Alampur Highway: తెలంగాణ, ఏపీ బార్డర్ నేషనల్ హైవే 44 గుండా ఉన్న దాబాలలో అక్రమ సిట్టింగ్ ల దందా జోరుగా సాగుతోంది. దాబాల యజమానులకు పోలీసులు ఎక్సైజ్ ఆఫీసర్లు (Excise officers) సహకరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలంపూర్ (Alampur) నియోజకవర్గంలో నేషనల్ హైవే వెంబడి రోడ్డు అంచున,మార్జిన్ లలో నిలిపే వాహనాలతో (National Highway) జాతీయ రహదారులు నిత్యం ఎక్కడో ఒకచోట రక్తమోడుతున్నాయి. అర్ధ రాత్రుళ్లు అడ్డగోలుగా మద్యం లభి స్తుండటంతో వాహనదారులు తాగు తున్నారు. మత్తులో గమ్యస్థానా లకు చేరకుండానే ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని జాతీయ రహదారుల వెంటనున్న దాబాలు, హోటళ్లలో అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.
Also Read: Telangana BJP: పార్టీలో ఆధిపత్య పోరుకు చెక్ పెట్టేందుకేనా?
తెలంగాణ, ఏపీ బార్డర్ కావడంతో ఏపీకి చెందిన వారితోపాటు ఆలంపూర్ (Alampur) నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన వారు వచ్చి దాబాలలో యధేచ్చగా సిట్టింగ్ లు వేసినా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మందుబాబులు హల్చల్ చేస్తున్నా సిట్టింగులు పెట్టుకున్న ఎవరు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు సామాన్యుల నుంచి వినిపిస్తున్నాయి. ముందు రెస్టారెంట్ బోర్డు పెట్టి వెనకాల సిట్టింగ్ లు పెడుతూ యదేక్షగా రూల్స్ బ్రేక్ చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. నేషనల్ హైవే పై అటు కర్నూల్ బార్డర్ నుంచి బీచుపల్లి బ్రిడ్జి వరకు స్టేజీల దగ్గర, కొత్తకోట, జడ్చర్ల సమీపాలలోని ఇరువైపులా ఉన్న దాబాలలో సిట్టింగుల దందా జోరుగా సాగుతున్న అటు నేషనల్ హైవే అథారిటీ అధికారులు, ఎక్సైజ్, సివిల్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. మామూళ్ల మత్తులో ఎక్సైజ్, పోలీస్ ఆఫీసర్లు జోగుతున్నారనే విమర్శలు ప్రజల నుంచి వస్తున్నాయి..
రూల్స్ బ్రేక్ చేస్తున్నా
వైన్స్ టెండర్లలో వైన్స్ వచ్చిన వారు ఎక్కడైనా రెస్టారెంట్ పెట్టాలన్న వైన్ షాప్ పెట్టాలన్న ప్రభుత్వం రూల్స్ పెట్టింది. నేషనల్ హైవేస్, అంతర్రాష్ట్ర రహదారుల సమీపంలో వైన్స్ రెస్టారెంట్లు పెట్టకూడదని 220 మీటర్ల దూరంలో వీటిని పెట్టాలని రూల్స్ చెబుతున్నాయి. కానీ రోడ్డు పక్కనే ఫ్యామిలీ రెస్టారెంట్ల పేరుతో హోటల్స్, దాబాలు పెట్టి వెనకాల లిక్కర్ బాబుల కోసం సిట్టింగ్ లు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమతో పాటు ఆలంపూర్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల లిక్కర్ బాబులు ఉదయమే అక్కడ తిష్ట వేసేసి రాత్రి వరకు పీకల దాకా తాగేసి రోడ్లెక్కేస్తున్నారే విమర్శలు ఉన్నాయి. ఆయా పరిధిలోకి వచ్చే పోలీస్ స్టేషన్ల వారికి, ఎక్సైజ్ ఆఫీసర్లకు మామూళ్లు ఇచ్చి ఈ దందాలను జోరుగా నడుపుకుంటున్నారనే చర్చ జోరుగా సాగుతోంది.
రోడ్ల పక్కన తాగుతున్న పట్టించుకోవట్లే
నేషనల్ హైవే ఎర్రవల్లి చౌరస్తా నుండి కర్నూల్ కి వెళ్ళే రోడ్ వెంబడి ముఖ్యంగా టోల్ ప్లాజా అటు ఐదు కిలోమీటర్లు ఇటు ఐదు కిలోమీటర్ల దూరంలో లిక్కర్ బాబుల హంగామా జోరుగా ఉంటుందని విమర్శలు ఉన్నాయి. గత ఏపీ ప్రభుత్వంలో మద్యంపై ఆంక్షలు ఉండడంతో కర్నూలు నుంచి సమీపంలోని అలంపూర్ కు మందుబాబులు బారులు కట్టేవారు.టోల్ గేట్ అటు ఇటు దాదాపు పది కిలోమీటర్ల దూరంలో హైవే వెంబడి జాతర తలపించేది.. ఇంత పెద్ద మొత్తంలో కూర్చొని మందు తాగుతున్న ఎవరు కూడా చర్యలు తీసుకోకపోవడం పట్ల పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
దాబాలలోనే లిక్కర్
నేషనల్ హైవే పక్కన ఉన్న దాబాలు, ఫ్యామిలీ రెస్టారెంట్లు బెల్ట్ షాపులను తలపిస్తున్నాయి. వైన్ షాపులో నుంచి పెద్ద మొత్తంలో ఒకేసారి బీర్లు, లిక్కర్ తీసుకొచ్చి ధాబాలు ఫ్యామిలీ రెస్టారెంట్ లోని ఫ్రిజ్ లలో నిల్వ ఉంచుతున్నారు. ఎమ్మార్పీ కంటే ఒక్కొక్కదానిపై 50 రూపాయలు ఎక్కువ డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక బీరు ఎంఆర్పి 240 రూపాయలు ఉంటే దానిని 290 రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. బయట వైన్ షాపులు ఓపెన్ చేసే టైంలో ఎంఆర్పి కంటే 50 రూపాయలు ఎక్కువ తీసుకోవడం. వైన్ షాపులు 10 గంటలకు క్లోజ్ చేసే టైం దాకా ఎమ్మార్పీ కంటే 70 నుంచి 100 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా చికెన్, పుల్కాలు,వాటర్ బాటల్స్, స్నాక్స్,,సిగరేట్స్, బిర్యానీలు ఇలా ఒక్కొక్క సిట్టింగ్ వారికి పెద్ద మొత్తంలో గిరాకులు అవుతుండడంతో లిక్కర్ బాబులకు సిట్టింగ్ లు ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తున్నది.
తాగి డ్రైవ్ చేయడంతోనే యాక్సిడెంట్లు
డ్రంక్ చేసి డ్రైవ్ చేయడం ద్వారానే ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్నాయని పోలీసుల ఎంక్వయిరీలో తేలుతోంది. టౌన్, చిన్న చిన్న విలేజ్ లలో డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టె పోలీసులు నేషనల్ హైవే పై పట్టపగలే దాబాలు, ఫ్యామిలీ రెస్టారెంట్లలో లిక్కర్ కోసం సిట్టింగ్ ఏర్పాటు చేస్తున్న ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాహనాలు నడిపే డ్రైవర్లు నేషనల్ హైవేపై మద్యం సేవించి నడుపుతున్న ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని వాహనదారులు వాపోతున్నారు.
నేషనల్ హైవేపై ప్రయాణిస్తూ మత్తులో గమ్యస్థానాలకు చేరకుండానే ప్రమాదాలకు గురవుతున్నారు. తాగిన వారితోపాటు సుదూర ప్రాంతాలకు వెళ్లే అమాయక వాహనదారులు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.రాంగ్ రూట్ లో ఫాస్ట్ గా వస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నా సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆక్సిడెంట్ ల సంఖ్య పెరిగిపోతుందని, దీంతో అమాయకులు బలవుతున్నారని వాహనదారులు వాపోతున్నారు. హైవే, పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు అక్రమ మద్యం వ్యవహారాలపై దృష్టి సారించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Also Read: Bonalu Festival: 24 చారిత్రక ఆలయాల దగ్గర ఒకేసారి వేడుక