Bhatti Vikramarka: ఇందిరమ్మ పాలనలో అమలు చేస్తున్న పథకాలన్నీ ప్రజలకు చేరువ అయ్యేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, దళిత బంధు లబ్ధిదారుల నిధులు కలెక్టర్ల ఖాతాల్లో ఉన్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు(Bhatti Vikramarka Mallu) పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలోని మధిర మండలం చింతకాని మండలం గాంధీనగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఆనందోత్సవాల మధ్య భూమి పూజా కార్యక్రమం, నూతన గ్రామపంచాయతీ కార్యాలయం ప్రారంభించారు. మధిర నియోజకవర్గం లోని చింతకాని మండలంలో దళిత బంధు లబ్ధిదారులకు రెండో విడత నిధులకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
నిధులు జిల్లా కలెక్టర్ ఖాతాలో
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ తాను సీఎల్పీ నేతగా ఉన్నప్పుడు చింతకాని మండలాన్ని దళిత బంధు పథకం(Dalit Bandhu Scheme) కింద పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారని, దళిత బంధు లబ్ధిదారులందరికీ నిధుల పంపిణీ ప్రక్రియ కార్యక్రమం కొనసాగుతుందని ఎన్నికల తదుపరి తాను ప్రకటించినట్టుగా ఈరోజు చెక్కుల పంపిణీ చేపట్టినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) తెలిపారు. చింతకాని మండలంలో మొత్తం 3465 మంది లబ్ధిదారులు ఉండగా వారందరికీ సంబంధించిన పూర్తి నిధులు జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ చేసినట్టు వివరించారు. ఇందులో 1387 యూనిట్ల వారు విక్రయించడం, భారీ మళ్లించడం చేశారని చెప్పారు. దళిత బంధు యూనిట్లు ఇతరులు కొనుగోలు చేయడం, లబ్ధిదారులు వాటిని అమ్ముకోవడం చట్ట ప్రకారం చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు.
Also Read: ICC CLT: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆ టోర్నీ మళ్లీ వచ్చేస్తోంది!
చెక్కులు పొందిన లబ్ధిదారులు
దళిత బంధు యూనిట్ లన్నింటిని జిల్లా అధికారులు విచారిస్తున్నారని తెలిపారు. 214 మంది ప్రస్తుతం లబ్ధిదారుల విచారణ పూర్తి చేసి రెండో విడత నిధులు పొందేందుకు అర్హులని గుర్తించి వారికి చెక్కుల పంపిణీ చేస్తున్నట్లుగా వివరించారు. ప్రస్తుతం చెక్కులు పొందిన లబ్ధిదారులు వృత్తి, వ్యాపారాలు చక్కగా నిర్వహించుకునే ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. అది పొందిన వారు చక్కగా తమ తమ కార్యక్రమాలను, వ్యాపారాలను నిర్వహించి ఆదర్శంగా నిలిస్తే మిగిలిన లబ్ధిదారులు స్ఫూర్తి పొంది అధికారులకు పూర్తిగా సహకరిస్తారని వెల్లడించారు. అలాగే రాబోయే అవకాశంలో లబ్ధిదారులకు మంచి అవకాశాలు పొందేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. దారి తప్పిన దళిత బంధు యూనిట్లే వివరాలు ఇస్తే అధికారులు వాటిని విచారించి తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి(Collector Anudeep Durisetty) పాల్గొన్నారు.
అన్నదాతల్లో ఆనందం
భట్టి విక్రమార్క నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినా వర్షమే ఆయన వస్తూనే వర్షాన్ని వెంటబెట్టుకోస్తారు అన్న మాట నియోజకవర్గమంతా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వర్షం అంటే పల్లె జనం అంతా హర్షిస్తారు. దానికి తోడు వరాలు కురిపించే, అభివృద్ధి పూలు పూయించే మనసున్న నేతకు వర్షం జత కావడంతో నియోజకవర్గం అంతటా ఆనందోత్సాహాలు వ్యక్తం అయ్యాయి. భారీ వర్షం అయినప్పటికీ తమ మనసున్న నాయకుడు వెంట పిల్లలు మొదలు, వృద్ధుల వరకు కండువాలు కప్పుకొని రైతులు, మహిళలు, కేరింతలతో చిన్నారులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంట పరుగులు తీశారు. గత వానాకాలం సీజన్లోనూ ఈ తరహా పరిస్థితి కనిపించిందని సర్వత్ర చర్చ మొదలైంది. తాజా వర్షాలతో ఇక పాడి పంటలకు కొదవలేదని రైతులు(Farmers) ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారీ వర్షం అయినప్పటికీ నిర్దేశించుకున్న కార్యక్రమాలన్నీ భారీ జనసందోహం మధ్య విజయవంతంగా కొనసాగాయి.
Also Read: Heavy Rains: తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక.. రెండ్రోజులు జర జాగ్రత్త