- రివైజ్డ్ అనుమతుల్లో ఎన్నో లొసుగులు?
- సెక్యూరిటీ అంశాన్ని పట్టించుకోని గత ప్రభుత్వం
- స్టాక్ ఎక్స్‌ఛేంజ్ భూముల పేరుతో రాజ్ భవన్‌కు ముప్పు
- హెచ్ఎస్ఈఎల్ షేర్ హోల్డర్స్ ఒప్పందం ప్రకారం ఇవ్వడం లేదా?
- 648 గజాల బస్టాండ్, 900 గజాల రోడ్డు పోగా మిగిలింది ఏంత?
- బ్యాక్ ఎండ్ పొలిటికల్ పవర్స్‌తో ఏదైనా చేస్తారా?
- యూఎల్సీ క్లియర్ అయితే సెక్యూరీటీ రీజన్స్ గాలికి వదిలేస్తారా?
- ప్రణవ వన్.. వన్ సైడ్ ఆగడాలపై ధర్నా ఎందుకు చేశారో ‘స్వేచ్ఛ’ ఇన్వెగేటివ్ స్టోరీ
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్
Pranava One: ప్రణవ వన్ హెచ్ఎస్ఈఎల్.. ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉంటుంది. ఖైరతాబాద్ సర్ఫేఖాస్(నిజాం భూములు) భూముల్లో ఉండే ఈ భారీ భవనం గతంలో సిరాజ్ యార్ జాంగ్ పేరిట ఉండేది. 22 వేల స్క్వేర్ యార్డ్స్‌లో సర్వే నెంబర్ 229, 231లో నిర్మించిన ఈ భారీ భవంతి వివాదాస్పదమైంది. నిజానికి ఈ భవనం ఉన్న భూమి ఖుర్చిద్ బేగానికి గిఫ్ట్‌గా వచ్చింది. 1966లో ఆమె చనిపోయిన తర్వాత ఆరుగురు లీగల్ హెయిర్స్‌కు సంక్రమించింది. 1994లో నవ భారత్ ఎంటర్ ప్రైజెస్ అర్బన్ సీలింగ్ యాక్ట్‌కు విరుద్ధంగా కొనుగోళ్లు జరిగాయి. తప్పించుకునేందుకు 17,700 గజాల భూమిని హైదరాబాద్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ లిమిటెడ్‌కు అమ్మకం జరిపారు. అదే ఏడాది నుంచి రాజ్ భవన్‌కు ఆనుకుని ఉండే ఈ భూమిలో ప్రణవ వన్ అత్యంత ఎత్తైన భవంతులను నిర్మించడం మొదలుపెట్టింది. హైదరాబాద్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు చెందిన 17 వేల 52 గజాల్లో నిర్మాణం పూర్తి అయింది. ప్రాపర్టీ బేరింగ్ నెంబర్ 6 – 3 – 654/1 నుంచి 9 వరకు సర్వే నెంబర్ 229, 231. స్టాక్ ఎక్స్‌ఛేంజ్ వాళ్లకు 17,052 గజాల్లో మొత్తం 10 లక్షల 82 వేల స్క్వేర్ ఫీట్స్ నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారు. అదే అనుమతులతో రోడ్లు కబ్జా చేసుకుని రివైజ్ అంటూ అనుమతులు తీసుకుంటున్నారు. బినామీలకు స్క్వేర్ ఫీట్స్ రాయిస్తే ఏదైనా పర్మిషన్ ఇచ్చేలా రూల్స్ తీసుకొచ్చారు. అందుకు రాజ్ భవన్ భద్రతను సైతం గాలికి వదిలారు. ఇప్పటికి రాజ్ భవన్ వైపు పరదా కట్టాలని నిబంధనలు పెట్టారు కానీ, 23 అంతస్తులకు అనుమతి ఎలా ఇచ్చారో వివరణ ఇవ్వడం లేదు. ప్రణవ రవి కుమార్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ వాటా వాళ్లను ఎంట్రీ కాకుండా ఇబ్బందులు పెడుతున్నారు అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇంటెలిజెన్స్ రిపోర్టుతో పాటు వివిధ సెక్యూరిటీ జీవోలు, ఉత్తర్వులు అడ్డు తగులుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
Read Also- Dubai: దుబాయ్ డీలింగ్స్? ముందే చెప్పిన ‘స్వేచ్ఛ’
‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్‌తో సంచలన నిజాలు
ఒక ఫినిక్స్, ప్రెస్టేజీ, మై హోం, డీఎస్ఆర్, వంశీరాంతో పాటు మరో మూడు కంపెనీల్లో ప్రణవ గ్రూప్ రూల్స్‌కు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడానికి కూడా బీఆర్ఎస్ బీనామీల్లో వాటా ఉన్నది. అనుమతి ఇచ్చిన అధికారులకు స్క్వేర్ ఫీట్లలో తక్కువ ధరకు ఇచ్చారని ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. వీటికి సంబంధించిన ప్రతి ఆధారాలను మరో కథనంలో చూద్దాం.
Read Also- Ariyana Glory: బెడ్ రూమ్ లో మా బావ మరో అమ్మాయితో అలాంటి పని.. చూసి బ్రేకప్ చెప్పా.. బిగ్ బాస్ బ్యూటీ