Gold Rates ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rates (16-07-2025): భారీ గుడ్ న్యూస్.. తగ్గిన గోల్డ్ రేట్స్..

Gold Rates (16-07-2025): తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు, సంస్కృతి సంప్రదాయంలో ఒక భాగం కూడా.. శుభకార్యాలు, పెళ్లిళ్లు, పండుగల సమయంలో మహిళలు బంగారు ఆభరణాలను ధరించడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. అయితే, ఇటీవలి ఆర్థిక అనిశ్చితుల కారణంగా బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి.

ధరలు పెరిగితే కొనుగోలుదారులు వెనక్కి తగ్గుతారు, కానీ ధరలు తగ్గినప్పుడు బంగారం కొనేందుకు జనం షాపుల వైపు పరుగులు పెడుతున్నారు.పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారం ధరలు గణనీయంగా పెరిగాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా, వివాహ సీజన్‌లో బంగారం ధరలు కొంతమేర పెరగడం సర్వసాధారణం, కానీ ఈ సారి ధరలు అసాధారణంగా ఎక్కువగా పెరిగాయి. అయినప్పటికీ, జులై 16, 2025 నాటికి బంగారం ధరలు భారీగా తగ్గాయి, దీంతో ఆడవాళ్ళు  ఆభరణాల దుకాణాలకు ఆకర్షితులవుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల కారణంగా, పెళ్లి సీజన్ ముగిసిన తర్వాత ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: Immunity Boosting Tips: శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే 7 చిట్కాలు.. ఇవి పాటిస్తే డాక్టర్‌తో పని లేనట్లే!

24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.490 కి తగ్గి రూ.99,280 కి ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.450 తగ్గి రూ.91,000 కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, వరంగల్‌లో బంగారం ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు)

హైదరాబాద్: రూ.99,280
విజయవాడ: రూ.99,280
విశాఖపట్టణం: రూ.99,280
వరంగల్: రూ.99,280

22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు):

హైదరాబాద్: రూ.91,000
విజయవాడ: రూ.91,000
విశాఖపట్టణం: రూ.91,000
వరంగల్: రూ.91,000

వెండి ధరలు

వెండి ధరలు కూడా ఇటీవల గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.1,25,000గా ఉండగా, రూ.2,000 పెరిగి ప్రస్తుతం రూ.1,27,000కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి:

వెండి (1 కిలో):

హైదరాబాద్: రూ.1,27,000
విజయవాడ: రూ.1,27,000
విశాఖపట్టణం: రూ.1,27,000
వరంగల్: రూ.1,27,000

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?