Telangana BJP: తెలంగాణ బీజేపీలో ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న కార్యవర్గంలో కీలక మార్పులు జరగబోతున్నాయి. అతి త్వరలో నూతన కార్యవర్గం ఎంట్రీ ఇవ్వనున్నది. ఇందుకు కసరత్తుపై పార్టీ దృష్టిసారించినట్లు తెలుస్తున్నది. దీంతో శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కొత్త కమిటీ అంశం తెరపైకి రావడంతో ఆశావహులు స్టేట్ చీఫ్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. వారి జాబితా క్రమంగా పెరుగుతుండడంతో తమకు అవకాశం వస్తుందో? లేదోననే ఉత్కంఠ నేతల్లో మొదలైంది. ఇదెలా ఉండగా కమిటీల్లో అయినా కొత్త నేతలకు అవకాశం కల్పిస్తారా, లేదా మొండిచేయి చూపుతారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా విధేయుడిగా ఉన్న రాంచందర్ రావుకు హై కమాండ్ పట్టం కట్టింది. మరి ఈ కమిటీల్లో ఎవరికి అవకాశం కల్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read: Harish Rao Slams Congress: కాంగ్రెస్ పాలనలో 93 మంది విద్యార్థుల మృతి
రాంచందర్ రావు తన మార్క్ చూపిస్తారా
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ మార్పు అనంతరం కేంద్ర మంత్రి (Kishan Reddy) కిషన్ రెడ్డికి పార్టీ పగ్దాలు అప్పగించారు. ఆపై కమిటీలో పలు మార్పులు జరిగాయి. అయితే, అప్పటి వరకు బండి సంజయ్ (Bandi Sanjay) కోటరీగా ముద్రపడిన పలువురిని తప్పించి కిషన్ రెడ్డి (Kishan Reddy) తన టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారనే ప్రచారం జరిగింది. ఆయన తన మార్క్ చూపించారని గతంలో చెప్పుకున్నారు. మరి ఈ కొత్త కార్యవర్గం అంశంలో రాంచందర్ రావు (Ramchandra Rao) తన మార్క్ చూపిస్తారా? లేదా? అనేది సస్పెన్స్‌గా మారింది.
స్టేట్ చీఫ్‌గా పాత నేతకు అవకాశం ఇవ్వడంతో కమిటీలో కొత్త వారికి అవకాశం కల్పించాలని ఆశిస్తున్నారు. బీజేపీ (BJP) ఇటీవలే ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా పలువురిని పార్టీలో చేర్చుకుంది. చేరికలను మరింత ప్రోత్సహించాలంటే కొత్త వారికి అవకాశం ఇవ్వాలని పలువురు చెబుతున్నారు. కొత్త నేతలను బుజ్జగించేందుకు అయినా చోటు కల్పిస్తారని పలువురు భావిస్తున్నారు. ఈ అంశంపై పార్టీ సైతం స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తున్నది. పార్టీ పదవులు పాత వారికేననే ధోరణితో ఉంది. ఎందుకంటే పాత వారైతే పార్టీ మరింత బలోపేతమవుతుందని భావిస్తున్నట్లు సమాచారం. రాజకీయ పదవుల్లో మాత్రం కొత్త వారికి అవకాశం కల్పించాలని చూస్తున్నట్లు తెలుస్తున్నది.
అధికారంలోకి కాషాయ పార్టీ వ్యూహరచన
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana) తెలంగాణలో అధికారంలోకి రావాలని కాషాయ పార్టీ వ్యూహరచన చేస్తున్నది. అందుకు అనుగుణంగా కమిటీలను సిద్ధం చేయాలని ప్లాన్ చేస్తున్నది. అంతేకాకుండా త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై సైతం పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ అంశంలో తెలంగాణలో ఇతర పార్టీల కంటే ఒకడుగు ముందంజలో ఉన్నది. నాయకులు, కార్యకర్తలకు వర్క్‌షాప్, శిక్షణ తరగతులతో దిశానిర్దేశం చేపట్టాలని చూస్తున్నది. కాగా, ఆశావహులు కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని ప్రసన్నం చేసుకునే పనిలో పడినట్లు సమాచారం.
ప్రెసిడెంట్ నియామకం కాకముందు ఒకరిని కాదని మరో నేతను కలిస్తే ఏ నేతకు దూరమైపోతామోనని భావించిన వారికి (Ramchandra Raoరాంచందర్ రావును ఫైనల్ చేయడంతో కాస్త ఉపశమనం లభించిందని చెబుతున్నారు. కాగా, కొత్త కార్యవర్గం ఏర్పాటుపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఇప్పటికే హింట్ ఇచ్చారు. ఇంత తక్కువ టైంలో కొత్త కమిటీ ఏర్పాటు సాధ్యమవుతుందా? లేక మరింత ఆలస్యమవుతుందా? అనేది చూడాలి.
Also Read: ChatGPT: చాట్‌జీపీటీ చిట్కా.. యువతిలో ఊహించని మార్పు