HYDRA 1st Anniversary హైదరాబాద్ మహానగరంలో నాలాలు, చెరువులకు పునర్జీవం కల్పిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) అన్నారు. అంబర్ పేట తిలక్ నగర్‌లో హైడ్రా వార్షికోత్సవం సందర్భంగా బతుకమ్మ చెరువు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో ఆక్రమణకు గురైన చెరువులు, నాలాలను ఇప్పటికే గుర్తించడం జరిగిందని, వాటన్నింటికి కూడా పునరుజ్జీవనం కల్పిస్తామని అన్నారు. (Tilak Nagar) తిలక్ నగర్‌లో డంపింగ్ యార్డ్‌గా ఉన్న (Bathukamma Lake) బతుకమ్మ చెరువుకు పునరుజ్జీవనం కల్పించి ఈ ప్రాంత వాసులు, పాఠశాల విద్యార్థులకు అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా పార్క్‌గా తీర్చిదిద్దడంతో పాటు ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడం జరిగిందన్నారు.
Also Read: HYDRA: నేటితో హైడ్రా ఏర్పాటై ఏడాది.. స్వేచ్ఛ ప్రత్యేక కథనం
నాలాలపై ప్రత్యేక దృష్టి
మరికొన్ని చెరువులను త్వరలో ఇదే తరహాలో చేస్తామని స్పష్టం చేశారు. ఆక్రమణదారుల కేసుల వలన కొంత ఆలస్యం జరిగిందని, హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఒక లక్ష్యంతో హైడ్రా పని చేస్తున్నదని, అందుకు ప్రజలు పూర్తి సహకారాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. నగరంలో పేదల ఇండ్లు, నివాస గృహాలను కాకుండా ఆక్రమణకు గురైన చెరువులు, నాలాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. 2024 జూలై 19న రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా (HYDRA) ఆఫీస్‌ను ఏర్పాటు చేయడంతో ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా బతుకమ్మ చెరువు (Bathukamma Lake) వద్ద ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
1960లో బతుకమ్మ చెరువు 14 ఎకరాలు
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, బతుకమ్మ చెరువు వద్ద ఇంత గొప్పగా హైడ్రా (HYDRA) వార్షికోత్సవ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషాన్నిచ్చిందని, గతంలో ఇక్కడ ఒక డంపింగ్ యార్డ్ ఉండేదని దాన్ని తొలగించి ఒక అద్భుతమైన చెరువును చూపించడం అందరికీ ఉపయోగపడే విధంగా నాలుగు నెలల్లో పూర్తి చేయటం గొప్ప విషయమని, నీటి నిల్వలు పెంచుకోవడంతో పాటు భవిష్యత్ తరాలకు ఇలాంటి చెరువులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. హనుమంతరావు మాట్లాడుతూ, 1960లో బతుకమ్మ చెరువు 14 ఎకరాల్లో ఉండేదని, కాలక్రమేనా ఆక్రమ దారులు చెరువును కబ్జా చేయడంతో ప్రస్తుతం 5 ఎకరాల వరకు ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టితో ఆక్రమణకు గురైన చెరువులు తిరిగి పునరుజ్జీవనం కల్పించేలా హైడ్రాను ఏర్పాటు చేసి, గొప్ప కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందని తెలిపారు.
Also Read: HYDRAA: ‘బతుకమ్మ’ను బతికించిన హైడ్రా.. ఎలా సాధ్యమైంది?