Jr NTR: దేవర హిట్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ‘వార్2’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసి విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమాపై మరో అప్డేట్ ఇచ్చారు జూనియర్. ఈ సినిమా రిలీజ్ కు ఇంకా30 రోజులే ఉందని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు. తెలుగు, హిందీ, తమిళం భాషలకు సంబంధించిన వాల్ సోస్టర్లను విడుదల చేశారు. అందులో హృతిక్, తారక్‌లతో కలిసి కియారా అద్వని ఉన్నారు. ‘వార్ 2’ సినిమా అగస్ట్ 14 విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన యాక్షన్ సన్నివేశాలు చూస్తుంటే ఈ సినిమా మంచి కలెక్షన్స్ వసూలు చేసేలాగానే కనిపిస్తోంది. ఇందులో ఒక పాట కోసం దాదాపు 15 కోట్ల రూపాయాలను నిర్మాతలు ఖర్చు చేస్తున్నారని టాక్. ప్రచారంలో కూడా ‘వార్ 2’ దూసుకుపోతుంది. తమదైన స్టైల్లో ఆయా తారలు ఇప్పటికే ప్రచారాలు మొదలు పెట్టేశారు.
Read also- Employee Health issues: ఐటీ ఉద్యోగికి కొండంత కష్టం.. తెలిస్తే గుండె తరుక్కుపోవాల్సిందే!
‘వార్ 2’ సినిమా ప్రారంభమైన 15 నిమిషాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్భ(Jr NTR )ఎంట్రీ ఉంటుందని టాక్. అక్కడ్నుంచి సినిమా చివరి వరకూ తారక్ కనిపిస్తాడని సమాచారం. సినిమాలో హృతిక్-ఎన్టీఆర్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్సులు విజువల్ వండర్స్‌లా ఉంటాయని, ఆరు భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉన్నాయని సమాచారం. సినీ ప్రియులు, సినీ విశ్లేషకుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే ఎన్టీఆర్ పాత్ర విలన్‌లాగా ఉందని చెబుతున్నారు. అయితే ఇది పూర్తిస్థాయి విలన్ పాత్ర కాకపోవచ్చు, కానీ హృతిక్ రోషన్ పాత్రకు ధీటైన, సవాలు విసిరే పాత్రగా ఉంటుందని చెబుతున్నారు. ఎన్టీఆర్ పవర్‌ఫుల్, తెలివైన ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. హృతిక్ రోషన్‌ను టెక్నికల్‌గా, వ్యూహాత్మకంగా ఎదుర్కొనే పాత్ర అని మాత్రం చెప్పుకోవచ్చు. ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ మాస్, స్టైలిష్ మేకోవర్‌తో కనిపించిన విషయాన్ని ప్రచార చిత్రాల్లో చూడొచ్చు. నిజంగా ఆయన బాడీ లాంగ్వేజ్, ఫైటింగ్ స్టైల్ కొత్తగా ఉన్నాయని అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. మొత్తంమ్మీద ఎన్టీఆర్ పాత్రలో యాక్షన్ సన్నివేశాలు పుష్కలంగా ఉంటాయని చిత్ర యూనిట్ నుంచి ఇప్పటికే లీకులొచ్చాయి. హృతిక్‌తో కలిసి చేసే ఫైట్ సీక్వెన్సులు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని చిత్రబృందం చెబుతుంది.
Read also- Blood Pressure: వీటితో హైబీపీ.. ముందుగా గుర్తించకపోతే డేంజర్లో పడ్డట్టే?
బాలీవుడ్‌లో రిలీజై మంచి హిట్ అందుకున్న ‘వార్’ సినిమాకు సీక్వెల్‌గా ‘వార్ 2’ రూపొందించారు. ‘బ్రహ్మాస్త్ర’ వంటి విజువల్ వండర్‌ను తెరకెక్కించిన దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ సంస్థ విడుదల చేయనుంది. ఇదే విషయాన్ని టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 7,500 స్క్రీన్స్‌లో ఈ సినిమాను విడుదల చేయనున్నారన టాక్ నడుస్తోంది.