Journalists Protest: ఆయనో అధికార పార్టీ ఎమ్మెల్యే అనేక సార్లు ఓడిపోతే పాపం అని ప్రజలు సానుభూతితో 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించారు. అప్పటికే నోటి దురుసు ఎక్కువ దానికి పదవి తోడు కావడంతో ఆయన నోటికి అద్దు అదుపు లేకుండా పోయిందని, నాయకులు, అధికారులు అనే తేడా లేకుండా ఎవరైనా నోటికి ఎంత వస్తే అంత దుర్భాషతో దూషిస్తున్నాడని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది అధికారులు ఎమ్మెల్యే నీటిదురుసుకు బయపడి అక్కడ పని చేయడానికి జంకుతున్నారు. సదరు ఎమ్మెల్యే ఇప్పుడు పాత్రికేయులను కూడా వదలకుండ దుర్భశలాడారు. మీరు నా వార్తలు రాసిన ఒక్కటే రాయకున్న ఒక్కటే మీరు నన్ను ఏం చేయలేరు. నాకు వ్యతిరేకంగా రాసి మీరు ఏం చేస్తారు అంటూ ఎమ్మెల్యే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) చేసిన తీవ్ర వాక్యాలకు వ్యతిరేకంగా పాత్రికేయులు రోడ్డు ఎక్కారు. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు.
ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం స్థానిక కాకతీయ ప్రెస్ క్లబ్(Kakatiya Press Club) ఆధ్వర్యంలో పాత్రికేయులు ధర్నా నిర్వహించారు. దుర్భాషలాడిన ఎమ్మెల్యే తీరును ఖండిస్తూ పాత్రికేయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లాలో జరిగిన మంత్రుల పర్యటన కార్యక్రమాలను ముకుమ్మడిగా బహిష్కరించారు. ఎమ్మెల్యే అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తూ స్థానిక ప్రెస్ క్లబ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి, ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. వెంటనే ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ధర్నాతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. దీంతో స్థానిక సిఐ నరేష్ కుమార్, ఎస్సై సాంబమూర్తిలు చేరుకొని పాత్రికేయులకు నచ్చజెప్పి ధర్నాను విరమింప చేశారు.
మీరు నా వార్తలు రాస్తే
ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalpally) జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్(Congress) పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ముందు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) విలేకరుల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేశారని పాత్రికేయులు ఆరోపించారు. మీరు నా వార్తలు రాస్తే రాయకుంటే ఎంత ? మీరు రాయకుంటే అయ్యేది ఏముంది. నాకు వ్యతిరేకంగా రాసి ఏం చేస్తారు అంటూ తీవ్ర పదజాలంతో దూషించారని పాత్రికేయులు ఆరోపించారు. పాత్రికేయులనుద్దేశించి అసభ్యకరంగా మాట్లాడిన స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణ రావు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకపై ఇలాంటి పరిస్థితి పునరావృతం అయితే చూస్తూ ఊరుకునేది లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎమ్మెల్యే క్షమాపణ చెప్పకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని పాత్రికేయులు హెచ్చరించారు.
Also Read: Alampur Highway: నేషనల్ హైవే రోడ్డు పక్కనే తాగుతున్న పట్టించుకునే నాథుడే కరువు
ఎమ్మెల్యే భూతు పురాణం ఆపరా?
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాణ రావు భూతు పురాణం ఆపకపోవడంపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అధికారులను, నాయకులు, కార్యకర్తలను తీవ్ర పదజాలంతో దూషిస్తుండడం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కొంత మంది అధికారులను కూడ నోటికి వచ్చింది ఆపకుండ తీవ్ర పదజాలంతో దూషిస్తున్నడంతో వారు ఈ నియోజకవర్గంలో పనిచేయడానికి ఇబ్బంది పడుతున్నారని ఆరోపణ తీవ్రంగా ఉన్నాయి.
ఆ మాటలే తిరిగి ఎమ్మెల్యేను అంటే
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పలువురిని నిత్యం తీవ్ర పదజాలతో దూషిస్తున్నాడంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనే ఆయన బూతు పురాణం పై చర్చ జరిగింది. ఎమ్మెల్యే(MLA)గా ఎన్నికైన తర్వాత ఆయన దూషణలు తీవ్రతరమయ్యాయని విమర్శలు వస్తున్నాయి. ప్రజా ప్రతినిధిగా ఆదర్శంగా ఉండాల్సిన ఒక ఎమ్మెల్యే నూటికి వచ్చినట్లుగా దుర్భాషలాడడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యే దుబ్బాషలతో బాధపడే వారు తిరిగి అదే పదజాలంతో ఎమ్మెల్యే ను దూషిస్తే ఎలా ఉంటదో ఒక్కసారి ఆలోచించుకోవాలని ఎమ్మెల్యేకు ఆయన శేభిలాషులు సూచిస్తున్నారు. ఇప్పటికైన ఎమ్మెల్యే తన తీరు మార్చుకుని హుందాగా నడుచుకొని ఆదర్శంగా నిలవాలని ప్రజలు రాజకీయ విశ్లేషకులు కోరుతున్నారు.
Also Read: Vizag Scam: వైజాగ్‌లో అంబేద్కర్ పేరిట భారీ మోసం.. బోర్డు తిప్పేసిన మ్యాక్స్!