Vizag Scam
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Vizag Scam: వైజాగ్‌లో అంబేద్కర్ పేరిట భారీ మోసం.. బోర్డు తిప్పేసిన మ్యాక్స్‌!

Vizag Scam: విశాఖపట్నంలో భారీ మోసం వెలుగు చూసింది. అధిక వడ్డీ ఆశ చూపి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.. రూ.100 కోట్లు వసూలు చేసిన స్నేహా మ్యాక్స్‌ (స్నేహ మ్యూచువల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ) సంస్థ చివరికి బోర్డు తిప్పేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. సంస్థ ఛైర్మన్‌, విశ్రాంత ఐఆర్‌ఎస్‌ శివభాగ్యరావు కోసం గాలిస్తున్నారు. సంస్థ డైరెక్టర్లు, కొంతమంది ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న శివభాగ్యారావు ఆచూకీ ఇంకా దొరకలేదు. కాగా, స్నేహ మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ సొసైటీ పేరుతో 2008 నుంచి రిటైర్డ్, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి 12 శాతం వడ్డీ హామీతో డిపాజిట్లు స్వీకరించడం మొదలుపెట్టారు. అలా ఇప్పటి వరకూ 2,500 మంది నుంచి మొత్తం రూ.100 కోట్లు సేకరించారు. చివరికి బోర్డు తిప్పేశారు. మ్యాక్స్ కంపెనీ చేతిలో మోసపోయామని గ్రహించిన బాధితులు స్థానికంగా ఉన్న దువ్వాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, మొదట్లో కొంతమందికి వడ్డీ చెల్లించి నమ్మకం కల్పించినా, ఆ తర్వాత కార్యాలయాలను మూసివేసి బోర్డు తిప్పేయడం గమనార్హం. పోలీసులు ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. శివభాగ్యారావును పట్టుకుంటే మోసం వెనుక ఉన్న పూర్తి వివరాలు బయటపడే అవకాశం ఉంది. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

Read Also- AP Politcs: ఏపీలో వారసుల రాజకీయ భవిష్యత్తేంటి..?

ఎలా జరిగింది?
విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి కటికల శివభాగ్యారావు ‘అంబేద్కర్ ఆశయాల సాధన’ పేరుతో ‘స్నేహ మ్యూచువల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ’ ని 2008లో స్థాపించారు. ఈ పేరుతో ప్రజలను సులభంగా నమ్మించారు. ఈ సంస్థ తమ వద్ద డబ్బు డిపాజిట్ చేస్తే 12 శాతం వడ్డీ చెల్లిస్తామని నమ్మబలికింది. ముఖ్యంగా దళితుల సంక్షేమానికి సంస్థ లాభాలను ఉపయోగిస్తామని చెప్పడంతో అనేకమంది నమ్మారు. దీంతో వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, పదవీ విరమణ పొందినవారు సహా దాదాపు 2,500 మంది వరకు సభ్యులుగా చేరారు. వీరంతా లక్షలాది రూపాయలు డిపాజిట్లు, ఇతర పద్దుల కింద జమ చేశారు. మొత్తం సుమారు రూ.100 కోట్లు వసూలు చేసింది సదరు కంపెనీ. మొదట్లో కొంతకాలం సక్రమంగా వడ్డీ చెల్లించిన సంస్థ, ఆ తర్వాత కార్యకలాపాలను తగ్గించుకుంటూ వచ్చింది. ఛైర్మన్ శివభాగ్యారావు అందుబాటులో లేకుండా పోవడంతో బాధితులకు అనుమానం కలిగింది. విశాఖ స్టీల్‌ప్లాంట్ విశ్రాంత ఉద్యోగి ఎన్. బాలభాస్కరరావు మరో పది మందితో కలిసి దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.

Read Also- Hardik Pandya: హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంలో మరో కీలక పరిణామం?

ఆరుగురి అరెస్ట్..
పోలీసులు రంగంలోకి దిగి సంస్థకు చెందిన ఆరుగురిని అరెస్టు చేశారు. వారిలో వైస్ ప్రెసిడెంట్ ఎం. శ్రీనివాసరావు, డైరెక్టర్లు గూడూరు సీతామహాలక్ష్మి, మాటూరి శ్రీనివాసరావు, ఉండవల్లి శ్రీనివాసరావు, ఎల్. విశ్వేశ్వరరావు, మేనేజర్ రంగారావు, అకౌంటెంట్ ధనలక్ష్మి ఉన్నారు. వీరిని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి శివభాగ్యారావు ప్రస్తుతం పరారీలోనే ఉన్నాడు. అతనితో పాటు మరో 12 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. శివభాగ్యారావును పట్టుకుంటే ఈ మోసం వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్, ఇతర వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మోసపోయిన బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు అభయమిచ్చారు. అయితే.. సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా సొంత ఆస్తులు కూడబెట్టుకున్నారని బాధితులు చెబుతున్నారు.

Read Also- Viral News: 9 నెలల్లో మృత్యువు.. విలువైన సలహాలు కోరిన యువతి

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?