Fish Venkat
ఎంటర్‌టైన్మెంట్

Fish Venkat: రెండు పెళ్లిళ్లు.. ఫిష్ వెంకట్‌పై ఇప్పుడెందుకు ఆ రూమర్స్!

Fish Venkat: ఒక వైపు మనిషి చనిపోయి ఆ ఫ్యామిలీ బాధలో ఉంటే, లేని పోని రూమర్స్ క్రియేట్ చేస్తూ.. ఆ ఫ్యామిలీని మరింత బాధలోకి నెట్టేస్తున్నారు కొందరు నెటిజన్లు. ఫిష్ వెంకట్‌ కిడ్నీ సంబంధిత వ్యాధితో గత కొంత కాలంగా ఇబ్బంది పడుతూ, శుక్రవారం రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆ కుటుంబానికి చేయూతని ఇవ్వకపోయినా పరవాలేదు కానీ, లేని పోని రూమర్స్ స్ర్పెడ్ చేసి, ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులకు మరింత బాధ కలిగిస్తున్నారు. ఫిష్ వెంకట్ రెండు కిడ్నీలు ఫెయిల్ అవడానికి కారణం ఆయన స్వయం తప్పిదమే. కాదనలేం. అందులోనూ ఒకసారి దెబ్బతిని కోలుకున్న తర్వాత కూడా తాగుడుకు బానిసై, మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో, ఈసారి ఆయనని ఆదుకునేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు.

Also Read- Fish Venkat: ముంగిలంపల్లి వెంకట్ నుంచి ‘ఫిష్’ వెంకట్‌‌గా ఎలా మారాడు?

కిడ్నీ మార్పిడికి దాదాపు రూ. 50 లక్షలు కావాల్సి వచ్చిన సమయంలో ఏ ఒక్క దాత ముందుకు రాలేదని, ఆ ఫ్యామిలీ కన్నీటిపర్యంతమవుతుంది. ఒకరిద్దరు మీడియం రేంజ్ హీరోలు రెండేసి లక్షలు చొప్పున ఆదుకున్నా, అవి దేనికి సరిపోవు. అలాగే కిడ్నీ దాత కూడా సరైన సమయానికి దొరకలేదు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించి, శుక్రవారం రాత్రికి మరింతగా విషమించింది. దీంతో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఫిష్ వెంకట్ మృతితో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి, దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. ఈ స్థితికి కారణం ఇదేనంటూ కొందరు ఫిష్ వెంకట్ గురించి రకరకాలుగా వార్తలు వైరల్ చేస్తున్నారు. ఆయన రెండు పెళ్లిళ్లు చేసుకున్నారని, సంపాదించినదంతా ఈ క్రమంలోనే పోగోట్టుకున్నారని, అందుకే ఇప్పుడిలాంటి పరిస్థితి వచ్చిందనేలా కామెంట్స్ చేస్తున్నారు.

ఇందులో నిజం ఉండొచ్చు, ఉండకపోవచ్చు.. కానీ, అలాంటి మాటలు మాట్లాడడానికి ఇది సమయం కాదు. ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలా?. తాగుడు, ఇతరత్రా వ్యసనాలు ఉన్నాయని ఆ ఫ్యామిలీ మెంబర్సే స్వయంగా చెప్పారు. ఆయన ఆరోగ్యం అంతగా పాడవడానికి కారణం కూడా తాగుడుకు బానిసవడం వల్లే అంటూ రీసెంట్‌గా హాస్పిటల్‌లో ఆయన భార్య, కుమార్తె చెప్పారు. ఇది వాళ్లే చెప్పారు కాబట్టి.. ఇప్పుడు కొత్త కొత్త రూమర్స్ ప్రచారం చేసి, సానుభూతి చూపించాల్సిన టైమ్‌లో కోపగించుకునేలా చేయడం కరెక్ట్ కాదు. ఇక రెండు పెళ్లిళ్లు అనే విషయానికి వస్తే.. ఇలాంటి వార్తలు గతంలో ఓసారి వచ్చినప్పుడు, ఆయన కుమార్తె ఒక్కొక్కరికి ఇచ్చి పడేశారు.

Also Read- Fish Venkat: ఫిష్ వెంకట్ మృతికి వాళ్లే కారణమా.. ఫ్యాన్స్ సాయం తప్ప సినీ ఇండస్ట్రీలో ఒక్కరూ కూడా చేయలేదా?

గతంలో ఓసారి ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు, ఆయన కుమార్తె స్పందిస్తూ.. ‘‘నాన్న ఆరోగ్యం విషయంలో మేమంతా ఆందోళ‌న చెందుతుంటే ఇలా త‌ప్పుడు ప్ర‌చారాలు ఎందుకు చేస్తున్నారు? మా నాన్న రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు అనే దానికి ప్రూఫ్ ఉందా? ఓకే, నిజంగా మీరన్నట్లు రెండో పెళ్లి చేసుకుని ఉంటే, ఇప్పుడామె ఎక్క‌డుందో కూడా చెప్పండి? మా నాన్న రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు అనే దానిలో వాస్త‌వం లేదు. ఇలాంటి స‌మ‌యంలో మా బాధ‌ని అర్థం చేసుకోండి. దయచేసి లేనిపోని రూమ‌ర్స్ సృష్టించ‌కండి’’ అని వేడుకున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే