Viral Video: ఈ భూమిపైన ఉన్న ప్రమాదకర జీవుల్లో సర్పాలు ఒకటి. వాటిని చూస్తేనే చాలా మంది ఆమాడదూరం పరిగెడతారు. ఎక్కడ తమను కాటు వేస్తుందోనని తెగ భయపడిపోతారు. అలాంటిది ఓ వ్యక్తి అతిపెద్ద పామును.. చాలా తేలిగ్గా పట్టేసుకున్నాడు. సింగిల్ హ్యాండ్ తో దాన్ని హ్యాండిల్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే..
ఇన్ స్టాగ్రామ్ యూజర్ డిలాన్ జోసెఫ్ సింగర్ (Dylan Joseph Singer) షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బురద నీటి నుంచి ఓ భారీ అనకొండను అతడు బయటకు తీశాడు. ఎంతో ధైర్యంగా ఒక చేతితోనే దాన్ని హ్యాండిల్ చేశాడు. అనకొండను రక్షించి.. దానిని సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టినట్లు డిలాన్ జోసెఫ్ ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టారు. అయితే ఈ వీడియో పోస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెద్ద ఎత్తున నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.
View this post on Instagram
Also Read: Shubhanshu Shukla: ఫ్యామిలీని కలుసుకున్న శుభాంశు శుక్లా.. నెట్టింట భావోద్వేగ పోస్ట్!
నెటిజన్ల రియాక్షన్
భారీ సర్పాన్ని ఎంతో ధైర్యంగా జోసెఫ్ సింగర్ పట్టుకోవడంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అతడి గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందేనని ఆకాశానికెత్తుకున్నారు. అనకొండ అతడి చేతిని చుట్టేసినప్పటికీ అతడు ఏమాత్రం బెదరలేదని పేర్కొంటున్నారు. అయితే మరికొందరు అతడు రెస్క్యూ చేసిన విధానంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంత మురికిగా, అస్పష్టంగా ఉన్న నీటిలో పాము తల అక్కడే ఉందని అతనికి ఎలా తెలిసిందని ప్రశ్నిస్తున్నారు. మెుత్తంగా అనకొండ రెస్క్యూ వీడియో నెట్టింట చర్చకు తావిచ్చింది.