JC Prabhakar
ఆంధ్రప్రదేశ్

JC Prabhakar: నీ అంతు చూస్తా.. రేయ్ ఏంట్రా నీ ఓవరాక్షన్!

JC Prabhakar: జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఈ పేరు వినగానే వివాదాలు గుర్తుకు రావడం సహజం. ఆయన తరచుగా తన మాటలు, చేతలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన వ్యవహార శైలి, ముఖ్యంగా కఠినమైన భాష ఉపయోగించడం, ప్రత్యర్థులను మొదలుకుని ప్రభుత్వ అధికారుల వరకూ నోటికి ఎంత మాటొస్తే అంత మాట అనేయడం, తీవ్రంగా దుర్భాషలు ఆడటం తరచుగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి టీడీపీకి ఎంత వ్యతిరేకత కావాలో మొత్తం జేసీ ప్రభాకర్ రెడ్డే (JC Prabhakar Reddy) బాధ్యతలు తీసుకుని ఇస్తున్నారనే విమర్శలు, అంతకుమించి ఆరోపణలు సొంత పార్టీ కార్యకర్తలు, నేతల నోట వస్తుండటం గమనార్హం. ఇప్పటి వరకూ మనం ప్రత్యర్థులు, సొంత పార్టీపై తీవ్ర పదజాలంతో మాట్లాడటం చూశాం కదా. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ అధికారి.. అందులోనూ బహిరంగంగానే వేలెత్తి చూపిస్తూ మరీ, వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. ఇదిగో.. గవర్నమెంట్ అధికారిని ఎట్టా మాట్లాడుతున్నారో ఒక్కసారి చూడండి.

Read Also- Viral News: మరిదితో వివాహేతర సంబంధం.. భర్తను ఎలా చంపారంటే?

అసలేం జరిగింది?
జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం జిల్లా పంచాయతీ అధికారి (DPO) నాగరాజు నాయుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాయకూడని పదాలతో తిట్టేశారు. చెప్పిన పనులు చేయకపోతే ఆఫీసుకు వచ్చి కొడతానని గట్టిగానే బెదిరించారు. ‘ యూ ఆర్ ఏ యారిగెంట్.. బీ కేర్‌ఫుల్ (నువ్వు అహంకారివి, జాగ్రత్తగా ఉండు). నీ అంతు చూస్తా.. ఏంట్రా నీ ఓవర్ యాక్షన్, నా కొడకా నోరు మూసుకో’ అంటూ తీవ్ర పదజాలంతో ప్రభుత్వాధికారిపై జేసీ దుర్భాషలాడారు. ఈ ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలో చోటు చేసుకోగా.. ప్రస్తుతం అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. ఈ వ్యాఖ్యలతో ఆందోళన చెందిన నాగరాజు అక్కడి నుంచి భయపడుతూ వెళ్లిపోయారని తెలుస్తోంది. జేసీ గూండాయిజం చేస్తున్నారని ప్రభుత్వ అధికారులు గుర్రుగా ఉన్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇంకా స్పందించలేదని ప్రశ్నిస్తున్న పరిస్థితి. అంతేకాదు, ఉద్యోగ సంఘాలు కూడా మౌనంగా ఎందుకున్నాయనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇలాంటి ఘటనలు కూటమి ప్రభుత్వంలో అధికారులపై క్రమశిక్షణ కట్టుదాటుతోందన్న అభిప్రాయానికి దారితీస్తున్నాయి. గతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) సీఎంవోకు పిలిపించి మరీ.. జేసీ ప్రభాకర్ రెడ్డిని పలు విషయాల్లో కట్టడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా జిల్లా అధికారిపై ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడంతో హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలని పలువురు చర్చించుకుంటున్నారు.

Read Also-Midhun Reddy: ఏ క్షణమైనా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్.. వైసీపీలో టెన్షన్ టెన్షన్!

ఈ మధ్యనే ఇలా..!
జేసీ ప్రభాకర్ రెడ్డి తన వ్యాఖ్యలలో తరచుగా తీవ్ర వ్యాఖ్యలు, దుర్భాషలు ఆడటం పరిపాటుగా మారింది. ఇది తరచుగా వివాదాలకు దారితీస్తున్నది. జూలై 15న వైసీపీ యంగ్ లీడర్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ఊరికి వచ్చి నా గురించే మాట్లాడే ధైర్యం ఉందా? నీ లాంటి వాళ్ళని ఎంతమందినో చూశాను. నా గడ్డం, నా నెత్తి సరిపోదు పోల్చడానికి ఇంకా చాలా వెంట్రుకలు కావాలి. బండ బూతులు మాట్లాడడం కూడా నాకు వస్తుంది. పొగరు తగ్గించుకో’ అని హెచ్చరించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి.. జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో ప్రజా సమస్యలపై స్పందిస్తారన్నది జగమెరిగిన సత్యమే. కానీ, ఏ విషయంపైనా నిర్మొహమాటంగా మాట్లాడతారని ఆయన మద్దతుదారులు అంటుంటారు. అయితే, ఆయన ఉపయోగించే భాష, అధికారులతో వ్యవహరించే తీరు తరచుగా విమర్శలకు దారితీస్తూ, జేసీని వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుపుతున్నది. ప్రభుత్వ అధికారిని ఈ రేంజిలో తిట్టినా ఇంతవరకూ ప్రభుత్వం కానీ, ఉద్యోగ సంఘాలు కానీ.. కనీసం హైకమాండ్ కూడా ఇంతవరకూ స్పందించకపోవడం గమనార్హం.

Read Also- Etela Rajender: బీజేపీలో ముదిరిన అంతర్యుద్ధం.. పరోక్షంగా సొంత నేతలనే ఏకిపారేసిన ఈటల!

Just In

01

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం