GO 49 Suspended: రాష్ట్ర ప్రభుత్వం కొమరం భీం కన్సర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు కోసం జారీ చేసిన జీవో 49 ను నిలిపివేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జీవోను నిలుపుదల చేస్తూ అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అహ్మద్ నదీం మోమో జారీ చేశారు. హైదరాబాద్ లోని సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో ఆదిలాబాద్ ఇంచార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, కొండా సురేఖ భేటీ అయ్యారు. జీవో49పై నివేదించారు. సీఎం సానుకూలంగా స్పందించి 49 జీవో నిలుపుదల చేశారు. దీంతో మంత్రులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
తడోబా టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వలను కలిపేందుకు వాటి మద్యలో ఉన్న ప్రాంతాన్ని కన్సర్వేషన్ రిజర్వ్ గా ఏర్పాటు చేయాలని 2016 లోనే బీజం పడింది. జూన్ 12, 2016 నాడే దీనికి గత ప్రభుత్వం అంకుర్పార్పన చేసింది. రాష్ట్ర వన్యప్రాణి బోర్డు మొదటి సమావేశం ప్రతిపాదిత ప్రాంతాన్ని కన్జర్వేషన్ రిజర్వ్ గా ప్రకటించాలనే ప్రతిపాదనపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చర్చించింది.
కవ్వాల్ టైగర్ రిజర్వ్ కారిడార్
ఆ తర్వాత 27 ఫిబ్రవరి 2017 న రాష్ట్ర వన్యప్రాణి బోర్డు రెండో సమావేశంలో నోటిఫికేషన్ కోసం అప్పటి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జూన్ 26, 2018 న ఛీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ప్రతిపదిత ప్రాంతాన్ని వన్యప్రాణులు అభయారణ్యంగా ప్రకటించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జూలై 11, 2019 లో కవ్వాల్ టైగర్ రిజర్వ్ కారిడార్ కు అనుభందంగా ప్రతిపాదితక ప్రాంతాన్ని ఉపగ్రహ కేంద్రంగా ప్రకటించాలని నిర్ణయించారు. ఆ ప్రాంతాన్ని అత్యవసరంగా కన్జర్వేషన్ జోన్ గా ప్రకటించాలని జాతీయ పులుల సంరక్షణ సంస్థ తెలంగాణ అటవి శాఖను ఆదేశించింది.
ఈ ప్రక్రియను కొనసాగిస్తూ బీజేపీ ఎంపీ గుడెం నగేష్, బీఆర్ఎస్ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీతో పాటు అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు మద్దతుతో జూలై 10, 2024 న రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదాను సిద్దం చేసింది. అనుగుణంగా తడోబా టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వులను కలిపేలా వాటి మద్యలో ఉన్న ప్రాంతాన్ని కొమురం భీం కన్సర్వేషన్ రిజర్వ్ గా ఏర్పాటు చేస్తూ జీవో 49 ని జారీ చేసింది.
Also Read: Viral News: సీఈవో హగ్ వైరల్.. గట్టిగా వాడేస్తున్న ప్రముఖ కంపెనీలు
స్థానిక ప్రజల ఆకాంక్షల మేరకే ముందుకు
అయితే ఈ జోవో పట్ల స్థానిక ప్రజలు అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేయడంతో మంత్రి సీతక్క నేతృత్వంలో ఆదివాసీ, గిరిజన ఎమ్మెల్యేలతో సంక్షేమ భవన్ లో జూన్ 10, 2025 సమావేశమై జీవో 49 ను నిలిపి వేయాలని తీర్మాణం చేశారు. సీఎంను ప్రత్యేకంగా కలిసి స్థానిక ప్రజల ఆకాంక్షలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మరో వైపు అటవీ పర్యావరణ శాఖ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి సీతక్క అటవి అధికారులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో 3 జూలై 2025 న సమావేశమై మరో సారి చర్చించి జీవో 49 ని నిలుపు దల చేయాలని నిర్ణయించారు.
అనుగుణంగా సీఎం దృష్టికి తీసుకెల్లి జీవో ను నిలిపుదల చేసేలా ఒప్పించారు. జీవో 49పై స్థానిక ప్రజల ఆకాంక్షల మేరకే ముందుకు వెళుతామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. జీవో 49 మీద ఆదివాసీలు, గిరిజనులకు ఎటువంటి ఆందోళన వద్దని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడవి బిడ్డలకు ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి కొండా సురేఖ అన్నారు.తమ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమమే ధ్యేయం అన్నారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఎమ్మెల్సీ దండే విటల్, మాజీ ఎంపీ సోయం బాబురావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ తదితరులు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: ORR: ఔటర్.. టెర్రర్.. అసలు నిజాలు ఇవిగో!
ప్రభుత్వానికి మంత్రులకు కృతజ్ఞతలు
కేంద్రం ఒత్తిడితో ఆదిలాబాద్ లో జీవో 49 తీసుకురావడం పై స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందని ఎమ్మెల్యే హెడ్మా బొజ్జు(MLA Hedma Bojju) అన్నారు. స్థానిక ప్రజలతో మాట్లాడి సీఎంకు జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao), కొండా సురేఖ(Konda Surekha) రిపోర్ట్ ఇచ్చారన్నారు. జూపల్లి కృష్ణారావు ఆనాడే సమావేశం పెట్టీ జీవో రద్దు చేస్తామని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారన్నారు. జీవో రద్దుకు సహకరించిన మంత్రులు జూపల్లి, కొండా సురేఖ, సీతక్క కు ధన్యవాదాలు తెలిపారు. జీవోను నిలిపివేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలే తెలిపారు. మాజీ ఎంపీ సోయం బాబు రావు మాట్లాడుతూ జీవో 49వల్ల ఆదివాసులకు అన్యాయం జరుగుతుందన్నారు. అటవీశాఖ మంత్రి కొండా సురేఖ కు తెలియకుండా గత ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్లారని ఆరోపించారు. గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపడం వల్లే జీవో విడుదల అయిందన్నారు. ఆదివాసి ప్రజలకు కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు.
Also Read: Congress on KCR KTR: కేటీఆర్ కెసీఆర్ పై సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి ఫైర్
