Phone Tapping Case( IMAGE credit: free PIc)
తెలంగాణ

Phone Tapping Case: ట్యాప్​ చేయాలని ఎవరు ఆదేశించారు.. అంతా పై అధికారులకు తెలుసు

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్​ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్​ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) ఆరోసారి సిట్​ విచారణకు హాజరయ్యారు. సెట్ అధికారులు ఆయనను సుధీర్ఘంగా ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడ్డాక అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఫోన్​ ట్యాపింగ్ వ్యవహారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. దీనిపై మొదట పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు కాగా ఆ తరువాత వాటిని సిట్ కు మార్చారు. విచారణలో ఎస్​ఐబీ ఛీఫ్ గా ఉన్న సమయంలో ప్రభాకర్ రావు (Prabhakar Rao) ప్రతిపక్ష పార్టీలు…ముఖ్యంగా కాంగ్రెస్​ కు చెందిన కీలక నాయకుల (Phone Tapping) ఫోన్‌లను ట్యాప్ చేయించినట్టుగా వెల్లడైంది.

 Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

వివరాలను ఇవ్వడం లేదు

ఇదే కేసులో రెండో నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావు విచారణలో ఇదే విషయాన్ని వెల్లడించాడు. అయితే, ప్రభాకర్​ రావు మాత్రం ఫోన్​ ట్యాపింగ్‌కు (Phone Tapping) సంబంధించి సిట్‌కు స్పష్టమైన వివరాలను ఇవ్వడం లేదు. బాధితుల వాంగ్మూలాలను ముందు పెట్టి ప్రశ్నించినా నేనం చేశానో నా పై అధికారులు అందరికీ తెలుసంటూ మరికొందరిని ఈ కేసులోకి లాగేలా జవాబులు చెబుతూ వస్తున్నాడు. ఇక, ఫలానా నాయకుల ఫోన్లను ట్యాప్ చేయాలని కూడా తాను ఎవ్వరికీ ఆదేశాలు ఇవ్వలేదన్నాడు.

మరోసారి విచారణ 

ఈ క్రమంలో సహనం నశించిన సిట్ అధికారులు ప్రభాకర్ రావును అరెస్ట్ చేయొద్దంటూ సుప్రీం కోర్టు అతనికి కల్పించిన రక్షణను తొలగిపోయేలా చూడాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్​, సిట్ ఇన్‌ఛార్జ్​ వెంకటగిరిలు ఇటీవల ఢిల్లీ కూడా వెళ్లారు. న్యాయవాదులతో చర్చలు కూడా జరిపారు. తాజాగా, మంగళవారం మరోసారి ప్రభాకర్ రావును విచారణకు పిలిపించిన సిట్ అధికారులు ఇప్పటివరకు ట్యాపింగ్​ బాధితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా మరోసారి ప్రశ్నించారు.

తమకు స్టేట్‌మెంట్ ఇచ్చిన బాధితుల పేర్లను ప్రస్తావిస్తూ వీరి ఫోన్లను ఎందుకు ట్యాప్​ చేయించారు? అని అడిగినట్టు సమాచారం. వీరి ఫోన్ నెంబర్లను ట్యాప్​ చేయాలని ఎవరి నుంచి సూచనలు అందాయి? అని కూడా ప్రశ్నించినట్టుగా తెలిసింది. అయితే, ప్రభాకర్ రావు ఇంతకు ముందులానే సమాధానాలు చెప్పినట్టుగా సమాచారం. తాను ఫలానా వ్యక్తుల ఫోన్లను ట్యాప్​ చేయాలని ఎవరికీ ఆదేశాలు ఇవ్వలేదని అన్నట్టు తెలిసింది. తన పై అధికారులకు తెలిసే ఫోన్ల ట్యాపింగ్ (Phone Tapping) జరిగిందని చెప్పినట్టు సమాచారం.

 Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో.. సిట్ దూకుడు!

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ