pawan kalyan ( image source X)
ఎంటర్‌టైన్మెంట్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో కౌ బాయ్ గెటప్‌లో పవన్… బొమ్మ బ్లాక్ బాస్టరే!

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ నుంచి ఒక సినిమా వస్తుందంటేనే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. అలాంటిది వరస సినిమాలతో అభిమానులను ఖుషీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’ సినిమాలను విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హరీష్ శంకర్, పవర్ స్టార్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఏ రేంజ్ హిట్ సాధించిందో తెలిసిందే. తాజాగా మళ్లీ అదే కాంబోలో రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే సినిమా మొదలై కొన్ని షెడ్యూల్లు కూడా పూర్తి చేసుకుంది. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం కావడంతో ఆయనకు ఉన్న సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటుంది మూవీ టీం. సినిమ. వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో మూవీ టీం రాత్రి, పగలు పనిచేస్తోంది. ఓ పక్క బిజీ బిజీగా షూటింగ్ జరుగుతుంటే మరో పక్క ఒక్కో ఈ సినిమా గురించి ఒక్కో లీకు బయటపడి, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి దర్శకుడు హరీష్ శంకరే ఓ ఈవెంట్లో నోరు జారారు. ‘డ్రాగన్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వెళ్లిన హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో ఓ సీన్ గురించి చెప్పేశారు. వైసీపీ అధికారంలో ఉండగా పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామం వెళ్లే దారి మధ్యలో తన కారు పైకిఎక్కి ప్రయాణం చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా అయింది. ఇప్పుడు అదే సీన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో కూడా ఉందని చెప్పారు.

Read also- Nimisha Priya: ఆఖరి ‘నిమిష’oలో ఊహించని ట్విస్ట్.. మళ్ళీ మొదటికి!

తాజాగా ఈ సినిమా నుంచి పవన్ లుక్ ఒకటి మరోసారి వైరల్ అవుతోంది. పవన్ బస్ పక్కన నిలబడి ఉండగా శ్రీలీల ఆయనతో ఏదో చెబుతోంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. పవన్ నటించిన సినిమాలో నుంచి లుక్స్ వైరల్ కావడంతో పవన్ ఫ్యాన్స్ హరిష్ శంకర్ పై గుస్సా అవుతున్నారు. ఇలాంటివి జరుగుతుంటే సినిమా టీం ఏం చేస్తోందని మండిపడుతున్నారు. అయితే పవన్ సినిమాలకు ఇలాంటి లీకులు కొత్తేం కాదు అప్పట్లో బ్లాక్ బాస్టర్ హిట్ అయిన ‘అత్తారింటకి దారేది’ సినిమా ఏకంగా గంటకు పైగా ఫుటేజ్ విడుదలైంది. అయితే ఆ తర్వాత సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. అయినా సరే పవన్ లుక్స్ పట్ల హరీష్ జాగ్రత్తగా ఉండాలని అభిమానులు కోరుతున్నారు.

Read also- Jr NTR: ‘వార్ 2’ సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ వైరల్

ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు సోషల్ మీడియాలో తెగ తిరుగుతున్నాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో ఫైట్ సీన్స్ అదిరిపోయేలా వచ్చాయని మూవీ వర్గాలు చెబుతున్నాయి. మొదట ఈ సినిమా తమిళంలో విడుదలైన ‘తెరి’ సినిమాకు రిమేక్‌గా రానుంది. అయితే ఈ సినిమా స్టోరీ లైన్ మొత్తం మార్చేశారని టాక్. ముందుగా అనుకున్న స్టోరీలో హీరోయిన్‌గా నటించిన శ్రీలీల స్కూల్ టీచర్ పాత్రలో కనిపిస్తుంది. తర్వాత మార్చిన కథలో శ్రీలీల రేడియో జాకీ పాత్రలో కనిపించనుందట. ఇదంతా ఎందుకు అంటే పవన్ డిప్యూటీ సీఎం అయిన స్టోరీ లైన్ లో మార్పులు రావాలని నిర్మాతలు సూచించారని సమాచారం. అందుకు తగ్గట్టుగా హరీష్ స్ర్కప్ట్ మొత్తం మార్చేశారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మరో లీక్ తెగ హల్ చల్ చేస్తుంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో పవన్ గుర్రం మీద కనిపించనున్నారట. అదే అయితే మాత్రం అభిమానులు పండగ చేసుకుంటారు. అంతకు ముందు గుర్రం మీద కనిపించిన సినిమాలు అన్నీ హిట్ అయ్యాయి. ఈ సారి మరో హిట్ ఖాయం అంటూ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ