Anupama Parameswaran: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ప్రధానంగా తెలుగు, మలయాళం, తమిళ చిత్రాలలో నటిస్తుంది. ఆమె 2015లో మలయాళ చిత్రం “ప్రేమమ్”తో సినీ రంగంలో అడుగుపెట్టింది. ఇందులో మేరీ జార్జ్ పాత్రలో నటించి గుర్తింపు పొందింది. తెలుగులో “శతమానం భవతి”లో నిత్య పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇటీవల ఆమె “టిల్లు స్క్వేర్” (2024), “పరదా”, “జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ” వంటి చిత్రాలలో నటించింది. అయితే, తాజాగా అనుపమకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
పెళ్లి దండలతో అనుపమ
సెలబ్రిటీలకు సంబంధించిన చిన్న వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి. వాటిలో ఇక హీరోయిన్స్ వీడియోలు అయితే చెప్పే పనే లేదు వెంటనే సోషల్ మీడియాలో చక్కెర్లు కొడతాయి. అలాంటి ఒక వైరల్ వీడియోలో హీరోయిన్ అనుపమ పెళ్లి దండలతో మెరిసింది. ఇక్కడి వరకు అయితే ఒకే. కానీ, పక్కన వేరే వాళ్ళు కూడా ఉన్నారు. అతను మెడలో కూడా పూల దండ ఉండటంతో రక రకాల అనుమానాలు వస్తున్నాయి. దండ ఆమె మెడలో ఉంటే ఏదైనా ఈవెంట్ కి వెళ్లిందని అనుకోవచ్చు. కానీ, ఇద్దరి మెడలో పూల దండలు ఉండటంతో చెప్పకుండా పెళ్లి చేసుకుందా ఏంటి? అని అనుకుంటున్నారు.
Also Read: Sir Madam Trailer: బాబోయ్ ట్రైలర్ ఏంటి ఇలా ఉంది? ఏ భార్యభర్తలకు ఇలాంటి కష్టం రాకూడదు!
అయితే, అనుపమ ఇటీవల నెల్లూరులో జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ ఈవెంట్‌లలో పాల్గొంది, అక్కడ ఆమె సంప్రదాయ దుస్తులలో అభిమానులతో సెల్ఫీలు దిగింది. ఆ సమయంలో వాళ్ళు మెడలో దండలు వేసి ఉంటారని కొందరు అంటున్నారు.
Also Read: Gold Rates Down: ఎగిరిగంతేసే గుడ్ న్యూస్.. త్వరలో రూ.30,000 వేల వరకు తగ్గనున్న గోల్డ్ రేట్స్..?
నెటిజన్ల రియాక్షన్ ఇదే
అరే అది నా పిల్ల రా వదిలేయ్ .. నా లవర్ అంటూ కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు ఏదో గుడికి వెళ్ళి ఉంటారు. అక్కడ వాళ్ళకి దండలు వేసి ఉంటారు. దీనికి ఇంత సీన్ చేయలా అని ఇంకొందరు ఫైర్ అవుతున్నారు.