Vijay Kumar Resigns (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Vijay Kumar Resigns: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. బీజేపికి మరో కీలక నేత గుడ్ బై

Vijay Kumar Resigns: బీజేపీ మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పంజావిజయ్ కుమార్(Vijay Kumar), ఆయన అనుచరులు, లీలా గ్రూప్ చైర్మన్ మోహన్ నాయక్‌(Mohan Nayaka)తో పాటు బీజేపీ, బీఅర్ఎస్ పార్టీ నుండి మెదక్‌లో మంత్రులు దామోదర్ రాజనర్సింహ(Damodar Rajanarsimha), వివేక్ వెంకటస్వామి(Vivek), పీసిసిచీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) సమక్షంలో చేరికలకు రంగం సిద్ధం చేస్తున్నారు. గురువారం మెదక్‌కు మంత్రుల పర్యటన ఖరారు అయింది. పీసీసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహితం చేరికలకు వస్తున్నట్లు సమాచారం.

బీజేపీలో బీసీలకు ప్రాతినిధ్యం లేదు
ఈ మేరకు బీజేపీ మెదక్ నియోజక వర్గ ఇన్చార్జి, గత ఎన్నికల్లో ఎమ్మెల్యే రోహిత్ రావు(MLA Rohith Rao)పై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నిజాంపేట్ తాజా మాజీ జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ బుదవారం బీజేపీ(BJP) పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీలో బీసీలకు ప్రాతినిధ్యం లేదని, రాజసింగ్(Rajasingh) రాజీనామాను, పార్టీ అధిష్టానవర్గం ఆయనతో చర్చింకుండా ఆమోదించడాన్ని తప్పు పట్టారు. ఈ మేరకు మీడియాకు ప్రకటన విడుదల చేశారు.

ఇదిలా ఉండగా బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి ఆశించి భంగపడ్డ పంజా విజయ్ కొంత కాలంగా పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. ఈటెల రాజేందర్‌(Etela Rajender)కు అనుచరుడిగా ఉన్న రాజందర్ కాంగ్రెస్(Congress) పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తుంది. బీఅర్ఎస్(BRS) పార్టీ టికెట్‌పై నిజాంపేట్ జడ్పీటీసీ(ZPTC)గా గెలిచి గతంలో బీజేపీలో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.

Also Read: Warangal Suicide Case: డాక్టర్ ప్రత్యూష మృతికి కారణం వాళ్లే.. నలుగురి అరెస్ట్

మెదక్ కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ
ఆయనతో పాటు ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతా రావు(Mynampally Hanumantha Rao) పంజా విజయ్‌తో మాట్లాడి పార్టీలో చేరికకు ఒప్పించినట్లు తెస్తుంది. కాగా నియోజక వర్గం నుండి మాజీ సర్పంచులు, ఎంపీటీసీ(MPTC)లు, సీనియర్ నాయకులను పార్టీలోకి చేరికలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో పీసిసి కార్యదర్శిగా ఉండి మెదక్ కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడ్డ మ్యాడమ్ బాలకృష్ణ(Balakrishna)ను తిరిగి పార్టీలోకి మైనంపల్లి హనుమంతా రావు తీసుకొస్తున్నారు.

ఈ మేరకు హైదరాబాద్ నివాసంలో మైనంపల్లి హనుమంతా రావును మ్యాడమ్ బాలకృష్ణ కలిశారు. ఇదిలా ఉండగా ఇటీవల కాంగ్రెస్ నుంచి జీవన్ రావు, గంగా నరేందర్, స్వామినాయక్, కోర్విపల్లి మాజీ సర్పంచ్ మైనంపల్లి రంగారావులు కేటిఆర్, హరీష్ రావు, జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి సమక్షంలో బీఅర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. అదే స్థాయిలో బీజేపీ, బీ అర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేర్పించే విధంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతా రావు ఛాలెంజ్‌గా తీసుకొని చేరికల కార్యక్రమాన్ని గురువారం మెదక్ లోని ఒక గార్డెన్ లో ఏర్పాటు చేసి మంత్రులను, పీసీసి చీఫ్ కు ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: BRS Party: కారును పోలిన గుర్తులు తొలగింపుపై ఈసీపై ఒత్తిడి

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!