Hanamkonda District (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Hanamkonda District: క్యూలో చెప్పులు ఆధార్ కార్డులు.. గంటల తరబడి భారులు

Hanamkonda District: యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారు. రైతుల అవసరాలకు సరిపడ యూరియా రాకపోవడంతో వచ్చిన తక్కువ మోతాదు యూరియా కోసం రైతులు గంటల తరబడి పడిగాపులు పడుతున్నారు. హన్మకొండ(Hanmakonda) జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కమలాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(Primary Agricultural Cooperative Society) గోడౌన్ వద్ద రైతులు ఉదయం నుంచి బారులు తీరారు. యూరియా కోసం చెప్పుల(Sandals)ను, ఆధార్ కార్డుల(Aadhar cards)ను క్యూ లైన్ లలో ఉంచారు.

ఉదయం 6 గంటల నుండి క్యూ లైన్
ఈ సందర్భంగా రైతులు మీడియాతో మాట్లాతూ ఉదయం 6 గంటల నుండి క్యూ లైన్ లలో వేచి చూస్తున్నామన్నారు. వ్యవసాయ(Agriculture) పనులు చేసుకునే రోజులలో యూరియా కోసం ఇలా గంటల తరబడి లైన్లో ఉండడం వలన వ్యవసాయ పనులు ఆగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ(Telangana) రాష్ట్రంలో యూరియా(Urea)కు ఎటువంటి కొరత లేదని చెప్తుంటే ఇక్కడ మాత్రం రైతులకు సరిపడా యూరియా బస్తాలు అందుబాటులో లేక గత కొద్ది రోజుల నుండి విపరీతమైన ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలిపారు.

Also Read: GO 49 Suspended: సీఎం ఆదేశాలతో ఫారెస్టు డిపార్టుమెంటు ఉత్తర్వులు

బస్తాలు మాత్రమే అందుబాటు
సుమారు 1500 మంది రైతులు(Farmers) యూరియా కోసం పడిగాపులు పడగా కేవలం 888 బస్తాలు మాత్రమే అందుబాటులో ఉండడంతో పలు ఇబ్బందులు పడ్డామని రైతులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతో పాటు పలు గ్రామాలలోని ఫర్టిలైజర్ షాపు(Fertilizer shop)లకు యూరియాను పంపిణీ చేస్తే ఇటువంటి ఇబ్బందులు రావని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కోరుతున్నారు.

Also Read: Viral News: అమ్మను అవమానించిన వ్యక్తి కోసం పదేళ్లు వెతికి.. దొరికిన వెంటనే..

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!