Shubhanshu Shukla (Image Source: Twitter)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Shubhanshu Shukla: ఫ్యామిలీని కలుసుకున్న శుభాంశు శుక్లా.. నెట్టింట భావోద్వేగ పోస్ట్!

Shubhanshu Shukla: రోదసి యాత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన వ్యోమగామి శుభాంశు శుక్లా.. 18 రోజుల మిషన్ తర్వాత భూమికి చేరిన సంగతి తెలిసిందే. భూమికి తిరిగొచ్చిన తర్వాత ఆయన తొలిసారి తన కుటుంబాన్ని కలిశారు. 2 నెలల తర్వాత తన కుటుంబాన్ని అప్యాయంగా తన భార్య, కుమారుడ్ని ఆలింగనం చేసుకున్న ఫొటోలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇవి గొప్ప భావోద్వేగ క్షణాలంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అద్భుతమైన క్షణాలు: శుభాంశు
యాక్సియం – 4 మిషన్ (Axiom-4 Mission)లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో అడుగుపెట్టిన శుభాంశు శుక్లా.. తిరిగి భూమికి సురక్షితంగా చేరుకున్నారు. ఒక రోజు క్వారంటైన్ తర్వాత హూస్టన్ లోని పునరావాస కేంద్రంలో భార్య కమ్నా, కుమారుడు కైశ్ ను కలిసి ఆనందంతో హత్తుకున్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను శుభాంశు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ పోస్టుకు ఉద్వేగభరిత వ్యాఖ్యలను జోడించారు. ‘అంతరిక్ష ప్రయాణం అద్భుతంగా ఉంది. కానీ చాలా కాలం తర్వాత ప్రియమైన వారిని చూడటం కూడా అంతే అద్భుతంగా ఉంది. నేను క్వారంటైన్‌లోకి వెళ్లి 2 నెలలు అయింది. క్వారంటైన్ సమయంలో కుటుంబ సభ్యులను సందర్శించడానికి మేము 8 మీటర్ల దూరంలో ఉండాల్సి వచ్చింది. చేతుల్లో క్రిములు ఉన్నాయని అందుకే తాకలేకపోతున్నట్లు నా బిడ్డకు చెప్పాల్సి వచ్చింది. భూమికి తిరిగివచ్చి ఫ్యామిలినీ హత్తుకున్నప్పుడు ఇంటికి వచ్చినట్లే అనిపిస్తోంది’ అంటూ శుభాంశు రాసుకొచ్చారు.

భార్యతో శుక్లా పరిచయం
శుభాంశు శుక్లా-కామ్నా పరిచయం దశాబ్దాల క్రితమే పరిచయం జరిగింది. లక్నోలోని ఓ ప్రైమరీ స్కూల్‌లో కలిసి చదువుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం ఉంది. శుభాశు క్లాస్ రూమ్‌లో చాలా సైలెంట్‌గా ఉండేవారని, దేశాన్ని ప్రేరణగా తీసుకొని ఎదిగారని కామ్నా గుర్తుచేసుకున్నారు. యాక్సియం-4 ప్రారంభానికి ముందు ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలు పంచుకున్నారు. దేశానికి సేవలు అందించే క్రమంలో జీవితంలోని చాలా ముఖ్యమైన క్షణాలను శుక్లా కోల్పోయారని వివరించారు. సవాళ్లను తట్టుకున్నారని పేర్కొన్నారు. ‘‘మాకు బాబు పుట్టినప్పుడు ఒక తండ్రిగా శుక్లా ఆ కీలక క్షణాలను కోల్పోయారు. అవి నాకు చాలా బాధ కలిగిస్తాయి. ఏదేమైనా లక్ష్యం విషయంలో శుక్లా గురితప్పలేదు. మహాభారతంలో అర్జునుడిలా శుభాంశు శుక్లాకు దృఢ సంకల్పం ఉంది. నిర్దిష్టమైన ఏకాభిప్రాయం, ఖచ్చితత్వంతో ఉంటారు’’ అని కామ్మా వివరించారు.

Also Read: Hyderabad Land Dispute: నమ్మి మోసపోయామంటున్న బాధితులు.. రూ.2 వేల కోట్లకు పైగా నష్టమంటూ ఆవేదన

శుభాంశు గురించి ఇవి తెలుసా?
శుభాంశు శుక్లా చదువు లక్నోలోని సిటీ మాంటిస్సోరి స్కూల్‌లో మొదలైంది. 1998లో కార్గిల్ యుద్ధ సమయంలో ఆయన కెరీర్‌ మలుపు తిరిగిందని చెప్పాలి. ఎందుకంటే, దేశానికి సేవ చేయాలనే బలమైన సంకల్పం ఆ సమయంలో పురుడు పోసుకుంది. దృఢ సంకల్పాన్ని పూనుకున్న ఆయన, తన కుటుంబానికి తెలియజేయకుండా యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) పరీక్షకు అప్లికేషన్ పెట్టారు. ఎంతో సంక్లిష్టంగా ఉండే ఆ పరీక్షలో పాసయ్యారు. 2005లో ఎన్‌డీఏ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని కూడా ఆయన చదివారు. ఆ తర్వాత, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో విమానం నడపంలో ట్రైనింగ్ తీసుకున్నారు. 2006లో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు నడిపేందుకు అధికారికంగా నియమితులయ్యాయి.

Also Read This: BJP Chief Ramchander Rao: గెలిచినా ఓడినా సిద్ధాంతం కోసం పనిచేస్తా.. రాంచందర్ రావు సంచలన వ్యాఖ్యలు

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..