Akshay Kumar ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Akshay Kumar: స్టంట్‌మన్ మరణం తర్వాత 650 మంది స్టంట్ కార్మికులకు ఆరోగ్య, ప్రమాద బీమా అందించిన అక్షయ్ కుమార్

Akshay Kumar: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, తమిళ స్టంట్ మాస్టర్ ఎస్ఎం రాజు (మోహన్ రాజు) మరణం తర్వాత, సినీ రంగంలో స్టంట్ కార్మికుల భద్రత, శ్రేయస్సు కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎస్ఎం రాజు, దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో ఆర్య హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో మరణించారు. ఈ ఘటన అక్షయ్ కుమార్‌ను తీవ్రంగా కలిచివేసింది. దీనికి ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్టంట్ కార్మికుల కోసం ఒక గొప్ప చొరవ తీసుకున్నారని ఇతర నటులు కూడా ఆయన్ని ప్రశంసిస్తున్నారు.

Also Read: Immunity Boosting Tips: శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే 7 చిట్కాలు.. ఇవి పాటిస్తే డాక్టర్‌తో పని లేనట్లే!

650 మంది స్టంట్ కార్మికులకు  ఆరోగ్య, ప్రమాద బీమా అందించిన అక్షయ్ కుమార్

అక్షయ్ కుమార్, దాదాపు 650 మంది స్టంట్ కార్మికులకు వ్యక్తిగతంగా ఆరోగ్య, ప్రమాద బీమా కవరేజీని అందించేందుకు నిర్ణయించారు. ఈ బీమా పథకం కింద, స్టంట్ కార్మికులకు ఆరోగ్య సంబంధిత సమస్యల, షూటింగ్ సమయంలో జరిగే ప్రమాదాలకు ఆర్థిక రక్షణ కల్పించబడుతుంది. సినీ ఇండస్ట్రీలో స్టంట్ కార్మికులు ఎదుర్కొనే ప్రమాదకర పరిస్థితులను గుర్తించి, వారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడానికి అక్షయ్ తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం అతన్ని నిజ జీవితంలోను హీరోగా నిలబెట్టింది.

Also Read: Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో కౌ బాయ్ గెటప్‌లో పవన్… బొమ్మ బ్లాక్ బాస్టరే!

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?