Jack Russell
Viral, లేటెస్ట్ న్యూస్

Viral News: ఒకప్పుడు సచిన్‌కు ప్రత్యర్థి.. నేడు ఆయన బతుకుదెరువు ఏంటో తెలుసా?

Viral News: క్రికెట్ లెజండ్ సచిన్ టెండూల్కర్‌కు ఒకప్పుడు ప్రత్యర్థి జట్టు ఆటగాడైన ఒక మాజీ ప్లేయర్ ఇప్పుడు పేయింటింగ్‌పై (Viral News) ఆధారపడి జీవిస్తున్నాడు. ఆయనే ఇంగ్లాండ్ మాజీ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ జాక్ రస్సెల్. లండన్‌లోని ఓ పోష్ ప్రాంతంలో పెయింటింగ్‌లు వేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. క్రికెట్ ఆడిన రోజుల మాదిరిగానే ఇప్పుడు కూడా ఆయన ప్రవర్తన ప్రత్యేకంగా ఉంది. తన పేయింటింగ్‌లకు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ తీసుకొచ్చేందుకు సోషల్ మీడియాను ఆశ్రయించాడు. అయితే, ఆసక్తికరంగా జాక్ రస్సెల్‌ ఫోన్ వాడడు. కనీసం వాట్సాప్‌ కూడా ఉపయోగించడు. ఆయనను సంప్రదించాలంటే ఈ-మెయిల్ ద్వారా మాత్రమే కుదురుతుంది. ప్రత్యక్షంగా కలవాలనుకుంటే లండన్‌లోని క్రిస్ బీటిల్స్ గ్యాలరీలో కలవడానికి సిద్ధంగా ఉంటానని చెబుతున్నారు.

10 ఏళ్ల క్రికెట్ కెరీర్
జాక్ రస్సెల్ పదేళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. 1988 నుంచి 1998 వరకు ఇంగ్లండ్ జట్టు తరపున 54 టెస్టులు, 40 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుతం 61 ఏళ్ల వయస్సున్న అతడు దూకుడు బ్యాటింగ్ శైలిని కలిగివుండేవారు. మైదానంలో కూడా కళ్లద్దాలు ధరించి ఆడేవాడు. వికెట్ల వెనుక అతడి రియాక్షన్స్ కూడా ప్రత్యేకంగా నిలిచేవి. తలపై పాతపాడైపోయిన టోపీ పెట్టుకునేవాడు. అయితే, ఇంగ్లండ్ తరపున బెస్ట్ కీపర్లలో ఒకడిగా పేరు సాధించాడు. సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, మొహమ్మద్ అజారుద్దీన్‌లతో కూడిన టీమిండియాతో ఇంగ్లండ్ తలపడిన జట్టులో జాక్ రస్సెల్‌ ఆడాడు. జాక్ రస్సెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ క్రికెట్‌తో అనుబంధాన్ని కొనసాగించాడు. ప్రస్తుతం తన పెయింటింగ్‌ల ద్వారా కూడా ఆ అనుబంధాన్ని కొనసాగించాలని భావిస్తున్నాడు. ఇండియాలో తనకు అభిమానులు ఎక్కువగా ఉండటంతో ఈ మధ్యే ఇంగ్లండ్ తరపున ఆడిన మొదటి భారతీయుడు రంజిత్ సింహ్‌జీ చిత్రపటాన్ని పెయింటింగ్ వేశాడు. జాక్ రస్సెల్ వేసిన పెయింటింగ్స్ చూడాలనుకుంటే లండన్‌లోని రైడర్ స్ట్రీట్‌లోని గ్యాలరీకి వెళ్లాల్సిందే.

Read Also- Nimisha Priya: నిమిషా మరణశిక్షపై మరోసారి స్పందించిన కేంద్రం

ఏడాదికో గొప్ప పెయింటింగ్
తాను ప్రతి ఏడాది చరిత్రలోని ఒక గొప్ప వ్యక్తి చిత్రాన్ని పెయింటింగ్ వేయడానికి ప్రయత్నిస్తానని, గతేడాది ఇంగ్లండ్ మాజీ దిగ్గజం ‘డగ్లస్ జార్డైన్‌’ను చిత్రాన్ని గీశానని జాక్ రస్సెల్ ప్రస్తావించాడు. ‘‘ఈ సంవత్సరం రంజిత్ సింహ్‌జీని ఎంపిక చేసుకున్నాను. ఆయనను గమనిస్తే గొప్ప చరిత్ర ఉన్నవాడు. గొప్ప ప్లేయర్ కూడా. చాలా రంగుల కలయికతో కూడిన జీవిత గాధ. ఇది నా ఫేవరెట్‌లలో ఆయన ఒకరు. ఇంగ్లండ్- భారత మధ్య టెస్ట్ సిరీస్ కొనసాగుతున్న సందర్భంలో ఈ పెయింటింగ్ బావుంది’’ అని ఓ భారతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. “1998లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చాను. 2004లో కౌంటీ క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలికాను. అప్పటినుంచి ఇప్పటి వరకు, 20 ఏళ్లుగా నేను ప్రతిరోజూ పెయింటింగ్ చేస్తూనే ఉన్నాను. నా పని అదొక్కటే. రోజంతా పెయింటింగ్ చేస్తూ ఉంటాను. అదే నా జీవన విధానం” అని జాక్ రస్సెల్ వివరించాడు. ప్రస్తుతం క్రికెట్ కంటే పెయింటింగ్‌పైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నట్టుగా ఆయన మాటల్లో స్పష్టమైపోతోంది. 2019 యాషెస్ సిరీస్‌కు సంబంధించిన కొన్ని పెయింటింగ్స్ 25,000 పౌండ్లకి అమ్ముడుపోయాయని తెలిపాడు. అదే ఇప్పుడు ఐదేళ్లపాటు ఇంగ్లండ్ తరపున ఆడితే జీవితాంతం పని చేయాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నాడు. అయితే, కేవలం డబ్బు కోసమే పెయింటింగ్స్ చేయడం లేదని, తను చాలా ఇష్టం, ప్రేమ అని జాక్ రస్సెల్ వివరించాడు.

Read Also- Viral News: తండ్రి చనిపోయి వర్క్‌ఫ్రమ్ హోం అడిగితే.. మేనేజర్‌ ఏమన్నాడంటే?

భారత్‌లో పెయింటింగ్ చేస్తూ జీవితాంతం గడపగలనని రస్సెల్ విశ్వాసం వ్యక్తం చేశాడు. 1989 నెహ్రూ కప్, 1996 వరల్డ్ కప్‌ సమయంలో భారత్‌కు వచ్చానని, ఆ తర్వాత తిరిగి రాలేదని గుర్తుచేసుకున్నాడు. ప్రస్తుతం తనకు అన్నింటి కంటే బాగా ఇష్టమైనది పెయింట్, పెయింట్, పెయింట్ అని చెప్పాడు.

Just In

01

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!