TG Cabinet Expansion: ఎవరికి ఏ శాఖో..? సీఎం వద్ద కీలక శాఖలు!
TG Cabinet Expansion( image credit: twitter)
Telangana News

TG Cabinet Expansion: ఎవరికి ఏ శాఖో..? సీఎం వద్ద కీలక శాఖలు!

TG Cabinet Expansion: కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారనేది? ఇప్పుడు ఉత్కంఠగా మారింది. తమకు ఏ శాఖలు ఇచ్చినా.. సమర్ధవంతంగా న్యాయం చేస్తామని ఇప్పటికే ఆ ముగ్గురు మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి (RevanthReddy) కి హామీ ఇస్తూనే, తమ ఇంట్రస్ట్ ను కూడా సున్నితంగా వివరించారు. అయితే ఆయా మంత్రుల శాఖలపై ఇప్పుడు చర్చంశనీయమైనది. సీఎం వద్ద ఉన్న విద్య, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హోం తదితర శాఖల్లో నుంచి కొన్ని తీసి, కొత్త మంత్రులకు కేటాయిస్తారా? లేదా రెండు మూడు శాఖలు కలిగిన పాత మంత్రుల నుంచి కొన్ని తొలగించి కొత్త వాళ్లకు అటాచ్ చేస్తారా? అనేది తెలియాల్సి ఉన్నది.

ఆ శాఖ సెట్ అవుతుందా?

ప్రభుత్వం నుంచి  రాత్రి వరకు శాఖలపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆయా మంత్రుల ఫాలోవర్స్ ఉంచి పార్టీ నేతల వరకు అందరూ శాఖల కేటాయింపు పై ఆరా తీస్తున్నారు. తమ సార్ కు ఏం శాఖలు ఇస్తున్నారు? ఆ శాఖ సెట్ అవుతుందా? తదితర అంశాలపై గాంధీభవన్, సచివాలయ వర్గాల నుంచి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. అయితే తొలి దశ మంత్రి వర్గ కూర్పు సమయంలో శాఖల కేటాయింపు అంశంలో హైకమాండ్ అభిప్రాయాన్ని కూడా సేకరించినట్లు తెలిసింది. ఇప్పుడు కూడా అదే రూల్ ఫాలో అవుతారా? లేదా సీఎం రేవంత్ రెడ్డి శాఖలను డిసైడ్ చేస్తారా? అనేది తెలియాల్సి ఉన్నది.

 Also Read: Bonalu Festival: బోనాల జాతరకు రూ.20కోట్లు.. ఏర్పాట్ల కోసం నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం!

కొత్త మంత్రుల శాఖలు ఇవేనా..?
గడ్డం వివేక్ కు కార్మిక , మైనింగ్ శాఖలు ఇస్తారనే చర్చ పార్టీలో ఉన్నది. సెక్రటేరియట్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఛాంబర్ ఇవ్వనున్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఇక అడ్లూరి లక్ష్మణ్​ కు ఎస్సీ, ఎస్టీ వెల్ఫెర్ శాఖను కేటాయించనున్నట్లు ప్రచారం ఉన్నది. సెక్రటేరియట్ లోని మూడో ఫ్లోర్ లో ఆయనకు ఛాంబర్ ఇస్తారని చర్చ ఉన్నది. వాకిటి శ్రీహరికి క్రీడలు, యువజన, న్యాయ శాఖలు ఇస్తారని పార్టీలో ప్రచారం ఉన్నది. ఈయనకు సచివాలయంలో ఫోర్త్ ఫ్లోర్ లో ఛాంబర్ ఇస్తారని ఆయన ఫాలోవర్స్ వివరించారు.

ఆ జిల్లాలకు ముగ్గురు చొప్పున మంత్రులు…
మంత్రి వర్గ విస్తరణ తర్వాత ప్రస్తుతం ఉమ్మడ ఖమ్మం, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలకు ముగ్గురు మంత్రులు ఉండగా, నల్లగొండలో ఇద్దరు, వరంగల్ నుంచి ఇద్దరు, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలకు ఒకరు చొప్పున ఉన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ఇప్పటి వరకు ప్రాతినిథ్యం లభించలేదు. రెండో దఫా విస్తరణలో ఈ జిల్లాలకు న్యాయం చేస్తామని ఏఐసీసీ నేతలు చెప్తున్నారు. ఇందులో మైనార్టీ తో పాటు మరో రెండు సామాజిక వర్గాల నుంచి ఎంపిక చేసేలా పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.

 Also Read: Chandrababu Naidu: ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే.. ఏపీ ముఖ్యమంత్రి సంచలన వాఖ్యలు!

Just In

01

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!