WAR 2 (IMAGE SOURCE :x)
ఎంటర్‌టైన్మెంట్

WAR 2: ‘వార్ 2’ ట్రైలర్ రిలీజ్ అయ్యేది ఆ రోజే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పండగే

WAR 2: యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వార్ 2’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకున్నాయి. ఈ సినిమా ఆగస్టు 14 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తుంటే అభిమానుల అంచనాలు మించి ఉన్నాయి. యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ ను తలపించేలా ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. పాన్ ఇండియా లెవెల్‌ల్లో ఈ సినిమా సత్తా చాటడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించి ప్రచారం మొదలు పెట్టేశారు నిర్మాతలు. సినిమా విడుదల తేదీ సమీపిస్తుండటంతో ట్రైలర్ లాంచ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు. దీంతో ఎన్టీఆర్, హృతిక్ వార్ చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read also- Priyanka Chopra: హాలీవుడ్‌లో ప్రియాంక సక్సెస్ అయ్యిందా? సమీక్ష ఇదిగో

ఇండియన్ సినీ ఇండస్ట్రీకి హృతిక్ రోష‌న్‌, యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన సేవ‌ల‌ను అభినందిస్తూ నిర్మాణ సంస్థ ట్రైల‌ర్ లాంచ్ తేదీని విడుద‌ల చేసింది. 2025లో ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ఇద్దరు గొప్ప స్టార్స్, వారి సినీ ప్రయాణంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ అరుదైన క్షణాలను గొప్పగా సెల‌బ్రేట్ చేసుకోవ‌టానికి జూలై 25న ‘వార్ 2’ ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు య‌శ్ రాజ్ ఫిల్మ్స్ తెలియజేసింది. ఇది ఇద్దరి గొప్ప స్టార్స్ మధ్య జరిగే అద్భుత పోరాటం! జూలై 25 తేదీని మీ క్యాలెండర్‌లో ప్రత్యేకంగా మార్క్ చేసుకోండి అని నిర్మాణ సంస్థ తెలిపింది. ‘వార్ 2’ సినిమాలో హృతిక్ రోష‌న్‌, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి ఓ పాటలో స్టెప్పులెయ్యబోతున్నారు. ఇండస్ట్రీలో ఇద్దరూ మంచి డాన్సర్లు కావడంతో ఈ పాట ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Read also- Atchannaidu: ‘ఆడబిడ్డ నిధి’ అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మాల్సిందేనా?

‘బ్రహ్మాస్త్ర’ వంటి విజువల్ వండర్ ను తెరకెక్కి్ంచిన అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘వార్ 2’ అధికారిక ట్రైలర్ జూలై 25న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ట్రైలర్ కు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్‌ ఇచ్చింది. దీని రన్‌టైమ్ 2 నిమిషాల 39 సెకన్లు గా ఉండనుంది. హృతిక్ రోషన్ ఏజెంట్ కబీర్‌గా జూనియర్ ఎన్టీఆర్ ఏజెంట్ విక్రమ్‌గా నటిస్తున్నారు. ఈ యాక్షన్ చిత్రం వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రానుంది. ఈ సినిమాకు సంబంధించి తెలుగు థియేట్రికల్ రైట్స్ ప్రముఖ నిర్మాత నాగ వంశీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ట్రైలర్ లో ఎన్టీఆర్ యాక్షన్ చూడటానికి అభిమానులు ఎదురు చూస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు