగ్గురు స్నేహితుల మ‌ధ్య న‌డిచే క‌థ‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, విడుదలకు ముందే మంచి క్రేజ్‌ని ఏర్పరచుకుని, విడుదల తర్వాత కూడా పాజిటివ్ స్పందనను రాబట్టుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో దుమ్మురేపుతోంది.

Also Read- Honeymoon Murder case: నెల రోజులుగా జైల్లోనే.. అయినా బుద్ధిరాలేదు.. తోటి ఖైదీలతో సోనమ్ ఏం చేసిందంటే?

ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌మైన కంటెంట్‌తో ప్రేక్ష‌కులను ఎంటర్‌టైన్ చేస్తూ, వారి హృద‌యాల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్న జీ5 ఓటీటీలో ఈ సినిమా జూలై 18న స్ట్రీమింగ్‌కు వచ్చింది. జీ5 ఓటీటీలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓటీటీ మాధ్య‌మాల్లో ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటూ, దేశంలో వ‌న్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓటీటీ మాధ్య‌మంగా దూసుకెళుతోన్న జీ5 ఓటీటీ పేరును మరోసారి హైలైట్ చేసేలా ‘భైరవం’ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత జీ5 మంచి మంచి కంటెంట్‌తో వీక్షకులను ఎంటర్‌టైన్ చేస్తోంది. ఇప్పుడొచ్చిన ‘భైరవం’ చిత్రం కూడా వీక్షకుల నుంచి బ్రహ్మాండమైన ఆదరణను రాబట్టుకుంటోందని జీ5 ఓటీటీ అధికారికంగా తెలియజేసింది.

Also Read- Samantha: సమంత రెండో పెళ్లికి డేట్ ఫిక్స్.. అదే రోజున చైతూకి బిగ్ షాక్ ఇవ్వనున్న సామ్?

జూలై 18న స్ట్రీమింగ్‌‌కు వచ్చిన ‘భైరవం’ చిత్రం అతి తక్కువ సమయంలోనే 100 మిలియ‌న్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో ఆడియెన్స్‌ను అల‌రిస్తోందని, ప్రస్తుతం టాప్ 1లో దూసుకుపోతుందని జీ5 ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘భైరవం’ చిత్ర కాన్సెప్ట్ విషయానికి వస్తే.. గ్రామానికి చెందిన ఆల‌య భూముల‌పై ఓ బడా రాజ‌కీయ నాయ‌కుడు క‌న్ను పడుతుంది. అత‌ను ఆ భూముల కోసం ఏం చేశాడు? దీంతో ముగ్గురు స్నేహితుల (బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్) జీవితాలు ఎలా మ‌లుపు తిరిగాయి? చివరికి ఆ దేవాలయ భూములను కాపాడగలిగారా? లేదా? అనేదే ‘భైరవం’ కథ. స్నేహం, ల‌వ్, ఎమోష‌న్స్ ప్ర‌ధాన అంశాలుగా తెర‌కెక్కిన ఈ సినిమా తక్కువ సమయంలోనే వంద మిలియ‌న్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి, ఇంకా టాప్‌లోనే కొనసాగుతోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రానికి హరి కె వేదాంతం సినిమాటోగ్రఫీ, చోటా కే ప్రసాద్ ఎడిటింగ్, బ్రహ్మా కడలి ప్రొడక్షన్ డిజైనింగ్ బాధ్యతలను నిర్వహించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్