Gadwal Municipality (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Gadwal Municipality: పర్మిషన్ ఒకచోట నిర్మాణాలు మరొక చోట

Gadwal Municipality: గద్వాల మున్సిపాలిటీలో అంతా గందరగోళం నెలకొన్నది. పర్మిషన్లు ఒకచోట నిర్మాణాలు మరొకచోట చేపడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. అదేవిధంగా కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తున్నప్పటికీ వాటికి కూడా రెసిడెన్షియల్ పర్మిషన్లు ఇస్తూ పెద్ద ఎత్తున మున్సిపాలిటీ, టౌన్ ప్లానింగ్ అధికారులు దండుకుంటున్నారు. గద్వాల జిల్లా(Gadwal District) కేంద్రంలో షాపింగ్ కాంప్లెక్స్‌లు, బంకేట్ హాల్స్, లాడ్జ్‌ల నిర్మాణాలకు కూడా రెసిడెన్షియల్ పర్మిషన్లు ఉన్నాయంటే గద్వాల మున్సిపాలిటీలో ఎంత అవినీతి జరుగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వీటిపై ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాధుడే మున్సిపాలిటీలో కరువయ్యారని గద్వాల పట్టణ కాలనీవాసులు, పట్టణ ప్రజలు చెబుతున్నారు. గద్వాల టౌన్ లోని గల్లీలకు వెళ్లే రోడ్లను సైతం కబ్జా చేసి ఇండ్లు నిర్మిస్తున్నా మున్సిపాలిటీ ఆఫీసర్లు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని పలువురు కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.

మున్సిపాలిటీలో శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ఇల్లీగల్‌గా నిర్మాణాలు చేస్తున్నారని పలువురు వాపోతున్నారు. మున్సిపాలిటీలోనే కోల్డ్ వార్(Cold War) ఉండడంతో కిందిస్థాయి సిబ్బంది ఆడింది ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వ స్థలాలు కబ్జాకి గురి కావడం గల్లీలకు వెళ్లే రోడ్లు ఆక్రమించుకొని ఇల్లీగల్ ఇంటి నిర్మాణాలు పెద్ద ఎత్తున చేపడుతున్నారు.

నెంబర్లు లేకున్నా అక్కడ నిర్మాణాలు
గద్వాల మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణాలు చేపట్టాలంటే డాక్యుమెంటు పక్కాగా ఉండాలి. ఎల్పీ నెంబర్లు అన్నీ కూడా సవ్యంగా ఉండాలి. ఎల్పీ నెంబర్లు లేకున్నా ఎక్కడ నిర్మాణాలు చేపట్టిన ఎవరు అడిగే వారు లేకపోవడంతో ఫేక్ ఎల్ పి నంబర్లు సృష్టించి అగ్రికల్చర్ ల్యాండ్ లో నిర్మాణాలు చేపడుతున్నారు. గద్వాలలోని సర్వేనెంబర్ 673 లో భూమి ఉన్నది. అందులో డాక్యుమెంట్ నెంబర్ 1316 /2000 ప్రకారం 25 గంటల భూమి ఇద్దరు వ్యక్తులు బాగా పరిష్కారం చేసుకున్నారు. ఇందులో హద్దులుగా తూర్పు బుచ్చన్న భూమి, పడమర వాళ్ల సొంత భూమి, ఉత్తరమున ఇంద్రానగర్, దక్షిణమున సొంత భూమి ఉన్నట్లు చూపించారు. ఇది ప్రస్తుతం అగ్రికల్చర్ ల్యాండ్ గా ఉన్నది. ఇక్కడ ఎల్ పి తీసుకోకుండానే అక్రమంగా ఇంటి నిర్మాణాన్ని చేపడుతున్నారు. అదే సర్వేనెంబర్ డాక్యుమెంట్ నెంబర్ 44 27/2009 లో సేల్ కం జిపి డాక్యుమెంట్ నెంబర్ 44 27/ 2009 లో ప్లాట్లు ఉన్నాయి.

Also Read: Fish Venkat: రెండు పెళ్లిళ్లు.. ఫిష్ వెంకట్‌పై ఇప్పుడెందుకు ఆ రూమర్స్!

ఇది ఇద్దరి మధ్య జాయింట్ వెంచర్‌గా ఉండి ఎల్ పి(LP) నంబర్ 138/94 ఉన్నది. దీనికి హద్దులు కూడా వేరే ఉన్నాయి. 13 16 / 2000 డాక్యుమెంట్ నెంబర్ వ్యవసాయ భూమిలో ఫేక్ ఎల్ పి నంబర్ పెట్టి ఇండ్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. భూమిని చూపెట్టి అక్కడ ఇండ్లు నిర్మాణాలు చేస్తున్నట్లు పర్మిషన్ తీసుకొని అగ్రికల్చర్ ల్యాండ్(Agriculture Land) లో నిర్మాణాలు చేపడుతూ గద్వాల మున్సిపాలిటీ తో పాటు తెలంగాణ(Telangana) ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. అదేవిధంగా చిన్న అగ్రహారం సమీపంలోని జానకమ్మ సత్రానికి వెళ్లే గల్లీ రోడ్డును ఆక్రమించి వేరే దగ్గర పర్మిషన్ తీసుకొని కబ్జా చేసిన జాగాలో ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. అక్కడ వేరే పాడుబడ్డ భవనాన్ని కొనుగోలు చేసి కాలనీకి వెళ్లే గల్లీ రోడ్డును కబ్జా చేసి షాపింగ్ కాంప్లెక్స్ తో పాటు ఇండ్ల నిర్మాణానికి చేపడుతున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్ర బ్యాంకు పక్కన కూడా చిత్తారి వీధికి వెళ్లే గల్లీ రోడ్డును కబ్జా చేసి పర్మిషన్ లేకుండానే కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపట్టారనే విమర్శలు ఉన్నాయి.

రెసిడెన్షియల్ పర్మిషన్ తో కాంప్లెక్స్ నిర్మాణాలు
గద్వాల మున్సిపాలిటీలో రెసిడెన్షియల్ పర్మిషన్ తో జోరుగా కాంప్లెక్స్ నిర్మాణాలు సాగుతున్నాయి. రెసిడెన్షియల్ పర్మిషన్లతో షాపింగ్ కాంప్లెక్స్, బంకేట్ హాల్స్, లాడ్జిల నిర్మాణం చేపడుతున్నారు.దీంతో పెద్ద ఎత్తున గద్వాల మున్సిపాలిటీ ఆదాయానికి గండిపడుతున్నది. దీని అడ్డుకోవాల్సిన ఆఫీసర్లు చోద్యం చూస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

మున్సిపాలిటీలో కోల్డ్ వార్
గద్వాల మున్సిపాలిటీలో ఆఫీసర్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నది. దీంతో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రచ్చ చేసుకుంటున్నారు. మున్సిపల్ కమిషనర్ వర్సెస్ రెవెన్యూ సెక్షన్ లోని ఒక ఆఫీసర్ మధ్య గోల్డ్ వార్ ఉన్నది. రెవెన్యూ సెక్షన్ లోని ఒక ఆఫీసర్ కమిషనర్ ను డమ్మీ చేసి రెవెన్యూ సెక్షన్ ను ఆంటిపెట్టుకొని వసూళ్ల పర్వానికి తెరలేపారనే విమర్శలు ఉన్నాయి. ఒక స్కూల్ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే దానికి రెసిడెన్షియల్ కింద పర్మిషన్ ఇవ్వడానికి మూడు లక్షల రూపాయలు డీల్ కుదుర్చుకున్నారనే ఆరోపణలు మున్సిపాలిటీలో షికార్లు చేస్తున్నాయి. మున్సిపాలిటీలో పనిచేసే సిబ్బంది జీతాలు ఇవ్వాలన్న సెలవులు మంజూరు చేయాలన్న ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన వారు కొందరు పైసలు వసూలు చేస్తున్నారని పలువురు కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇలా అంతా గందరగోళంగా గద్వాల మున్సిపాలిటీ పాలన కొనసాగడంతో పారిశుధ్య పనులు కూడా అస్తవ్యస్తంగా మారి ప్రజలకు ఇబ్బందికరంగా మారుతున్నాయి.

ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటాం
పర్మిషన్ ఒకచోట నిర్మాణాలు ఒకచోట జరుగుతున్న దానిపై పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటాం. గద్వాల మున్సిపాలిటీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాం. పారిశుధ్య పనులు ఎప్పటికప్పుడు చేయిస్తున్నాం. ఆరోపణల అన్నింటిపై ఎంక్వయిరీ చేయిస్తామని స్పెషల్ ఆఫీసర్ నర్సింగరావు అన్నారు.

Also Read: Minister: అసెంబ్లీలో మంత్రి పాడుపని.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారుగా!

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు