Samantha: తెలుగు సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు చేసుకోవడం విడాకులు తీసుకుని విడిపోవడం ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే, కొందరు ఏకంగా రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. సామ్, చైతూ విడాకులు తీసుకుని విడిపోయిన దగ్గర నుంచి తెలుగు హీరో హీరోయిన్లు వాళ్ళు కూడా విడాకులు తీసుకుని విడిపోతున్నారు. అయితే, ఇప్పటికీ కూడా సామ్, చైతూ విడిపోవడానికి గల సరైన కారణం బయటకు రాలేదు.ఇదిలా ఉండగా, సామ్, చైతూ విడిపోయిన తర్వాత నాగ చైతన్య శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాడు. కానీ, సమంత మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తన సినీ కెరియర్ పైనే దృష్టి పెట్టి కొత్త ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్తుంది.
Also Read: Samantha: వెన్నెల కిషోర్ ఏంటి తేడాగా చేస్తున్నాడు.. పక్కన సమంత నవ్వు ఆపుకోలేకపోతుంది!
సమంత రెండో పెళ్లికి డేట్ ఫిక్స్..
సమంత రెండో పెళ్లికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సన్నిహితంగా ఉంటూ, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిసిన సమాచారం. ఇప్పటికే సోషల్ మీడియాలో వీరిద్దరి ఫోటోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అక్టోబర్ 6న వీరి వివాహం జరగబోతుందని తెలుస్తుంది. ఇక ఇదే సమయంలో చైతూ బిగ్ షాక్ ఇవ్వాలని సమంత ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.
Also Read: PSPK: సినిమాలు చేసుకుంటున్నాడని ప్రత్యర్థులు విమర్శిస్తున్నా.. నేను నిలబడ్డాను! ఎందుకంటే?
ఆ చర్చిలో సమంత రెండో పెళ్లి?
సమంత మొదటి పెళ్లి నాగచైతన్యతో కూడా అదే రోజున (అక్టోబర్ 6) జరిగింది. ఈసారి రాజ్ నిడిమోరుతో సాదాసీదాగా చర్చిలో పెళ్లి చేసుకోవాలని సమంత ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలపై నెటిజన్లు రక రకాల కామెంట్స్ చేస్తున్నారు. కొందరు సమంత నాగచైతన్యకు షాక్ ఇవ్వాలనే ఇలా చేస్తుందని అంటున్నారు. మరికొందరు మొదటి పెళ్లి విడాకులతో ముగిసిన ఆ రోజునే మళ్లీ పెళ్లి ఎందుకు అని అంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే, ఇంకా కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.
Also Read: Nitish Reddy: సిరీస్ మధ్యలోనే నితీష్ కుమార్ రెడ్డి తిరుగుపయనం.. బీసీసీఐ కీలక ప్రకటన