Weight Loss Hacks (Image Source: Twitter)
లేటెస్ట్ న్యూస్, లైఫ్‌స్టైల్

Weight Loss Hacks: కష్టపడకుండా బరువు తగ్గాలా? ఈ టిప్స్ ఫాలో అయిపోండి!

Weight Loss Hacks: ఈ రోజుల్లో అధిక బరువు సమస్య చాలా మందిని వేధిస్తోంది. శరీరంలో పేరుకుపోతున్న కొవ్వును తగ్గించుకునేందుకు చాలా మంది జిమ్స్ బాట పడుతున్నారు. మరికొందరు డైట్ పేరుతో నోటిని కట్టేసుకుంటున్నారు. అయితే తేలికపాటి టిప్స్ ద్వారా ఒక రోజులో 500 కేలరీలు తగ్గించే ఉపాయాలను ప్రముఖ ఫిట్ నెస్ ట్రైనర్ జోష్ బెయిన్.. సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియోలో కొన్ని చిట్కాలను ఫాలోవర్లకు సూచించాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

అలవాటు లేని చేతితో తినడం
మీరు సాధారణంగా ఉపయోగించే చేతితో కాకుండా మరో చేత్తో తినడం వల్ల ఆహారం తినే వేగం తగ్గుతుంది. ఇది మీ మెదడుకు పూర్తిగా ఆహారం తిన్న భావనను కలిగిస్తుంది. తద్వారా మీరు తక్కువ ఆహారం తీసుకుంటారు. దీని వల్ల అనవసరమైన కేలరీలు తగ్గుతాయి.

చిన్న ప్లేట్లు ఉపయోగించడం
చిన్న ప్లేట్లలో ఆహారం వడ్డించడం వల్ల మీ మెదడు ఆహారం ఎక్కువగా ఉన్నట్లు భావిస్తుంది. ఇది తక్కువ ఆహారంతోనే సంతృప్తి చెందేలా చేస్తుంది. ఫలితంగా శరీరానికి అందే కేలరీలు తగ్గుతాయి.

ఏకాగ్రతతో తినడం
చాలా మందికి ఆహారం తినేటప్పుడు ఫోన్, టీవీ వంటి వాటిని చూడటం అలవాటు. దీనివల్ల తినే ఆహారంపై ఏకాగ్రత దెబ్బ తింటుంది. ఫలితంగా ఎంత తింటున్నామన్న దానిపై స్పష్టత ఉండదు. కాబట్టి టీవీ, ఫోన్ లేకుండా ఆహారాన్ని తినడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల నెమ్మదిగా నమిలి తినే వెసులుబాటు కూడా కలుగుతుంది.

రాత్రివేళ త్వరగా బ్రష్ చేయడం
రెండు పూట్ల బ్రష్ చేసేవారు.. రాత్రి సమయాల్లో కాస్త త్వరగా పళ్లుతోముకోవడం చేయాలి. దీని వల్ల ఆహారం తినే సమయం ముగిసిందని మెదడుకు సంకేతం ఇచ్చినట్లు అవుతుంది. ఫలితంగా రాత్రి పూట చిరుతిళ్లు నివారించడానికి ఈ ఐడియా గేమ్ ఛేంజర్ గా మారే ఛాన్స్ ఉంది. దీని వల్ల రోజుకు 200-600 కేలరీలు ఆదా చేయవచ్చు.

ద్రవ కేలరీలు తగ్గించండి
శరీరంలో కేలరీలు భారీగా పెరగడానికి కూల్ డ్రింక్స్, టీ, కాఫీ వంటివి కూడా ఒక కారణం. చాలా మంది వీటిని ఆహారంగా పరిగణించరు. కానీ వీటి ద్వారానే అధిక కేలరీలు శరీరంలోకి వచ్చి చేరతాయి. కాబట్టి శీతల పానియాలు, టీ, కాఫీలు వంటివి పరిమితం చేయడం ద్వారా బరువును నియంత్రించవచ్చు.

ఫ్రై ఫుడ్స్, వెన్న తగ్గించండి
డీప్ ఫ్రై ఆహారాన్ని రెగ్యులర్ గా తినడం వల్ల శరీరంలోకి వంట నూనె అధికంగా చేరుతుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. అంతేకాదు బీపీ, షుగర్ వంటి వ్యాధుల బారిన పడే ముప్పును పెంచుతుంది. అలాగే వెన్నతో చేసిన ఉత్పత్తులు శరీరంలోకి అధిక కేలరీలను మోసుకెళ్తాయి. వాటి వినియోగాన్ని తగ్గించడం ద్వారా కేలరీలపై నియంత్రణ సాధించి బరువుకు తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?