Atchannaidu
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Atchannaidu: ‘ఆడబిడ్డ నిధి’ అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మాల్సిందేనా?

Atchannaidu: ‘ఆడబిడ్డ నిధి’ కూటమి పార్టీలు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైనది. 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సున్న మహిళలకు ఆర్థిక సహాయం అందించి, వారికి ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడం పథకం లక్ష్యం. అర్హులైన మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున సంవత్సరానికి రూ. 18వేలు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చింది. మొత్తంగా ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ఆర్థిక సహాయం అందించాలన్నదే ధ్యేయం. ఎన్నికల టైమ్‌లో ఇంత పెద్ద హామీ ఇచ్చిన కూటమి.. గెలిచిన తర్వాత మాత్రం చేతులెత్తేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిగో ప్రభుత్వంలోని పెద్ద తలకాయ, అందులోనూ కీలక శాఖగా మంత్రిగా వ్యవహరిస్తున్న కింజరపు అచ్చెన్నాయుడు కామెంట్స్ విన్న జనాలు, ప్రతిపక్ష వైసీపీ నుంచి ఊహించని రీతిలో రియాక్షన్ వస్తున్నాయి. ‘ ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాల్సి వస్తుంది. ఎన్నికల సమయంలోనే హామీలు నెరవేర్చలేమని అనుకున్నాం. రాష్ట్రానికి వస్తున్న ఆదాయం మొత్తం ఉద్యోగుల జీతాలు, ఫించన్లకు సరిపోతోంది’ అని అచ్చెన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఇస్తామని.. ఇప్పుడు రాష్ట్రాన్ని అమ్మాలంటారా? ఎన్నికల్లో హామీలిచ్చేటప్పుడు తెలియలేదా? అంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి.

Read Also- F-35B Jet: కదిలిన యూకే యుద్ధ విమానం.. భారత్‌కు థ్యాంక్స్

ఆడబిడ్డలు బలి!
చంద్రబాబు మార్క్ మోసానికి మరోసారి ఆడబిడ్డలు బలి అంటూ వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నది. అధికారంలోకి రాగానే నెలకి రూ.1500 చొప్పున 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకి అకౌంట్‌లో వేస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరి సంపద సృష్టించి పేదలకు ఇస్తామన్నావ్ కదా బాబూ? అని వైసీపీ ప్రశ్నిస్తున్నది. నాడు హామీ ఇచ్చి ఇప్పుడు ఆ డబ్బులు అందరికీ ఇవ్వాలంటే ఆంధ్రాని అమ్మాలంటూ మంత్రి అచ్చెన్న వెటకారం చేయడమేంటి? అని రాష్ట్రంలోని మహిళలు, వైసీపీ మండిపడుతున్నది. మరి ఎన్నికల సమయంలో తెలియదా? ఆడబిడ్డల ఉసురు మీకు తగులుతుంది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటూ వైసీపీ శాపనార్థాలు పెడుతున్నది. ఈ మోసంపై రాష్ట్రంలోని మహిళలందరూ వెళ్లి కేసులు పెట్టాలని వైసీపీ నేతలు సూచిస్తున్నారు. ‘ బాబు స్యూరిటీ.. వెన్నుపోటు గ్యారంటీ. 2 కోట్ల మంది మహిళలను ఎంత పబ్లిగ్గా మోసం చేశారో చూడండి. ఎన్నికల ముందు ఓట్ల కోసం ఇంటింటికి వెళ్లి మహిళలకు మాయ మాటలు చెప్పారు. ఇప్పుడేమో ఇలా నమ్మించి నట్టేట ముంచేశారు. సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయాలంటే డ‌బ్బులు కావాలి, ఆడ‌బిడ్డ నిధి ప‌థ‌కం అమ‌లు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మాలి అంటూ మాట్లాడ‌డానికి అచ్చెన్నాయుడికి సిగ్గులేదా? ఎన్నిక‌ల ముందు హామీలు ఇచ్చేట‌ప్పుడు తెలియ‌దా? అప్పుడేమో ఓట్లు కోసం అడ్డమైన హామీలు ఇచ్చి, అధికారంలోకి వ‌చ్చాక ఇలా మాట్లాడమ‌ని మీ నాయ‌కుడు చంద్రబాబు చెప్పారా?’ అని మాజీ మంత్రి రోజా సెల్వమణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Adbidda Nidhi

Read Also- Betting Apps Case: ఈడీ విచారణకు సమయం కోరిన రానా.. భయపడుతున్నాడా?

ఎగనామమేనా?
ఆడబిడ్డ నిధి పథకానికి చంద్రబాబు ఎగనామం పెట్టేశారని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ‘ నాడు రాష్ట్రంలోని మహిళలకి నెలకి రూ.1,500 ఇస్తామని ఎన్నికల్లో కూటమి నేతలు ఊదరగొట్టారు. కానీ, ఇప్పుడు పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మేయాలంటూ అచ్చెన్నాయుడు బుకాయింపు ఏంటి? పథకం అమలు సాధ్యంకాదని అప్పట్లో తమకి తెలుసని కూడా ఒప్పుకోలు. అన్నీ తెలిసి ఆడబిడ్డల్ని చంద్రబాబు మోసం చేశారు. నాడు సంపద సృష్టిస్తామని చెప్పి.. ఇప్పుడు అమ్ముద్దాం ఆంధ్రా అంటారా? ఇప్పుడిక ఆ పథకానికి ఎగనామమేనా?’ అని సోషల్ మీడియా వేదికగా వైసీపీ కార్యకర్తలు నిలదీస్తున్నారు. ‘ ఏడాది దాటినా ఒక్క హామీ అమలు కాదు. ఇంకా సుపరిపాలన తొలి అడుగు అంటారు టీడీపీ వాళ్లు. చంద్రబాబూ మీరిచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఇవేనా? అచ్చెన్నాయుడు ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే రాష్ట్రం అమ్మాలంటారా? సంక్షేమ పథకాలు అమలు చేయలేనప్పుడు ఎందుకిచ్చారు? ఇప్పుడు మహిళలకు ఏమని సమాధానం చెబుతారు?’ అని వైసీపీ నేత బొల్లా బ్రహ్మానాయుడు ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

వీడియో కోసం క్లిక్ చేయండి..

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు