Nara Lokesh
ఆంధ్రప్రదేశ్

Nara Lokesh: పెట్టుబడుల కోసం పోటీ.. జనవరిలో క్వాంటమ్ కంప్యూటర్!

Nara Lokesh: ది ఇనిస్ట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) అన్నది భారతదేశ మేధోశక్తికి వెన్నెముక లాంటిదని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఐసీఏఐ స్థాపించి 76 ఏళ్లు నిండినా ఆ సంస్థ ఇప్పటికీ యవ్వనంగానే ఉందన్నారు. ఇది భారతదేశంలో అతిపెద్ద సంస్థగా మాత్రమే కాదని, ప్రపంచంలోనే అతిపెద్ద అకౌంటింగ్ పవర్‌హౌస్‌గా ఉందని వెల్లడించారు. శనివారం గుంటూరు బండ్లమూడి గార్డెన్స్‌లో ఐసీఏఐ గుంటూరు చాప్టర్ ఆధ్వర్యాన ‘స్పూర్తి’ పేరుతో నిర్వహించిన మెగా సీఏ విద్యార్థుల సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఐసీఏఐ ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన, విశ్వసనీయ సంస్థగా గుర్తింపు పొందిందన్నారు. ‘ ప్రపంచంలో ఫోరెన్సిక్ అకౌంటింగ్ ప్రమాణాలతో పనిచేస్తున్న మొట్టమొదటి సంస్థ ఇది. ఐసీఏఐ ద్వారా 10లక్షలమందికి పైగా చార్టర్డ్ అకౌంటింగ్ విద్యను అభ్యసిస్తుండగా, ప్రతిఏటా 2లక్షలమంది పరీక్షలు రాస్తున్నారు. 4.07 లక్షల మంది సభ్యులు, 54 విదేశీ చాప్టర్లు కలిగిన అతిపెద్ద సంస్థ ఐసీఏఐ. వ్యాపారం ఎక్కడ ఉంటే భారత్ అక్కడ ఉంటుంది, భారత్ ఎక్కడ ఉంటే అక్కడ ఐసీఏఐ ఉంటుంది’ అని లోకేష్ వెల్లడించారు.

Read Also- JC Prabhakar: నీ అంతు చూస్తా.. రేయ్ ఏంట్రా నీ ఓవరాక్షన్!

నిబద్ధతతో కూడుకున్న విద్య!
భారతదేశం గర్వించదగిన ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) కుటుంబసభ్యులు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను చార్టర్డ్ అకౌంటెంట్ కాకపోయినా స్టాన్ఫోర్డ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్‌గా సీఏ ప్రాధాన్యత నాకు తెలుసు. ఇది కేవలం ఒక కోర్సు కాదు, నిబద్ధత కూడుకున్న విద్య. మా కుటుంబ వ్యాపారాల్లో సీఏల కష్టాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. వ్యాపారాల్లో స్పష్టత లోపించినపుడు మేము సీఏ వైపే చూస్తాం. పాలనా వ్యవస్థలో బడ్జెట్ ఆమోదం ఉన్న ప్రతి ప్రభుత్వ ఫైల్‌కు ఆడిటర్ల ఆమోద ముద్ర అవసరం. వ్యవస్థపై నమ్మకం కోసం మేము చార్టర్డ్ అకౌంటెంట్‌పై ఆధారపడతాం. సీఏలు కేవలం సంఖ్యా విశ్లేషకులు మాత్రమే కాదు, వారు ఆర్థిక వృద్ధి చోదకులు. వారు వ్యాపారాలకు మూలధనాన్ని సేకరించడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి సహాయం చేస్తారు. సేకరించిన ప్రతి రూపాయి, సృష్టించబడిన ప్రతి ఉద్యోగం కథలో సీఏ పాత్ర ఉంటుంది. మా ప్రభుత్వం సీఏల ఇన్‌పుట్‌లకు విలువ ఇస్తుంది. పాలనా నిర్ణయాలలో మేము సీఏలను సంప్రదిస్తాము. మీరు బ్యాలెన్స్ షీట్‌లను మాత్రమే ధృవీకరించరు.. రాష్ట్ర ఆర్థిక వెన్నెముకను తయారు చేస్తారు. న్యూ ఏజ్ సీఏ అనేది కాలిక్యులేటర్ కంటే ఎక్కువ. నేటి సీఏలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచవ్యాప్తంగా అవగాహన, ఏఐ ఆధారిత కమ్యూనికేషన్, నైతికత కలిగి ఉండాలి అని లోకేష్ తెలిపారు.

Read Also- AM Rathnam: ఆ అనుభవంతో చెప్తున్నా.. ‘హరి హర వీరమల్లు’ పెద్ద హిట్!

సీఏ ఫ్యాక్టరీ గుంటూరు..
భారతదేశ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఫ్యాక్టరీ గుంటూరు నగరం. ఆశ్చర్యకరంగా గుంటూరు సిటీ వైద్యులు, ఇంజనీర్లకంటే ఎక్కువగా సీఏలను తయారుచేస్తోంది. డాక్టర్లు, ఇంజనీర్లకంటే సీఏ చదువుతున్న 10వేలమంది విద్యార్థుల సంఖ్య ఎక్కువ. అత్యుత్తమ ప్రతిభ, అధిక ఉత్తీర్ణత శాతంతో సమున్నత లక్ష్యాలు కలిగిన చార్డర్డ్ అకౌంటెంట్లు గుంటూరుకే సొంతం. గుంటూరు నుండి గల్ఫ్, అమెరికా, ఆస్ట్రేలియా వరకు విస్తరించిన తెలుగు సీఏలు భారతదేశం గర్వపడేలా ప్రతిభను చాటుతున్నారు. సీఏ వృత్తిలో ప్రవేశించడం కష్టం, విస్మరించడం అసాధ్యం. సిఎ కోర్సు కష్టతరమైనది అయినప్పటికీ యువతను ఉన్నత శిఖరాల్లో నిలబెడుతుంది. వజ్రాన్ని తయారుచేయడం ఎంతకష్టమో సీఏ డిగ్రీ సాధించడం కూడా అంతే కష్టం. సీఏ వృత్తిపన్నులు, చట్టం, బ్యాంకింగ్, పెట్టుబడులు, సాంకేతికత, విధానం వంటి రంగాల్లో విస్తరించి ఉంది. ప్రతి బ్యాలెన్స్ షీట్ వెనుక ఒక టాలెంట్ బ్రెయిన్ ఉంటుంది. ఆ బ్రెయిన్ పేరే చార్టర్డ్ ఎకౌంటెంట్. వికసిత్ భారత్‌లో భాగంగా 2047నాటికి $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్నది ప్రధాని మోదీజీ ఆకాంక్ష కాగా, అందులో $2.4 ట్రిలియన్ సాధించాలన్నది ఆంధ్రప్రదేశ్ లక్ష్యం. ఇది కఠినమైనది అయినప్పటికీ అసాధ్యం కాదు. భారతదేశానికి గర్వకారణంగా నిలిచే భవిష్యత్ ఆర్థిక వృద్ధిలో భాగస్వామి కావడం ఏపీ బాధ్యతగా భావిస్తోంది అని లోకేష్ తెలిపారు.

చంద్రబాబు నుంచి స్ఫూర్తి
సౌత్ ఆసియాలోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ జనవరిలో అమరావతిలో ఆవిష్కృతం కాబోతోంది. గతంలో జన్మభూమి, స్వయం సహాయక సంఘాలు, ఈ-గవర్నెన్స్, ఐటీ హబ్‌లతో రాష్ట్ర చిత్రపటాన్ని మార్చేసిన చంద్రబాబు.. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీతో ఏపీ రూపురేఖలు మార్చబోతున్నారు. మేం మార్పుకోసం వేచిచూడకుండా ఇక్కడ నుంచే మార్పునకు శ్రీకారం చుడుతున్నాం. పెట్టుబడుల కోసం పొరుగు రాష్ట్రాలతో పోటీపడుతున్నాం. అభివృద్ధి కోసం పోటీపడతామే తప్ప.. రాజకీయ ఘర్షణ మా అభిమతం కాదు. అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో ముందుకు వెళ్తున్నాం. కర్నూలులో డ్రోన్ సిటీ, కడపలో స్టీల్ ప్లాంట్, విశాఖలో ఏ ఎన్ ఎస్ ఆర్, సత్వ జిసిసితో పాటు ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంటు రాబోతున్నాయి. నేను విజనరీ లీడర్ చంద్రబాబు నుంచి స్ఫూర్తి పొందాను. ఆయన 75ఏళ్ల వయసులో 25 ఏళ్ల యువకుడిలా పనిచేస్తున్నారు. మాన్యుఫాక్చరింగ్, ఎనర్జీ, ఐటి, ఫార్మా… అన్ని రంగాల్లో ఏపీని నెం.1 గా నిలపాలన్నదే మా లక్ష్యం. రాబోయే మూడేళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తెచ్చేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నా. యువత రాజకీయాల్లోకి రావాలి, తెలుగుదేశం పార్టీ యువత, విద్యావంతులను ప్రోత్సహిస్తుంది. మహిళా సాధికారిత ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యం. మార్పు మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి. 1992లో చంద్రబాబు ప్రారంభించిన హెరిటేజ్‌ను నా తల్లి భువనేశ్వరి, భార్య బ్రహ్మణి సమర్థవంతంగా నిర్మిస్తున్నారు అని లోకేష్ వెల్లడించారు.

Read Also- Etela New Party: తెలంగాణలో పెను సంచలనం.. త్వరలో ఈటల కొత్త పార్టీ.. పేరు కూడా ఫిక్స్!

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ