Viral Video (Image Source: Twitter)
Viral, లేటెస్ట్ న్యూస్

Viral Video: బెడిసికొట్టిన బెంజ్ కారు స్టంట్.. ఇక జన్మలో మళ్లీ చేయడు!

Viral Video: సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం యూత్ పడుతున్న పాట్లు అన్ని ఇన్నీ కావు. రాత్రికి రాత్రి హీరో అయిపోవాలన్న అత్యాశతో అనాలోచితంగా స్టంట్స్ చేస్తున్నారు. ముందు వెనక ఆలోచించకుండా కొత్త సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా గుజరాజ్ లోని ఓ బీచ్ లో యువకుడు ప్రదర్శించిన అత్యుత్సాహం.. అతడ్ని చిక్కుల్లో పడేలా చేసింది. ఖరీదైన మెర్సిడీస్ బెంజ్ కారు (Mercedes Benz Car)తో తీరం వెంబడి స్టంట్ చేయడానికి ప్రయత్నించి.. ఊహించని సమస్యను కొని తెచ్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.

అసలేం జరిగిందంటే?
గుజరాత్ (Gujarat) సూరత్ లోని డుమాస్ బీచ్ (Dumas Beach) లో ఓ యువకుడు తన మెర్సిడెస్ బెంజ్ కారుతో స్టంట్ చేసేందుకు యత్నించాడు. దీంతో కారు సముద్రపు బురదలో కూరుకుపోయింది. భారీ వర్షాలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఉన్న సమయంలో అతడు ఈ స్టంట్ కు యత్నించడం గమనార్హం. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో బీచ్ లో వాహనాల రాకపోకలను అధికారులు నిషేధించారు. అయినప్పటికీ వారి కళ్లుకప్పి సదరు యువకుడు కారుతో బీచ్ లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులు కారును బయటకు తీసేందుకు కష్టపడుతున్న వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారింది.

Also Read: Artificial Sweeteners: చక్కెరకు బదులుగా వీటిని వాడుతున్నారా? అయితే మీ గుండె మటాషే!

నెటిజన్లు సెటైర్లు!
వర్షం కారణంగా బీచ్ లోని ఇసుక మరింత మెత్తగా మారడంతో కారు సముద్ర ఒడ్డున ఇసుకలో చిక్కుకుపోయిందని అధికారులు తెలియజేశారు. వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా కారు యజమని ఎవరు? ఆ ఘటన ఎప్పుడు జరిగింది? అన్నది ఆరా తీస్తున్నట్లు ట్రాఫిక్ ఏసీపీ ఎస్.ఆర్. టండేల్ తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే అతడు తన కారును బురద నుంచి బయటకు తెచ్చుకోగలిగాడో లేదో ఇంకా తెలియరాలేదు. కాగా ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక జన్మలో ఇలాంటి స్టంట్ మళ్లీ చేయడని సదరు యువకుడిపై సెటైర్లు వేస్తున్నారు.

Also Read This: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. కదిలిన ఫారెస్ట్ యంత్రాంగం.. అటవీ భూమి ఆక్రమణలకు చెక్!

Also Read This: Tollywood: పెళ్లి కాకుండానే తల్లైన రామ్ చరణ్ బ్యూటీ.. బేబీ బాయ్ కి వెల్కమ్ అంటూ పోస్ట్?

Just In

01

Daggubati Family Case: నాంపల్లి కోర్టుకు దగ్గుబాటి సోదరులు.. హాజరు కాకపోతే నోటీసులు జారీ!

CM Revanth Reddy: గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి.. అనుమ‌తులివ్వాలని కేంద్ర మంత్రికి వినతి

Telangana Electricity: రికార్డును బ్రేక్ చేసేలా విద్యుత్ వినియోగం.. ఎంత వాడారో తెలిస్తే షాక్ కావాల్సిందే..?

N Ramchandra Rao: పరీక్ష హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం: రాంచందర్ రావు

KCR: కవిత లొల్లితో కేసీఆర్‌‌కి చిక్కులు.. సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి..?