AK 203 Sher
జాతీయం, లేటెస్ట్ న్యూస్

AK-203: ఆర్మీ చేతికి కొత్త ఆయుధం.. నిమిషానికి 700 బుల్లెట్లు

AK-203: భారత రక్షణ రంగంలో స్వదేశీ ఆయుధాల వినియోగం, స్వయం సమృద్ధి దిశగా పురోగతి సాధిస్తున్న క్రమంలో మరో కొత్త ఆయుధం తయారైంది. భారత సైనిక బలగాలకు త్వరలోనే ఏకే-203 (AK-203) అనే కొత్త తరం తుపాకులు అందనున్నాయి. ‘కాలాశ్నికోవ్ సిరీస్‌’ రైఫిల్స్‌కు ఆధునిక వెర్షన్‌గా తయారయ్యాయి. ఏకే-203 తుపాకులు నిమిషానికి ఏకంగా 700 రౌండ్ల బుల్లెట్ల వర్షం కురిపించగలవు. సుమారుగా 800 మీటర్ల పరిధిలో లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించగలవు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (IRRPL) అనే జాయింట్ వెంచర్ సంస్థ ఈ తుపాకులను తయారు చేస్తోంది. భారత్‌లో దీనిని ‘షేర్’ (Sher) అనే పేరుతో వ్యవహరించనున్నారు. ఈ కంపెనీ ఏకంగా, రూ.5,200 కోట్ల విలువైన ఒప్పందం కింద 6 లక్షలకుపైగా తుపాకులను తయారు చేసి భారత సాయుధ దళాలకు అందించాల్సి ఉంది.

48,000 తుపాకులు డెలివరీ
భారత సాయుధ దళాలకు ఇప్పటివరకు సుమారు 48,000 ఏకే-203 తుపాకులు అందాయి. వచ్చే రెండు నుంచి మూడు వారాల్లో మరో 7,000 తుపాకులు అందించనున్నట్లు ఐఆర్‌ఆర్‌పీఎల్ చీఫ్ మేజర్ జనరల్ ఎస్‌కే శర్మ తెలిపారు. డిసెంబర్ 2025 నాటికి మరో 15,000 తుపాకులు అందిస్తామని వెల్లడించారు. ఇక, డిసెంబర్ 2030 నాటికి పూర్తిగా అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు.

Read Also- Anupama Parameswaran: పక్కన ఎవరితను..పెళ్లి దండలతో అనుపమ.. వీడియో వైరల్

‘షేర్’ ప్రత్యేకతలు ఇవే
షేర్ (ఏకే203) తుపాకులు ఏకే-47, ఏకే-56 వంటి పాత తరం తుపాకులతో పోల్చితే చాలా ఆధునికమైనవి. పాత ఇన్సాస్ (INSAS) తుపాకుల స్థానంలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇన్సాస్ గన్స్ ఏకంగా మూడు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నాయి. ఇన్సాస్‌లో 5.56×45 ఎంఎం కార్ట్రిడ్జ్ ఉండగా, ఏకే-203లో 7.62×39 ఎంఎం కార్ట్రిడ్జ్ వాడతారు. ఏకే-203లో ఒక్కో మ్యాగజైన్‌లో 30 బుల్లెట్లు పెట్టేందుకు వీలుంటుంది. ఈ తుపాకీ బరువు 3.8 కేజీలు ఉంటుంది. దీనితో పోల్చితే ఇన్సాస్ తుపాకీ 4.15 కిలోల బరువు ఉంటుంది. పొడవు విషయానికి వస్తే ఏకే-203 (తోక భాగం లేకుండా) – 705 ఎంఎం ఉంటుంది. ఇన్సాస్ పొడవు 960 ఎంఎం ఉంటుంది.

Read Also- Team India: నాలుగో టెస్టుకు స్టార్ ప్లేయర్!.. సిద్ధమైన మేనేజ్‌మెంట్?

ఎక్కడ ఉపయోగిస్తారు?
ఏకే-203 తుపాకులను ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, చొరబాట్లు తిప్పికొట్టడం వంటి ఆపరేషన్లలో ఉపయోగిస్తారు. ఈ తుపాకులు భారత సైనికుల సామర్థ్యం పెంచడంలో దోహదపడతాయి. ముఖ్యంగా, సరిహద్దులు, ముఖ్యంగా లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC), వాస్తవాధీన రేఖ(LAC) వద్ద విధుల్లో ఉన్న సైనికులకు ఈ తుపాకులు ఎంతోగానో ఉపయోగపడనున్నాయి.

Read Also- Cyber Fraud: ప్రతీ 20 నిమిషాలకో సైబర్ క్రైమ్.. రూ.700 కోట్లు స్వాహా.. జాగ్రత్త భయ్యా!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు