CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం జటప్రోల్ గ్రామంలో 155కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు శంకుస్థాపన, 344కోట్ల రూపాయల చెక్కులను మహిళా సంఘాలకు రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, (Jupally Krishna Rao) దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లురవి, ఎంఎల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాట్లాడుతూ పాలమూరు జిల్లా అంటే కేసీఆర్‌కు (KCR) చిన్నచూపని, దేశంలో ప్రాజెక్టుల పనులకు పాలమూరు పేదలే కూలీలుగా ఉన్నారన్నారు. 2009ఎన్నికల్లో కేసీఆర్ (KCR) ను కరీంనగర్ ప్రజలు ఓడించేందుకు సిద్దమైతే పాలమూరు ఎంపీగా గెలిపించారన్నారు.
సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని, బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి సింగిరెడ్డి పాలమూరుకు తెచ్చింది ఏంది, ఇచ్చింది ఏందో చెప్పాలన్నారు. కేసీఅర్ అడుగులు వత్తాసు పలికేందుకు సిగ్గు ఉందా అని ప్రశ్నించారు.ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందని, కల్వకుర్తి, జూరాల, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ పూర్తి కాలేదని, జై తెలంగాణ అని గెలిపిస్తే పదేండ్లల్లో ఈ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పదేళ్లలో 20లక్షల కోట్లు ఖర్చు చేసిందని, 20వేల కోట్లతో పాలమూరు ప్రాజెక్టులు పూర్తి అయ్యేవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టారని, మూడేళ్లలో కూలిందని విమర్శించారు. పాలమూరు, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టుల భూసేకరణ డిసెంబర్ నాటికి పూర్తి చేసి, రెండేళ్లలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు.
Also Read: CM Revanth Reddy: కేటీఆర్ నీ జాతకం అంతా నా దగ్గర ఉంది.. సీఎం రేవంత్
నీ గుండెల్లో రాసుకో
పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు ముదిరాజ్ బిడ్డ శ్రీహరి మొదటిసారి గెలిచినా మంత్రి అయ్యారన్నారు. రైతులకు 24 గంటల కరెంటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ అంటేనే ఉచిత కరెంటు అంటే కాంగ్రెస్ అన్నారు. ఇక 2024నుంచి 2034వరకు పాలమూరు బిడ్డ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటాడని, పాలమూరు నుంచే ప్రజాప్రభుత్వం నడుపుతామని, ఇది నా మాట అని, నీ గుండెల్లో రాసుకో, నీ కొడుకు గుండెల్లో రాయని కేసీఆర్ కు సూచించారు. పాలమూరు నుంచి శాసనం చేస్తాం పాలమూరు నుంచి శాసనసభను నడిపిస్తామన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, రాష్ట్రానికి నేను చేసిన అభివృద్ధి చెప్తానని, అది చూసి కుళ్లి ఏడవాలని, తెలంగాణకు నీవు చేసిననష్టం ఏందో, ద్రోహం ఏందో, నీవు వదిలిపెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేస్తానన్నారు.
అలాగే నేను చేసే అభివృద్ధిని చూపిస్తానని అన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబునాయుడు కల్వకుర్తి, భీమాలాంటి ప్రాజెక్టులకు అడ్డుపడొద్దన్నారు. మీ హయాంలో ప్రారంభమై అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుల పూర్తికి సహకరించాలని కోరారు. ఒకనాడు పాలమూరును దత్తత తీసుకున్నారని, బాధ్యతగా ఉండండని, మా పనులు చేసుకోనీయండి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 4TMCల నీళ్లను తీసుకెళ్లాల్సి ఉండగా 9TMCల నీళ్లు తీసుకెళ్లే ప్రాజెక్టులు పెట్టుకున్నారని, రోజుకు 3TMCలు తరలించే రాయలసీమ ప్రాజెక్టు రద్దు చేసి, మాకు ఉదారంగా సహకరించండని, రెండు రాష్ట్రాలను సమానంగా చూస్తున్నది నిజమైతే రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేయాలని కోరారు. విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
పాలమూరు బిడ్డలకు కృతజ్ఞత ఉందని, మీ మెయిల్ ఎప్పుడూ మర్చిపోరు అన్నారు. మేము చేసే విజ్ఞప్తులు చేస్తుంటామని వింటే సంతోషమని వినకపోతే పోరాటం ఎట్లా చేయాలో పాలమూరు ప్రజలకు తెలుసు అన్నారు. పాలమూరుకు పౌరుషం ఉందని, పోరాటం చేసే చేసే సత్తా ఉందని, ఆ ప్రజలకు నేను నాయకత్వం వహిస్తా అన్నారు. పాలమూరు అంటే వలసల జిల్లా కాదు అని, పరిపాలన చేసే సత్తా ఉన్న జిల్లా అని నిరూపించే బాధ్యత నేను తీసుకుంటానని సూర్యుడు ఎటు పొడిచినా పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా అన్నారు.
Also Read: GHMC Award: తెలంగాణలో స్వచ్ఛ షహర్‌గా గ్రేటర్ హైదరాబాద్
ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఏర్పాటు
కేసీఆర్…శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల నిర్వాసితులకు ఇల్లు అమ్మి ఇస్తాన్నారని, ఫాంహౌజ్, 98జీఓ ప్రకారం పదేళ్లు ఎందుకు ఆదుకోలేదన్నారు. కొల్లాపూర్ అభివృద్ధి చేస్తే 98జీఓ నిర్వాసితుల సమస్య ఎందుకు ఉందన్నారు. వాల్మీకి బోయలకు ఎస్టీ జాబితాలో చేరుస్తామని, మాదాసి కురుమలు ఎస్సీలో కలపాలని అంటున్నారని, కేసీఆర్ ఎందుకు ఈ ప్రజల సమస్యలు పరిష్కారం చేయలేదన్నారు. పాలమూరు ఎంపీగా అండగా నిలిస్తే సున్నం పెట్టారని విమర్శించారు. పాలమూరు బిడ్డ రేవంత్ సీఎం అయ్యాడని, మా పేదల పిల్లలకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఏర్పాటు చేపిస్తుంటే ఏడుపొస్తుందా అన్నారు. పాలమూరు బిడ్డ 20ఏండ్లు చేపలు పట్టుకోవాలి, చెప్పులు కుట్టాలి, ఈదులు గీయాలి కానీ మీరు సీఎం, మీ బిడ్డలు మంత్రులు కావాలా అని కేసీఆర్ ను నిలదీశారు. 40సంవత్సరాల నుంచి వర్గీకరణ కోసం మాదిగలు పోరాటం చేస్తే వర్గీకరణ చేశామని, ఇది చేస్తే దుఖం వచ్చిందా అన్నారు. 2035 నాటికి తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్ ఎకనామీగా మార్చాలన్నది నా లక్ష్యం అన్నారు.
అందులో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం కోసం 6,500 కోట్లు ఇచ్చామన్నారు. జూరాల ప్రాజెక్టు పై రోడ్డు కోసం 160కోట్లు ఇచ్చానన్నారు. శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డికి సిగ్గు ఉండాలన్నారు. 70ఏళ్ల తరువాత పాలమూరు బిడ్డ సీఎం అయితే అభివృద్ధికి అడ్డుతగులుతో కేసీఆర్ అడుగుల్లో నడవడానికి సిగ్గుండాలన్నారు. మేమంతా…గాలికి కొట్టుకొచ్చామా, నిలబడి గిరిగీసి కొట్లాడితే ఈ స్థాయికి వచ్చామన్నారు. ఇప్పటి వరకు నేను సీఎం అయ్యాక 60వేల ఉద్యోగాలు ఇచ్చామని, ఎస్సీ వర్గీకరణ వల్ల కొద్దిగా జాప్యం జరిగిందని రెండున్నరేళ్ల తమ పాలన పూర్తి అయ్యేలోపు 40వేల కొత్త ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి 3లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామన్నారు.
21వేల కోట్లు
కేసీఆర్ వరి అంటే ఉరి అన్నారని, ఇప్పుడు ఆ రైతులు 2.85కోట్ల మెట్రిక్ టన్నుల వరి పండిస్తున్నారని, రాష్ట్రంలో 25లక్షల కుటుంబాలకు 2లక్షల రుణమాఫీ పది నెలల్లో చేశామని, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో లక్ష రుణమాఫీ 16వేల కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. 9వేల కోట్ల రైతు భరోసా, పామాయిల్ రైతులను ఆదుకుంటున్నన్నారు. కేసీఆర్ ఫాంహౌజ్ లో పండించిన వరి 4,200 కావేరీ సీడ్స్ కు అమ్మకోవడం కాదన్నారు. 2014-19వరకు ఒక్క మహిళ మంత్రిని చేయలేదని, వంటింటికే పరిమితం చేశారని, కోటి మంది మహిళలను కోటీశ్వరులకు చేసేందుకు 21వేల కోట్లు ఇచ్చామన్నారు. మహిళల చేతుల్లో స్కూల్ విద్యార్థులకు చెందిన 1.30కోట్ల బట్టలు కుట్టించామని, అమ్మ ఆదర్శ పాఠశాలల బాధ్యత, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను, పెట్రోల్ బంకుల యజమానులు, వేయి మెగావాట్ల సోలార్ విద్యుత్ మహిళలకు, వేయి బస్సులకు యజమానులు అయ్యారని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం కోసం 6,500 కోట్లు ఇచ్చామన్నారు. కేసీఆర్ ఆయన కొడుకు సెల్ఫీలు దిగుతారని, మేము శిల్పారామం వద్ద 150 షాపులు ఇచ్చామన్నారు.
ప్రపంచ సుందరి పోటీలకు వచ్చిన మహిళల వ్యాపారం చూసి నేర్చుకున్నారన్నారు. గజం భూమి కేసీఆర్ ఏనాడూ ఇవ్వలేదని అన్నారు. 18నెలల్లో మహిళల కోసం ఇంత అభివృద్ధి చేసిన రాష్ట్రం లేదన్నారు. అగ్నికి, ఉరికొయ్యాలకు ఊయల్లా, తారల్లా తెలంగాణ కోసం యువత అమరులయ్యారని, ఎక్కడైనా ఉద్యోగాలు ఇచ్చారా అని, నేను సీఎం అయ్యాక 60వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. రెండున్నరేళ్ల కాలంలో 40వేల కొత్త ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. వర్గీకరణ జాప్యం వల్ల కొద్దిగా నోటిఫికేషన్ల జారీలో జాప్యం జరిగిందన్నారు. బడికి సున్నం వెయనీకె 2లక్షలు ఇవ్వలేదని, ఏడాదిన్నరలో ఆధునిక యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభిస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక 3లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామన్నారు. కేసీఆర్ నీవు శాపగ్రస్థుడివని, కళ్ల ముందే తెలంగాణను అభివృద్ధి చేస్తామన్నారు.
ఆరోగ్య శ్రీ 10లక్షలు
జటప్రోల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గానికి కావల్సిన నిధులు ఇస్తామన్నారు. ఇచ్చిన మాట అమలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి : జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి ఇది ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో పడిందని, కానీ ఇచ్చిన హామీ ప్రకారం సీఎం రేవంత్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారన్నారు. 22వెల కోట్లతో 4.50లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు. 22వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశారని, వరి రైతులకు క్వింటాల్ కు 500బోనస్, పేదలకు సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. బీజేపీకి మాట్లాడే అర్హత లేదని, సోనియా పుణ్యం వల్ల ఏపీలో కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుందని తెలిసీ రాష్ట్రం ఇచ్చింది అన్నారు. ఆరోగ్య శ్రీ 10లక్షలు, 200యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు.
జనాభా ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తున్నామని, బీజేపీకి దమ్ముంటే పార్లమెంటులో బిల్లు అమలు చేయించాలన్నారు. కాంగ్రెస్ పాలన చూస్తే దుఖం వస్తుందన్నారని, రాష్ట్రాన్ని 22 సీఎంలు పాలిస్తే 75వేల కోట్ల అప్పులు చేస్తే 8 లక్షల కోట్లు చేశారని, ఇప్పుడు నెలకు ,6,500కోట్ల వడ్డీ కడుతున్నామన్నారు. రైతులు, మహిళలు, యువత ఆలోచించాలన్నారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కేసీఆర్ పాలమూరు ఎత్తిపోతల పథకం ఎన్నికల ముందు ఒక్క మోటార్ ప్రారంభించారని విమర్శించారు. పేదలకు గొప్ప చదువులు అందించేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూ బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయన్నారు. నల్లధనం తెస్తానని మోడీ చెప్పారని, ఒక్కరి ఖాతాలో అయినా పడ్డాయన్నారు. 2కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారన్నారు.
శ్రీశైలం నిర్వాసితులకు 98జీ.ఓ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని, వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని, మాదాసీ కురువలను, శ్రీశైలం ముంపు కుటుంబాలకు, పాలమూరు ఎత్తిపోతల నిర్వాసితులకు నష్ట పరిహారం, 3వేల ఇందిరమ్మ ఇండ్లు,ప్రతి గ్రామానికి 15లక్షలు, కొల్లాపూర్ మున్సిపాలిటీకి 50లక్షలు ఇవ్వాలని, ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేయాలని, బాచారం హైలెవల్ కెనాల్, రంగసముద్రం పథకానికి 163కోట్లు మంజూరు చేయాలని, పెంట్లవెల్లి సొసైటీ రైతులకు రుణమాఫీ కల్పించాలి, కొల్లాపూర్ నియోజకవర్గానికి 500కోట్లు మంజూరు చేయాలని, సోమశిల-సిద్దేశ్వరం బ్రిడ్జ్ భూ సమస్య పరిష్కరించాలని, సీఎంను కోరారు. ప్రజలందరికీ అప్పులున్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నా ప్రైవేట్ స్కూళ్లకు పిల్లలను పంపుతున్నారని, ఆరోగ్యానికి గంట సమయం వెచ్చించాలన్నారు.
Also Read: CM Revanth Reddy: కృష్ణా జలాల వినియోగంపై టెలీమెట్రీ యంత్రాలు
కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే పేదల అభివృద్ధి : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
పేదల ఆరోగ్యం, సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అన్నారు. గాంధీ, అంబేద్కర్, రాజ్యాంగం దేశానికి రక్షణ అన్నారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా ఇండ్లు, 25లక్షల ఎకరాలు పేదలకు పంపిణీ చేసిన చరిత్ర ఇందిరమ్మ, కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నారు. వైఎస్ హయాంలో వెలుగు పథకంతో మహిళలకు పావలా వడ్డీ, భీమా పథకాలు, వడ్టీలేని రుణాలు అలాగే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్, సోనియమ్మ అన్నారు. రేవంత్ సర్కార్ వచ్చాక వడ్డీ పైసలు సకాలంలో అందించామన్నారు. నాడు పేదలకు భీమా పథకంలేదని, కాంగ్రెస్ వచ్చాక లోన్, ప్రమాద భీమా పథకాలు ఇచ్చామన్నారు. ప్రజల ఆరోగ్య భద్రత దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుంది అన్నారు. 60-40,50వేల ఉద్యోగాలు ఇస్తామని, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ చేసి ఆ పేదలకు న్యాయం చేసిన ఘనత రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నారు. పాలకులకు దార్శనికత ఉండాలన్నారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు.
బీసీ రిజర్వేషన్ల ఘనత సీఎం రేవంత్ దే : రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ…
గతంలో విద్యా, వైద్యం, సాగు,తాగునీటి రంగాల్లో వెనకబడ్టామని, పదేళ్లపాటు భూతద్దం చూపించి అధికారం అనుభవించారన్నారు. దేశంలో వెనకబడిన ప్రజలకు అధికారం రావడానికి రాహుల్ గాంధీ సూచన మేరకు రెడ్డి బిడ్డ రేవంత్ బీసీ రిజర్వేషన్లు కల్పించారన్నారు. మన బీదరికం పోగొట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న చర్యలకు మద్దతివ్వాలన్నారు. గతంలో ఫాం హౌజ్ లో వరి పండించి రైతులను మాత్రం వరి వేస్తే ఉరి అన్నారని, సీఎం రేవంత్ ఈ రైతులకు 500రూపాయల బోనస్ అందిస్తున్నారన్నారు. పేదలందరూ రోజూ సన్న బియ్యం తినేలా చేశారన్నారు. సంక్షేమ పథకాలే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయే కాలంలో బలపరచాలని కోరారు.
పేదల కష్టాల విలువ తెలిసిన సీఎం రేవంత్ రెడ్డి :ఎంపీ డాక్టర్ మల్లురవి
రాష్ట్రంలో 100 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో ఆదర్శ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిలిచారన్నారు. ఈ స్జూళ్లతో సామాజిక విప్లవం తీసుకొచ్చారని అన్నారు. ఈ స్కూల్లో
రక్తపాత రహిత విప్లవమని, అంబేద్కర్ ఆశించిన విజయమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే రేవంత్ ఆధ్వర్యంలో 42శాతం రిజర్వేషన్లు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. అన్ని పార్టీలకు ఇది మార్గదర్శకంగా నిలుస్తుంది అన్నారు. రేవంత్ పేదల ఆకలి విలువ తెలుసని, పేదలకు సన్నబియ్యం, హాస్టల్ విద్యార్థులకు కాస్మోటిక్ బిల్లులు పెంచారని, రేవంత్ కు కోటి దండాలన్నారు. ప్రజలను దేవుళ్లుగా చూస్తున్న రేవంత్ ను బీఆర్ఎస్ నాయకులు దెయ్యాలుగా మార్చి విమర్శిస్తున్నారని, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి రేవంత్ కు గిఫ్ట్ ఇవ్వాలన్నారు. జూపల్లి కృష్ణారావు రైతులకు ఉచిత విద్యుత్ కోసం జైలుకు వెళ్లారని, రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ నాడు జూపల్లి పోరాట ఘనతే అన్నారు. కృష్ణా నదిపై బ్యారేజి కోసం జూపల్లి కృషి ప్రశంసనీయం అన్నారు.
ఈ కార్యక్రమంలో...
ఎంఎల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు శంకర్, మధుసూదన్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, రాజేష్ రెడ్డి, పర్ణికారెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ కొత్వాల్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సంపత్ కుమార్ సరిత తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు.
Also Read: CM Revanth On KCR: అసెంబ్లీకి రండి.. అద్భుతాలు సృష్టిద్దాం.. కేసీఆర్‌కు సీఎం విజ్ఞప్తి