Pawan Kalyan Interview
ఆంధ్రప్రదేశ్

Pawan Kalyan: నాగబాబు మంత్రి పదవిపై ఒక్క మాటలో తేల్చేసిన పవన్

Pawan Kalyan: మెగా బ్రదర్, జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు మంత్రి పదవి ఉంటుందా? లేదా? అసలు ఆయన్ను మంత్రి పదవిలో చూడగలమా లేదా? లేదా అంటూ ఇన్నాళ్లు అభిమానులు, జనసేన కార్యకర్తలు, నేతలు వేయి కళ్లతో ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆ మధ్య కొన్ని అనివార్య కారణాలు, ఆయన నోటికి పనిచెప్పడంతో చేజేతులారా మంత్రి పదవి పోగొట్టుకున్నారని కూడా వార్తలు గుప్పుమన్నాయి. మరీ ముఖ్యంగా పిఠాపురం వర్మ విషయంలో నాగబాబు చేస్తున్న అతి ప్రసంగాలు, అంతకుమించి నియోజకవర్గంలో చేస్తున్న పనులతో సీఎం చంద్రబాబు బాగా హర్ట్ అయ్యారని అందుకే మంత్రి పదవి ఇవ్వడానికి సాహసించలేదని కూడా ప్రచారం జోరుగానే సాగింది. అయితే ఇప్పటి వరకూ నడిచిన, ఇంకా నడుస్తున్న పుకార్లు అన్నింటికీ చెక్ పెడుతూ.. అసలు మంత్రి పదవి ఉంటుందా లేదా అనేదానిపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకే ఒక్క మాటతో తేల్చి చెప్పేశారు.

పక్కాగా ఉంటుంది కానీ..
పవన్ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా శుక్రవారం రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అమరావతిలో సేనాని మీడియా మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. అంతేకాదు మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు కూడా ఎంతో లాజిక్‌గా, కూల్‌గా పవన్ బదులిచ్చారు. నాగబాబుకు మంత్రి పదవి ఉంటుందా? లేదా? ఉంటే ఎప్పుడు ఉండొచు? అనే ప్రశ్న పవన్‌కు ఎదురైంది. ఇందుకు డిప్యూటీ సీఎం బదులిస్తూ.. నాగబాబుకు మంత్రి పదవిపై ఇప్పటి వరకూ చర్చ జరగలేదన్నారు. దానిపై తానే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు తప్పవని చెప్పకనే చెప్పేశారు. అంటే అన్నయ్యకు మంత్రి పదవి ఉంటుంది కానీ.. చర్చలు జరగలేదంటే అర్థమేంటి? ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చలు జరగలేదనే అర్థమా? అనేదానిపై క్లారిటీ రాలేదు. దీనికి తోడు రాజకీయంగా ఇబ్బందులు అంటే ఇన్నాళ్లు అన్న వేచి చూడాల్సి వచ్చిందనే దానికి ఇలా మాట్లాడారా? అనే సందేహాలు అభిమానులు, కార్యకర్తల్లో వస్తున్నాయి. మొత్తానికి చూస్తే.. నాగబాబుకు మంత్రి పదవి వస్తుందా లేదా అనే ఊహాగానాలకు ఈ వ్యాఖ్యలతో పవన్ తాత్కాలికంగా తెరదించారు. ఈ విషయంలో తుది నిర్ణయం తనదే అని పవన్ పేర్కొనడం, పార్టీలో తనకున్న ప్రాముఖ్యతను, నిర్ణయాధికారాన్ని తెలియజేస్తుందని చెప్పుకోవచ్చు.

Read Also- Marriage: పెళ్లి కాని ప్రసాద్‌లకు దడ పుట్టించే వార్త.. వెంటనే చెక్ చేస్కోండి!

ఇబ్బందులు తప్పవు..
ఇదే మీడియా మీట్‌లో రాజకీయ జీవితంలో ఎదురయ్యే సవాళ్ల గురించి పవన్ ప్రస్తావించారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు తప్పవని వ్యాఖ్యానించడంతో సడన్‌గా ఆయన నోట ఈ మాట ఎందుకొచ్చిందని అభిమానులు కాసింత ఆలోచనలో పడ్డారు. ఈ మాటతో రాజకీయాల్లో ఎదురయ్యే విమర్శలు, ఒత్తిళ్లు, సవాళ్లను ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పకనే చెప్పినట్లయింది. దీంతో పాటు.. జనసేన పార్టీ నిర్మాణంపై ఇప్పటి వరకు తాను దృష్టి పెట్టలేదని.. ఇకపై పార్టీ సంస్థాగత నిర్మాణంపై వర్క్ చేస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. గత ఎన్నికల్లో జనసేన కూటమిలో భాగంగా విజయం సాధించినప్పటికీ, పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించారన్న మాట. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం ద్వారా భవిష్యత్తులో మరింత ప్రభావవంతంగా పనిచేయాలని పవన్ యోచిస్తున్నారని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రాజధాని అమరావతిలో భూసేకరణ అంశంపై కూడా పవన్ కళ్యాణ్ స్పష్టతనిచ్చారు. రాజధాని భూసేకరణలో ఇష్టం ఉన్న రైతులే భూములు ఇవ్వండి, బలవంతం లేదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రైతులకు భరోసా కల్పించే విధంగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. గతంలో భూసేకరణపై పలు వివాదాలు తలెత్తిన నేపథ్యంలో పవన్ బలవంతపు సేకరణ ఉండదని హామీ ఇవ్వడం శుభపరిణామమే అని చెప్పుకోవచ్చు. మొత్తంగా పవన్ వ్యాఖ్యలు జనసేన భవిష్యత్తు, కార్యాచరణ, కూటమి ప్రభుత్వంలో దాని పాత్ర, ముఖ్యమైన రాజకీయ నిర్ణయాలపై స్పష్టతనిచ్చాయి.

Read Also- Ashley Madison: వివాహితుల రోత కథలు.. ఈ యాప్‌లో తెగ సైన్‌అప్‌లు

 

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు