Cristina Gheiceanu
Viral, లేటెస్ట్ న్యూస్

ChatGPT: చాట్‌జీపీటీ చిట్కా.. యువతిలో ఊహించని మార్పు

ChatGPT: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధన సంస్థ ఓపెన్ ఏఐ (OpenAI) డెవలప్‌ చేసిన చాట్‌జీపీటీ (ChatGPT) వినియోగం ప్రపంచవ్యాప్తంగా అంతకంతకూ పెరిగిపోతోంది. వెయిట్ లాస్‌, ఫిట్‌నెస్‌, డైట్, డైలీ ప్లానింగ్‌తో విద్యార్థులు, టెక్ రంగానికి చెందినవారు ఎందరో తమ ప్రొడక్టివిటీని పెంచుకోవడం కోసం చాట్‌‌జీపీటీని ఉపయోగిస్తున్నారు. అనేక విషయాల్లో అద్భుతమైన ఫలితాలు కూడా సాధిస్తున్నారు. ఇందుకు సంబంధించిన కథనాలు రోజుకొకటి వైరల్ అవుతున్నాయి. అలాంటి ప్రేరణ కలిగించే అంశం మరొకటి వెలుగులోకి వచ్చింది.

స్విట్జర్లాండ్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్ క్రిస్టినా గెయిచేను అనే మహిళ చాట్‌జీపీటీ సహాయంతో ఏకంగా 7 కేజీల బరువు తగ్గింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆమె పంచుకుంది. ప్రతి రోజు ఉదయం, “హాయ్, ఇది కొత్త రోజు, ఇవాళ1900 క్యాలరీలతో ప్రారంభిద్దాం” అంటూ ఓ వాయిస్ నోట్‌ను చాట్‌జీపీటీకి పంపేదానినని ఆమె వివరించింది. ఏమి తినాలో కూడా అడిగేదానినని చెప్పింది. ఆ రోజు తిన్న ప్రతి ఆహారాన్ని చెప్పేదానినని, తాను తిన్న ఆహారంలో ఉన్న క్యాలరీలు, ప్రొటీన్, ఫైబర్ మొదలైన వివరాలను ప్రారంభ దశలో చెబుతూ వచ్చానని వివరించింది. తరచూ ఇదే తరహాలో చాట్‌ చేయడంతో చాట్‌జీపీటీ ఆ వివరాలను గుర్తుంచుకుంటూ దేనిలో ఎంత క్యాలరీస్ ఉన్నాయో ట్రాక్ చేసి తక్కువ సమయంలో చెప్పి సాయపడిందని క్రిస్టినా వివరించింది.

Read Also- Health News: రాత్రిపూట స్మార్ట్ ఫోన్లు వాడితే మీ పని గోవిందా.. ఎందుకో రండి చెబుతా!

చాట్‌జీపీటీ ఉపయోగించడం చాలా సులభంగా అనిపించిందని, క్యాలరీలు లెక్కించే పనిలేకుండా చేసిందని ఆమె పేర్కొంది. చాట్‌జీపీటీ చెప్పినట్టుగా డైలీ టార్గెట్‌కు చేరుకున్నాక తినడం ఆపేసేదానినని, అందుకే బాగా పనిచేసిందని హర్షం వ్యక్తం చేసింది. వాడుకలో ఉన్న కాలరీస్ ట్రాకింగ్ యాప్స్‌కు బదులు చాట్‌జీపీటీకి వాయిస్ మెసేజ్ పంపించడం చాలా సౌకర్యంగా, సులభంగా అనిపించిందని ఆమె తెలిపింది.

చాట్‌జీపీటీ ఒక టేబుల్ రూపంలో కాలరీస్, ప్రొటీన్, ఫైబర్ మొత్తాన్ని చూపించేదని, అందుకే చాలా క్లారిటీగా అర్థమయ్యేదని క్రిస్టినా వివరించింది. ఫ్రిజ్ ఫోటో పంపినా కూడా, ఆరోగ్యకరమైన ఉపయోగపడే ఆహార సూచనలు ఇచ్చేదని పేర్కొంది. మొత్తంగా బరువు తగ్గాలంటే సమతుల్యంగా క్యాలరీస్ అవసరమని, అది సాధించడంలో చాట్‌జీపీటీ ఓ స్మార్ట్ అసిస్టెంట్‌గా పని చేసిందని క్రిస్టినా వివరించింది.

Read Also- Telugu Cinema: షూటింగ్లో అలాంటి పాడు పని చేసినందుకు హీరోని చెప్పుతో కొట్టిన స్టార్ హీరోయిన్?

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?