YS Jagan Arrest
ఆంధ్రప్రదేశ్

Liquor Scam Case: లిక్కర్ కేసులో వైఎస్ జగన్ అరెస్ట్‌కు బ్రేక్ పడిందా?

Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతున్న లిక్కర్ స్కామ్ కేసులో ‘పెద్ద తిమింగళం’ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనా? అంతిమ లబ్ధిదారు ఆయనేనా? లిక్కర్ వ్యవహారంలో వైసీపీ ముఠాను తెరవెనుక ఉండి నడిపింది జగన్ రెడ్డేనా? ప్రతి నెలా రూ.50-60 కోట్ల ముడుపులు అంటే ఇంచుమించు ఐదేళ్లలో మొత్తం రూ.3,500 కోట్లపైనే అందాయా? అంటే తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, ఛార్జ్‌షీట్‌.. అధికార టీడీపీ మంత్రుల నోట వస్తున్న మాటలను బట్టి చూస్తే అక్షరాలా నిజమేనని అనిపిస్తున్నది. ఇంతకీ ఛార్జ్‌షీట్‌లో వైఎస్ జగన్ పేరు ఎందుకొచ్చింది? ఎక్కడ్నుంచి ఎక్కడికి ముడుపులు వెళ్లాయి.. ఎవరి ద్వారా వెళ్లాయి? ముడుపుల సొమ్ములో ఎన్నికలకు ఎంత ఖర్చు పెట్టారు? మొత్తమ్మీద మాజీ సీఎం అరెస్ట్ ఎప్పుడు ఉండొచ్చు? ఈ అరెస్ట్‌పై గవర్నర్ ఏమంటున్నారు? వ్యతిరేకించారా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు? గవర్నర్ నుంచి వచ్చిన రెస్పాన్స్ తర్వాత టీడీపీ, ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న ఏమిటి? వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు ఏమిటి? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ‘స్వేచ్ఛ’ సంచలన కథనం..

పెద్ద కథే నడుస్తోందిగా!
లిక్కర్ కేసులో ఇప్పటి వరకూ ఒక లెక్క.. వైసీపీ కీలక నేత, ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఓ లెక్క అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే జగన్ ఓఎస్డీగా ఉన్న కృష్ణ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం, తాజాగా అధినేతకు లెఫ్ట్ హ్యాండ్‌గా, అత్యంత ఆప్తుడుగా ఉన్న మిథున్ రెడ్డి అరెస్ట్‌తో ఇక మిగిలింది వన్ అండ్ ఓన్లీ మాజీ సీఎం మాత్రమేనని ప్రభుత్వ, టీడీపీ వర్గాల్లో పెద్ద ఎత్తునే ప్రచారం జరుగుతోంది. ఇక సోషల్ మీడియాలో నడుస్తున్న హడావుడి గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అరెస్ట్ తర్వాత అసలు వైసీపీ పార్టీ ఉంటుందా? అన్నట్లుగా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇక మంత్రులు, సీనియర్లు, మాజీ మంత్రులు మీడియా ముందుకొచ్చి ఏ రేంజిలో విమర్శలు, తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారో రెండ్రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. ఇక సిట్ (ప్రత్యేక దర్యాప్తు సంస్థ) దర్యాప్తు లోతుగా చేస్తున్న కొద్దీ అటు తిరిగి.. ఇటు తిరిగి వైఎస్ జగన్ వైపే అన్ని వేళ్లూ చూపిస్తున్నాయన్నది టీడీపీ, ప్రభుత్వ వర్గాలు లోలోపల చర్చించుకుంటున్న మాట. కాగా, రాజ్‌ కెసిరెడ్డి నుంచి మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, గోవిందప్ప బాలాజీలకు.. ఆ ముగ్గురి నుంచి జగన్‌కు ముడుపులు అందాయన్నది ప్రధాన ఆరోపణ. అలా ముడుపుల సొత్తులో రూ.200-300 కోట్లు ఎన్నికల్లో ఖర్చు చేయగా, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు మిగిలిన ముడుపుల సొత్తు అందినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. చివరికి భారీ మొత్తంలో సొమ్ము దుబాయ్‌కు తరలించినట్లుగా ప్రాథమిక అభియోగపత్రంలో వెల్లడి అయినట్లుగా సమాచారం. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అయితే ఏకంగా త్వరలోనే పెద్ద తిమింగళం త్వరలోనే బయటికొస్తుందని పరోక్షంగా జగన్‌ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. దీంతో మాజీ సీఎం అరెస్ట్ దాదాపు ఫిక్స్ అయినట్టేనని అర్థం చేసుకోవచ్చు.

Read Also- Vice President: కాబోయే ఉపరాష్ట్రతి ఎవరు.. తెలుగు రాష్ట్రాల నుంచేనా?

గవర్నర్ ఒప్పుకోవట్లేదా?
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అరెస్టు చేయడానికి గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి.. మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడానికి గవర్నర్ అనుమతి అవసరం లేదు. ఎందుకంటే తప్పుచేసిన తర్వాత మాజీ ముఖ్యమంత్రిని కూడా సాధారణ పౌరుడిగానే పరిగణిస్తారు. నేరం, ఆరోపణలు ఉన్నప్పుడు అరెస్టు చేయడానికి సాధారణ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నిబంధనలు వర్తిస్తాయి. అయితే సిట్ అధికారులు మాత్రం వైఎస్ జగన్ అరెస్ట్ విషయంలో తొందరపడకుండా న్యాయ పరంగా చిక్కులు లేకుండా ప్లానింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. విచారణ లేకుండానే నేరుగా అరెస్ట్ చేయొచ్చు లేదా విచారణ చేసి ఆ రోజు లేదా మరుసటి రోజు విచారణ విషయాలను, కోర్టు అభిప్రాయాలను నిశితంగా గవర్నర్‌కు తెలియజేసి ఆ తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే జగన్ అరెస్ట్‌కు రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ అస్సలు ఒప్పుకోవట్లేదట. ఎందుకంటే జరగని లిక్కర్ స్కామ్‌ను జరిగినట్లుగా చిత్రీకరిస్తున్నారని, ఆధారాలు చూపకపోవడం, కేవలం ఇన్వాయిస్‌లు, సెల్ టవర్ లోకేషన్‌లో మాత్రమే ఉన్నాయని చెబుతుండటంతో అసలు ఈ కేసు నిలబడుతుందా? అరెస్ట్ తర్వాత పరిస్థితేంటి? అని గవర్నర్ ప్రశ్నిస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే అబ్దుల్ నజీర్‌ను వేరే రాష్ట్రానికి పంపి ఆ తర్వాత కొత్త గవర్నర్ వచ్చిన తర్వాత ప్రక్రియ ప్రారంభించాలనే యోచనలోనూ ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లుగా టాక్ నడుస్తున్నది. అంటే జగన్ అరెస్ట్ ప్రక్రియ గవర్నర్ దగ్గరే బ్రేక్ పడిందన్న మాట.

Read Also- Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా.. సడన్‌గా ఎందుకు?

పెద్ద అగ్నిపరీక్షే?
జగన్ అరెస్ట్, ఆ తర్వాత జరిగే పరిణామాలు అటు సిట్.. ఇటు పోలీసులకు పెద్ద అగ్ని పరీక్షే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే 16 నెలలు జైల్లో ఉన్న జగన్‌ తిరిగొచ్చి ఎంచక్కా రాజకీయాలు చేసుకున్నారు.. 2019 ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని రీతిలో 151 అసెంబ్లీ సీట్లతో అధికారంలోకి వచ్చారు. అలాంటిది ఇంత చిన్న లిక్కర్ కేసు ఏ మాత్రం జగన్‌పైన ప్రభావం చూపదని.. అరెస్ట్ చేసినా సరే బెయిల్ వస్తారు అంతేకదా..? అంతకుమించి చేయడానికి ఏముంది? అన్నది వైసీపీ నేతలు లోలోపల చర్చించుకుంటున్నారట. మరోవైపు.. అక్రమాస్తుల కేసు, వివేకా హత్య కేసులాంటి పెద్ద పెద్దవే తమను ఏమీ చేయలేవని ఇదివరకే వైసీపీ నేతలు నిరూపించి చూపించారు. అందుకే రేపొద్దున్న అరెస్ట్ సంగతి అటుంచితే విచారణకు పిలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఒక్కసారి ఊహించుకోవచ్చని పోలీసు బాస్‌లు కూడా లోలోపల చర్చించుకుంటున్నారట. మొత్తమ్మీద జగన్‌ను అరెస్ట్ చేస్తే ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు, పవన్‌లకే నష్టమే తప్ప మాజీ సీఎంకు ఏమాత్రం నష్టం లేదని.. అటు అరెస్ట్ అయ్యి.. ఇటు బెయిల్‌పై వచ్చి మునుపటిలాగే రాజకీయాలు చేసుకుంటారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే జగన్‌కు ఇదొక సానుభూతే అని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో అరెస్ట్ చేయడానికే ప్రభుత్వ పెద్దలు మొగ్గు చూపుతారో లేకుంటే సైలెంట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Read Also- Viral News: ఇదేం పరిస్థితి బాబోయ్.. ఇక అద్దెలు చెల్లించేదెలా?

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?