Revange Case
Viral, లేటెస్ట్ న్యూస్

Viral News: అమ్మను అవమానించిన వ్యక్తి కోసం పదేళ్లు వెతికి.. దొరికిన వెంటనే..

Viral News: సొంత ఊరిలో అందరూ చూస్తుండగా కన్నతల్లిని అవమానించిన ఓ వ్యక్తిపై ఆమె కొడుకు ప్రతీకారం పెంచుకున్నాడు. కడుపులో కసి దాచుకుంటూ ఎదిగాడు. ఆచూకీ కోసం పదేళ్లపాటు అన్వేషించాడు. తాను వెతికిన వ్యక్తి దశాబ్ద కాలం తర్వాత కంటపడడంతో స్నేహితులతో కలిసి పక్కా పథకం వేసి కసితీరా కొట్టికొట్టి చంపేశాడు. సినిమా కథకు ఏమాత్రం తీసిపోని నిజమైన ఈ ప్రతీకార కథ ఉత్తరప్రదేశ్‌లో (Viral News) వెలుగులోచూసింది. కానీ, న్యాయానికి వ్యతిరేకంగా ఆ యువకుడు ఎంచుకున్న మార్గం చివరకు అతడిని జైలుపాలు చేసింది.

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఇటీవల వెలుగుచూసిన ఓ వ్యక్తి హత్య కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. సోనూ కశ్యప్ అనే యువకుడు దాదాపు 10 ఏళ్ల క్రితం తన తల్లిని ఘోరంగా అమానించిన కొబ్బరి బోండాలు అమ్ముకునే మనోజ్ అనే ఓ వీధివ్యాపారిని కిరాతంగా హత్య చేశాడు. పదేళ్లక్రితం ఓ వివాదం విషయంలో సోనూ తల్లిని మనోజ్ తిట్టడమే కాకుండా, చేతులతో నెట్టివేయడంతో ఆమె కిందపడింది. ఇవన్నీ కళ్లారా చూసిన సోనూ తల్లికి అవమానం జరిగిందంటూ రగిలిపోయాడు. అవమానకరమైన ఆ ఘటన తర్వాత నిందితుడు సోనూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కానీ, మనోజ్‌పై ప్రతీకారాన్ని మాత్రం వదలలేదు. ఆ ఘటనను అందరూ మరిచిపోయినా.. సోనూ మాత్రం తన మనసులోనే ఉంచుకున్నాడు. మనోజ్ కోసం ఏకంగా పదేళ్ల పాటు లక్నో వీధుల్లో తీవ్రంగా గాలించాడు. స్నేహితులతో కూడా వెతికించాడు. ఏళ్లు గడిచినా వెతకడం మాత్రం ఆపలేదు. అయితే, దశాబ్ద కాలం తర్వాత వారు వెతికిన మనిషి మనోజ్ ఆచూకీకి గుర్తించారు.

Read Also- Fitness: ఫుడ్‌‌లో ఈ చిన్న మార్పులు చేస్తే చాలు.. అద్భుతమైన ఆరోగ్యం!

దశాబ్దం తర్వాత ప్రతీకారం
నిందితుడు సోనూ మూడేళ్లక్రితమే మనోజ్‌ను లక్నోలోని మున్షీ పులియా ప్రాంతంలో గుర్తించారు. ఆ ఏరియాలో తిరుగుతున్నట్టు నిర్ధారించుకున్నారు. అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు హత్య చేయాలా అని ఎదురుచూశాడు. ఎట్టకేలకు ఇటీవలే తన స్నేహితులు రంజీత్, ఆదిల్, సలాము, రెహ్మత్ అలీలను హత్య చేయడానికి ఒప్పించాడు. హత్య చేయడంలో సాయం చేస్తే పెద్ద పార్టీ ఇస్తానంటూ సోనూ కశ్యప్ చెప్పడంతో స్నేహితులు అంగీకరించారు. దీంతో, ప్లాన్ ప్రకారం మే 22న మనోజ్ ఇంటికి వెళ్తున్న సమయంలో, ఐదుగురు కలిసి అతడిపై ఇనుప రాడ్లతో దాడి చేశారు. మనోజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

Read Also- Mumbai Blasts: ముంబై పేలుళ్ల కేసులో దోషులంతా నిర్దోషులే.. హైకోర్టు సంచలన తీర్పు

ఎలా దిరికారంటే?
మనోజ్‌ను దారుణంగా హత్య చేసిన సోనూ కశ్యప్, అతడి స్నేహితుల కదలికలకు సంబంధించిన దృశ్యాలు ఓ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కానీ, ముఖాలు గుర్తుపట్టలేకపోవడంతో పోలీసులు గుర్తించలేకపోయారు. అయితే, హత్య చేసిన తర్వాత సోనూ తన ఫ్రెండ్స్‌కు భారీ స్థాయిలో మందు పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో, ఆ ఫొటోల్లో ఆరెంజ్ రంగు టీషర్ట్‌తో కనిపించిన ఓ వ్యక్తి.. మనోజ్‌ను హత్య చేసిన నిందితుల్లో ఒకరు ధరించిన టీషర్ట్ మాదిరిగానే అనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే అతడి సోషల్ మీడియా అకౌంట్‌ను చేశారు. అతడిని పట్టుకొని, ఆ తర్వాత మిగతా నలుగురిని కూడా పట్టుకున్నారు. ఈ కేసుపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. నిందితులు సోను, రంజీత్, ఆదిల్, సలాము, రెహ్మత్ అలీ ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నట్టు వివరించారు.

Just In

01

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు