Vikarabad District police (imagecredit:swetcha)
రంగారెడ్డి

Vikarabad District police: జీరో ఎఫ్‌ఐఆర్ కేసులపై నిర్లక్ష్యం తగదు.. నారాయణ రెడ్డి

Vikarabad District police: వికారాబాద్ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణకు కట్టుబడి ఉన్నామని జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి(Narayana Reddy) స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయం(Vikarabad District Police Office)లో జిల్లాలోని పోలీస్ అధికారులతో నిర్వహించిన సమగ్ర సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా జీరో ఎఫ్‌ఐఆర్(FIR) కేసుల విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో నమోదైన కేసుల వివరాలను, ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

బాధితులకు సత్వర న్యాయం
డిఎస్‌పి, ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులు పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. దీనివల్ల బాధితులకు సత్వర న్యాయం అందుతుందని, న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని ఆయన అన్నారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో, ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీటీవీ(CCTV)ల ఏర్పాటును వేగవంతం చేయాలని సూచించారు. సీసీటీవీలు నేరాల నియంత్రణలో, నేరస్తులను గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన చెప్పారు. నిరంతరం వాహన తనిఖీలు (వెహికిల్ చెకింగ్), డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేయాలని, తద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు.

Also Read: Telangana BJP: కొత్త వారికి ఛాన్స్ ఇస్తారా? మళ్లీ పాత వారికేనా?

ప్రమాదాలు, ఆత్మహత్యలు
మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను పెంచి పూర్తిస్థాయిలో అరికట్టాలని ఆదేశించారు. ప్రమాదాలు, ఆత్మహత్యలు జరగకుండా నివారించేందుకు గ్రామాలు, పట్టణాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యతనిస్తూ, ప్రజలతో స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీలు పి.వి. మురళీధర్, టి.వి. హనుమంత్ రావు, తాండూర్, పరిగి, వికారాబాద్, ఏఆర్ డిఎస్‌పి లు, ఇన్‌స్పెక్టర్లు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

Also Read: Kriti Sanon: ప్రియుడితో క్రికెట్ మ్యాచ్ చూస్తున్న కృతి సనన్.. వైరల్ అవుతున్న సెల్ఫీ

 

 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు