Kriti Sanon ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Kriti Sanon: ప్రియుడితో క్రికెట్ మ్యాచ్ చూస్తున్న కృతి సనన్.. వైరల్ అవుతున్న సెల్ఫీ

Kriti Sanon: బాలీవుడ్ నటి కృతి సనన్ మరోసారి వార్తల్లో నిలిచింది అయితే, ఈసారి తన సినిమాల అప్డేట్స్ తో కాదు? లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ బ్యూటీ మెరిసింది. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మూడో టెస్ట్ మ్యాచ్‌ను తన పుకార్ల ప్రియుడు కబీర్ బహియాతో కలిసి చూస్తూ తీసిన సెల్ఫీతో అందర్నీ షాక్ కు గురి చేసింది. ఈ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, వీరి రిలేషన్‌షిప్ గురించిన చర్చలు మళ్లీ ఊపందుదుకున్నాయి. కృతి సనన్, కబీర్ బహియా ఈ మ్యాచ్‌లో ఒకరి పక్కన ఒకరు కూర్చొని, టీమ్ ఇండియాను ఉత్సాహంగా ఎంకరేజ్ చేశారు. ఈ క్రమంలోనే  కబీర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కృతితో తీసిన సెల్ఫీని షేర్ చేయడం, అభిమానులను మరింత ఉత్సాహపరిచింది.

Also Read: Uttam Kumar Reddy: కృష్ణా గోదావరి బేసిన్లో సమస్యలపై చొరవచూపాలి.. పాటిల్‌కు మంత్రి లేఖ

క్రికెట్ గ్రౌండ్‌లో ప్రియుడితో కృతి సనన్

జులై 14, 2025న లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో కృతి సనన్, కబీర్ బహియా కలిసి కనిపించారు. వీరిద్దరూ బీజ్, వైట్ రంగుల్లో ట్విన్నింగ్ చేస్తూ స్టైలిష్‌గా కనిపించారు. కృతి స్లీవ్‌లెస్ క్రాప్డ్ యుటిలిటీ జాకెట్‌తో, వైట్ ప్యాంట్‌తో స్పోర్టీ-చిక్ లుక్‌లో మెరిసింది. అయితే కబీర్ వైట్ టీ-షర్ట్, బీజ్ జాకెట్, వైట్ ట్రౌజర్స్‌తో సింపుల్‌గా కనిపించాడు. ఈ సెల్ఫీలో వీరిద్దరూ నవ్వుతూ, ఒకరి పట్ల ఒకరికి ఉన్న ఇష్టం గురించి తెలుస్తుంది. కబీర్ ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి, లొకేషన్‌ను లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌గా ట్యాగ్ చేశాడు, కానీ క్యాప్షన్ ఏమీ రాయలేదు. ఈ సెల్ఫీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

 Also Read: Telugu Cinema: షూటింగ్లో అలాంటి పాడు పని చేసినందుకు హీరోని చెప్పుతో కొట్టిన స్టార్ హీరోయిన్?

నెటిజన్ల రియాక్షన్ ఇదే 

అయితే, ఎక్స్‌ ట్విట్టర్ లో ఈ పోస్ట్ పై రక రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ జంటను చూసి “రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన” హీరోయిన్‌ అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. అభిమానులు వీరి కెమిస్ట్రీని, స్టైలిష్ లుక్‌ పై కామెంట్లు పెడుతున్నారు. అయితే, కొందరు నెటిజన్లు కృతి క్రికెట్ గురించి ఎంత తెలుసని ప్రశ్నిస్తూ ట్రోల్ చేశారు. మరికొందరు ఎవరైనా క్రికెట్‌ను ఆస్వాదించే హక్కు ఉందని సమర్థించారు.

Also Read: Kota Srinivasa Rao: ఆ శాపం వేటాడిందా.. అందుకే కోట శ్రీనువాసరావు జీవితంలో అలా జరిగిందా ?

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?