Warangal Suicide Case: ఇద్దరు డాక్టర్లు ఆర్థికంగా కొదవ లేదు ఇద్దరు పిల్లలతో హ్యాపీగా సాగిపోతున్న కుటుంబాన్ని వివాహేతర సంబంధం చిన్నా బిన్నం చేసింది. పొరపాటు చేసి భార్య ప్రాణం పోవాడానికి కారణమై జైలు పాలు అయిన భర్త.. తల్లిదండ్రుల ఆలనా కరువైన పిల్లలు ఇది హనుమకొండ జిల్లా హసన్పర్తిలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన డాక్టర్ ప్రత్యూష(Dr. Pratyusha) కుటుంబ పరిస్థితి. హనుమకొండ జిల్లాలో చర్చనీయాంశంగా మారిన డాక్టర్ ప్రత్యూష సూసైడ్ కేసులో భర్త డాక్టర్ సృజన్(Dr. Srujan), సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బానోత్ శృతి(Bhanot Shruti) (బుట్టబొమ్మ), అత్త మామలు అల్లాడి మధుసూదన్, అల్లాడి పుణ్యవతిలను మంగళవారం అరెస్ట్ చేసినట్టు కాజీపేట ఏసిపి పింగళి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
Also Read: Viral News: ట్రాఫిక్‌లో 2 గంటలు చిక్కుకున్న కంపెనీ ఓనర్.. కీలక నిర్ణయం
అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం
ఏసిపి తెలిపిన వివరాల ప్రకారం డాక్టర్ ప్రత్యూష- సృజన్ ఇద్దరికి 2017లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహేతర సంబంధం కారణంగా కొంత కాలంగా వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. సృజన్ సోషల్ మీడియా(Scocial Media) ఇన్ఫ్లుయెన్సర్ శృతితో పరిచయం పెంచుకుని అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం భార్య ప్రత్యూష గ్రహించింది. ఎంత మందలించినా భర్త వినలేదు తన తీరు మార్చుకోలేదు.
ఈ విషయం అత్త మామల దృష్టికి తీసుకువెళ్లిన వారు పట్టించుకుపోగా కొడుకునే సపోర్ట్ చేశారు. ఈ క్రమంలో ఆదివారం వీరు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైనా ప్రత్యూష ఆదివారం ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. మృతురాలు బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం నలుగురిపైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు.
Also Read: Medical College Vacancies: సీనియారిటీ ఆధారంగా సిటీలో పోస్టింగ్ ఛాన్స్.. సర్కార్ స్టడీ