Marriage Issues
Viral

Marriage: పెళ్లి కాని ప్రసాద్‌లకు దడ పుట్టించే వార్త.. వెంటనే చెక్ చేస్కోండి!

Marriage: పెళ్లి.. రెండు మనసులను, రెండు కుటుంబాలను, రెండు జీవితాలను కలిపే ఒక పవిత్ర బంధం. ఇది కేవలం ఒక ఆచారం, వేడుక మాత్రమే కాదు.. ఒక కొత్త ప్రయాణానికి, భాగస్వామ్య జీవితానికి నాంది. సాంప్రదాయకంగా చూస్తే, పెళ్లి అనేది పురుషుడు, స్త్రీ తమ జీవితాంతం కలిసి జీవించడానికి, కుటుంబం పెంచుకోవడానికి, ఒకరికొకరు తోడుగా ఉండటానికి చేసుకునే ఒక ఒప్పందం. ఇది మతపరమైన, సామాజికమైన, చట్టపరమైన గుర్తింపు పొందిన ఒక సంప్రదాయం. అయితే పెళ్లి అనే బంధంపై రోజురోజుకూ ఇప్పుడున్న యువతకు నమ్మకం పోతున్నది. ఎందుకంటే.. ఈ మధ్య జరుగుతున్న కొన్ని సంఘటనలే కారణం. పెళ్లైన కొద్దిరోజులకే ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్యల సంఘటనలు ఎక్కువవుతున్న పరిస్థితుల్లో పెళ్లి చేసుకొని చావడం కంటే.. బ్రహ్మచారిగా బతికేయడమే బెటర్ అన్నట్లుగా యువకులు ఉండిపోతున్నారు. అయితే ఈ మధ్య మరో కొత్త ట్రెండ్‌ను అమ్మాయిల తల్లిదండ్రులు సెట్ చేస్తున్నారు. ఈ దెబ్బతో పెళ్లి చేసుకోవాలనే ఉత్సాహంతో ఉన్న యువకులు కంగుతింటున్న పరిస్థితి. ఇంతకీ అదేమిటి..? ఎందుకింతలా యువత భయపడిపోతున్నారు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘స్వేచ్ఛ’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం వచ్చేయండి..

Read Also- Atchannaidu: ‘ఆడబిడ్డ నిధి’ అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మాల్సిందేనా?

దెబ్బకు పెళ్లి రద్దు!
పెళ్లి చేయాలంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలని పెద్దలు చెబుతుంటారు కదా..? అందరికీ ఈ విషయం గుర్తుండే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. పెళ్లి చేసే ముందు అబ్బాయి ఎలాంటి వాడు? మంచివాడా? కాదా? వాళ్ల ఫ్యామిలీ ఎలాంటిది? ఆస్తిపాస్తులు ఏమాత్రం ఉన్నాయి? ఇలాంటి వివరాలన్నీ అమ్మాయి తరఫు వాళ్లు ఆరా తీస్తారు. మారుతున్న సామాజిక పరిస్థితుల్లో ఈ సమాచారం ఒక్కటే చాలదు. ఇవన్నీ ఒకెత్తయితే పెళ్లి చేసుకోబోయే కుర్రాడి సిబిల్ స్కోర్ కూడా బాగుండాల్సిందే. పొరపాటున తేడాలు ఉంటే మాత్రం పిల్లనివ్వడానికి అమ్మాయి తల్లిదండ్రులు సాహసించట్లేదు. ఇదిగో ఇందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో పెళ్లి రద్దయిన సంఘటనలే చక్కటి ఉదాహరణ. ఆ మధ్య మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో ముర్తిజాపూర్‌కు చెందిన ఒక యువతికి అదే ప్రాంతానికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. పెళ్లికి కొన్ని రోజుల ముందు, వధువు మేనమామ.. అబ్బాయి ఆర్థిక పరిస్థితేంటి? సిబిల్‌ స్కోర్‌ ఎలా ఉంది? అని పరిశీలించాడు. ఇక్కడే ఆ అబ్బాయి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఆ యువకుడు పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు తేలింది. అంతేకాదు.. సిబిల్‌ స్కోర్‌ కూడా తక్కువగా ఉన్నట్లు తెలియడంతో దెబ్బకు పెళ్లి రద్దు చేసుకున్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో బయటికి రాని సంఘటనలు ఒకట్రెండు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటన ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో ఆర్థిక క్రమశిక్షణ, విశ్వసనీయతకు ఎంత ప్రాముఖ్యత ఉందో తెలియజేస్తుంది. ముఖ్యంగా, యువతరం ఆర్థిక నిర్ణయాలు, బాధ్యతలు వారి వ్యక్తిగత జీవితాలపై కూడా ఎలా ప్రభావం చూపుతాయో ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తుంది.

cibil score

ఏమిటీ సిబిల్ స్కోర్?
సిబిల్ స్కోర్ అంటే.. మీరు బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలు, క్రెడిట్ కార్డులు, వాటి తిరిగి చెల్లింపుల చరిత్ర వివరాలను సిబిల్ సేకరిస్తుంది. ఈ సమాచారం ఆధారంగా ఒక క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (CIR) ను రూపొందిస్తుంది. ఈ సీఐఆర్ ఆధారంగానే సిబిల్‌ స్కోర్‌ లెక్కిస్తారు. ఈ స్కోరు 300 నుంచి 900 మధ్య ఉంటుంది. ఇవన్నీ సక్రమంగా ఉంటేనే.. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మీకు రుణాలు (పర్సనల్ లోన్, హోమ్ లోన్, వెహికల్ లోన్ మొదలైనవి) లేదా క్రెడిట్ కార్డులు ఇవ్వాలా? వద్దా? అని నిర్ణయించడానికి ఈ స్కోర్‌ను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటాయి. మీరు తీసుకున్న రుణాల ఈఎంఐ (EMI)లు, క్రెడిట్ కార్డ్ బిల్లులు సకాలంలో చెల్లించారా? లేదా? అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆలస్యంగా చెల్లించినా, చెల్లించకపోయినా స్కోర్ ఆటోమాటిక్‌గా తగ్గుతుంది. చూశారుగా.. అసలే పెళ్లి కావట్లేదనే కుర్రాళ్లకు ఇదొక బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకూ మీరు ఎలా ఉన్నారు? ఎంత పద్ధతిగా ఉన్నారు? అనేది పైకి మాత్రమే కనిపిస్తే సరిపోదు. ఆర్థిక క్రమశిక్షణ కూడా తప్పని సరి అన్న మాట. రానున్న రోజుల్లో ఇలాంటి సిబిల్ తరహా పెళ్లి రద్దు కేసులు ఎక్కువైనా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే.. ఇకనుంచి పైన చెప్పినవ్నీ పాటించడంతో పాటు సిబిల్‌ను చెక్ చేస్కోని తక్కువ ఉంటే ఏం చేయాలి? ఎలా మెయింటైన్ చేయాలనేది తెలుసుకుని జాగ్రత్తగా ఉంటే మంచిది సుమీ..!

Read Also- WAR 2: ‘వార్ 2’ ట్రైలర్ రిలీజ్ అయ్యేది ఆ రోజే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పండగే

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు