PM Dhan Dhanya Krishi Yojana: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయాన్ని మరింత పటిష్టం చేసేందుకు, రైతుల అభ్యున్నతి కోసం ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజనకు నిధులు కేటాయించేందుకు అంగీకరించారు. ఈ పథకం కోసం రూ.24 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. ముందుగా వంద జిల్లాల్లో చర్యలు చేపట్టనున్నట్టు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Also Read: Telangana Cabinet Meeting: సుదీర్ఘంగా క్యాబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలకు ఆమోదం!
రూ.20 వేల కోట్లు
అలాగే, పునరుత్పాదక శక్తిలో పెట్టుబడి పెట్టడంతోపాటు జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ సంస్థను మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్తామని వివరించారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు చెప్పారు. ఎన్టీపీసీ ఈక్విటీ ఇన్ఫ్యూషన్ రూపంలో ఎన్జీఈఎల్‌లో రూ.7,500 కోట్లు పెట్టుబడి పెట్టగా, ఇకపై రూ.20 వేల కోట్లకు దాన్ని పెంచనున్నట్టు వివరించారు. ఇక క్యాబినెట్ భేటీలో యాక్సియం 4 మిషన్ ప్రయోగం విజయవంతంపై ప్రధాని, మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి, భూమికి తిరిగొచ్చిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లాకు అభినందనలు తెలియజేశారు.
Also Read: TG Cabinet Expansion: ఎవరికి ఏ శాఖో..? సీఎం వద్ద కీలక శాఖలు!
