Minister: ఒక లీడర్ ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచి.. అందులోనూ మంత్రి అయ్యారంటే మామూలు విషయమేమీ కాదు. అలాంటిది చట్ట సభల్లోకి అడుగుపెడితే ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడానికి సాయశక్తులా ప్రయత్నాలు చేయాలి. అలాంటిది ఇదిగో ఈ మంత్రిగారు చేసిన పనేంటో చూడండి. అసెంబ్లీకి వెళ్లి బీజేపీ మంత్రి రమ్మీ ఆడారు. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్‌రావు కోకాటే (Manikrao Kokate) రమ్మీ ఆడుకుంటూ టైమ్ పాస్ చేశారు. రెడ్ హ్యాండెండ్‌గా మంత్రి అందరికీ దొరికిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు మీడియా, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఫోన్‌లో ఆటలు ఆడుకోవడం ఏంటి? అని ప్రత్యర్థులు, ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారంపై అజిత్ పవార్ వర్గానికి చెందిన రోహిత్ పవార్ (Rohit Pawar) తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో రోజూ సగటున 8 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, లెక్కలేనన్ని వ్యవసాయ సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇలాంటి సమయంలో వ్యవసాయ మంత్రి రమ్మీ ఆడటం ఎంత హాస్యాస్పదమో? అని ప్రశ్నించారు. ఈ జవాబుదారితనం లేని మంత్రులు, ప్రభుత్వం ఎప్పుడైనా రైతుల పంటల బీమా, రుణమాఫీ, మద్దతు ధర కోసం చేసే విజ్ఞప్తులను పట్టించుకుంటారా? అని పవార్ ప్రశ్నించారు. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రతిపక్షాలు మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ పెరుగుతోంది.
Read Also- Vizag Scam: వైజాగ్‌లో అంబేద్కర్ పేరిట భారీ మోసం.. బోర్డు తిప్పేసిన మ్యాక్స్!
అబ్బే నేను ఆడలే!
మాణిక్‌రావు కోకాటే తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తాను యూట్యూబ్‌లో దిగువ సభ కార్యకలాపాలను చూస్తున్నప్పుడు ‘జంగ్లీ రమ్మీ’ ప్రకటన పాపప్ అయిందని, దాన్ని క్లోజ్ చేయడానికి 5 నుంచి 10 సెకన్లు మాత్రమే పట్టిందని తనను తాను సమర్థించుకున్నారు. ‘నేను ఎటువంటి పాపం చేయలేదు’ అని తాను ఎటువంటి ఆట ఆడలేదని, వీడియోను సందర్భం లేకుండా చిత్రీకరించారని తెలిపారు. అంతేకాదు.. ఇది రమ్మీ కాదని ‘సాలిటైర్ గేమ్’ అని.. అది తన సహచరులు ఎవరైనా డౌన్‌లోడ్ చేసి ఉంటారని కూడా చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అయితే వీడియోలో రమ్మీ ఆడుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుండటం గమనార్హం. అయినా సరే తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకుంటూ ఉండటం ఎంతవరకూ సమంజసం. కాగా, మాణిక్‌రావు గతంలో కూడా కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. నకిలీ కేసుకు సంబంధించి గత ఫిబ్రవరిలో ఆయనకు శిక్ష పడినప్పటికీ, సెషన్స్ కోర్టు స్టే ఇవ్వడంతో ఎమ్మెల్యే పదవిని నిలబెట్టుకోగలిగారు. గతంలో రైతులకు సంబంధించిన వ్యాఖ్యలపై కూడా ఆయన విమర్శలను ఎదుర్కొన్నారు. ఈ సంఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఒక హాట్ టాపిక్‌గా మారింది. మంత్రి వివరణ ఎంతవరకు విశ్వసనీయమో, ప్రతిపక్షాలు దీనిపై ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి. కాగా, విదర్భ ప్రాంతంలో వేలాది మంది రైతులు విస్తృత వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read Also- Harish Rao: విద్యార్థి, యువకులతో హరీశ్ రావు స్ట్రాటజీ!
బాధ్యత లేకపోతే ఎలా?
ఒక మంత్రిగా, ప్రజా ప్రతినిధిగా అసెంబ్లీలో ప్రజల సమస్యలపై చర్చలు జరుగుతున్న సమయంలో ఇలా ఫోన్‌లో ఆటలు ఆడటం బాధ్యతారాహిత్యాన్ని, ప్రజల పట్ల గౌరవం లేకపోవడాన్ని సూచిస్తుంది. వాస్తవానికి.. అసెంబ్లీ సమావేశాలకు కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చవుతుంది. ఇటువంటి నిర్లక్ష్యపు చర్యలు ఆ నిధుల దుర్వినియోగానికి సమానం. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఇటువంటి సంఘటనలు ప్రజల్లో ప్రభుత్వంపైన, ప్రజాస్వామ్య వ్యవస్థపైన విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తాయి. ప్రజా సేవకుడిగా తన విధులను సక్రమంగా నిర్వర్తించాల్సిన నైతిక బాధ్యత మంత్రికి ఉంది. ఈ చర్య ఆ నైతిక విలువలను ఉల్లంఘించినట్లు అవుతుంది. సోషల్ మీడియాలో, మీడియాలో మంత్రి వ్యవహారంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాగా, ఈ ఘటనపై ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించవచ్చు లేదా మంత్రిపై ఏదైనా క్రమశిక్షణా చర్య తీసుకోవచ్చు.
వీడియోలో క్లియర్ కట్‌గా..
“#जंगली_रमी_पे_आओ_ना_महाराज…!”
सत्तेतल्या राष्ट्रवादी गटाला भाजपला विचारल्याशिवाय काहीच करता येत नाही म्हणूनच शेतीचे असंख्य प्रश्न प्रलंबित असताना, राज्यात रोज ८ शेतकरी आत्महत्या करत असताना सुद्धा काही कामच नसल्याने कृषिमंत्र्यांवर रमी खेळण्याची वेळ येत असावी.
रस्ता भरकटलेल्या… pic.twitter.com/52jz7eTAtq
— Rohit Pawar (@RRPSpeaks) July 20, 2025