Big Alert Rains
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Heavy Rains: తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక.. రెండ్రోజులు జర జాగ్రత్త

Heavy Rains: తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక.. మరో రెండ్రోజులుగా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇంతకీ దేని గురించి? ఎందుకీ జాగ్రత్తలు అనుకుంటున్నారా అదేనండోయ్ శుక్రవారం నాడు హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన గుర్తుంది కదా.. సరిగ్గా అదే రేంజిలోనే సోమవారం, మంగళవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలంగాణను అలర్ట్ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ శాఖ డైరెక్టర్ డా. కె. నాగరత్నం ఆదివారం సాయంత్రం హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మొత్తం 12 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా ప్రాంతాల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా, నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారడం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Read Also- ICC CLT: క్రికెట్ ఫ్యాన్స్‌‌కు గుడ్‌న్యూస్.. ఆ టోర్నీ మళ్లీ వచ్చేస్తోంది!

ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
ఆదివారం దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాలైన వికారాబాద్, గద్వాల్, నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి, ములుగు, జయశంకర్, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక మిగిలిన ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు అవుతాయని అధికారులు తెలిపారు. వర్షాలతో పాటుగానే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. సోమవారం, మంగళవారం మాత్రమే కాదు.. ఈ నెల 24 వరకు రాష్ట్రంలో వర్షాలు కొనసాగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

హైదరాబాద్ పరిస్థితేంటి?
భాగ్యనగరం విషయానికొస్తే.. గత 3 రోజులతో పోలిస్తే హైదరాబాద్‌లో వర్షపాతం తీవ్రత తగ్గే అవకాశం ఉన్నది. అయినప్పటికీ, సాయంత్రం నుంచి రాత్రి సమయాల్లో అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ఇప్పటికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో రెండ్రోజులు అంటే పరిస్థితి ఎలా ఉంటుందో అని నగర వాసులు ఆందోళన చెందుతున్నారు. వర్షపాతం కారణంగా ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో భాగ్యనగర వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల నివాసితులు, నదులు, ప్రాజెక్టుల తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మరీ ముఖ్యంగా.. అత్యవసరమైతే తప్ప బయట ప్రయాణాలు మానుకోవాలని సూచిస్తున్నారు.

Read Also- Live in Relationship: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. నాలుగేళ్లుగా సహజీవనం.. సీన్ కట్ చేస్తే!

మేమున్నామని..!
మరోవైపు.. సిటీలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న అలర్ట్ రావడంతో హైడ్రా రౌండ్ ది క్లాక్ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకున్నది. ముఖ్యంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో గుర్తించిన చిన్న, మధ్య, భారీ తరహా వాటర్ లాగింగ్ పాయింట్లపై స్పెషల్‌ ఫోకస్ చేసింది. ప్రజల నుంచి ఫిర్యాదు రాగానే డీఆర్ఎఫ్ కంట్రోల్ రూమ్ ఫీల్డ్ లెవెల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్‌ను అప్రమత్తం చేస్తున్నది. స్పాట్‌కు చేరిన తర్వాత, వాటర్ లాగింగ్‌ను క్లియర్ చేసిన తర్వాత ఫోటోలను అప్‌లోడ్ చేయాలని కచ్చితమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సంవత్సరం నుంచి వర్షాకాల సహాయ చర్యలు, వచ్చే సంవత్సరం నుంచి నాలాల పూడికతీత పనుల బాధ్యతను జీహెచ్ఎంసీ నుంచి హైడ్రాకు ముమన్సిపల్ శాఖ బదలాయించడంతో సహాయక చర్యల నిర్వహణపై హైడ్రా తొలిసారి అయినప్పటికీ, ప్రజలకెలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. కానీ అలవాటులో పొరపాటుగా వర్షం కురుస్తున్నపుడు వాటర్ లాగింగ్ పాయింట్, చెట్లు విరిగిపడడం, ఇంట్లోకి వర్షపు నీరు ప్రవహించడం వంటి సమస్యలకు సంబంధించి పౌరుల నుంచి వచ్చే ఫిర్యాదులను హైడ్రాకు ఫార్వర్డ్ చేస్తామని టోల్ ఫ్రీ 040 21111111 సిబ్బంది తేల్చి చెబుతున్నారు. హైడ్రా కూడా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 040 29555500, 9000113667, ఇంటిగ్రేటెడ్ సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ 8712674000 నెంబర్‌లను కూడా ఫిర్యాదుదారులకు చెప్పాలని సిబ్బందిని జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశించారు.

Read Also- Heart health: ప‌ర‌గ‌డుపున ఈ ఆకులను తింటే.. గుండె వ్యాధులకు చెక్ పెట్టొచ్చని తెలుసా?

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్