Precision food
Viral, లేటెస్ట్ న్యూస్

Health: మంచి ఫుడ్ తిన్నా అనారోగ్యమేనా?, అయితే ఇది మీకోసమే!

Health: మంచి ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నా అనారోగ్యంగా అనిపిస్తోంది. కారణంగా తెలియకుండానే అలసటగా, కడుపు ఉబ్బరంగా అనిపిస్తోందా?. వారంలో కనీసం 3 సార్లు వ్యాయామం చేస్తూ, వాకింగ్‌కు వెళుతున్నా సరే బరువు తగ్గడం లేదా?.. అయితే, ఆరోగ్యకరంగా తింటున్నామనే మీ భావన తప్పు. ఇందుకు సంబంధించిన కీలక విషయాలపై అవగాహన కల్పిస్తూ ప్రముఖ కార్డియాలజిస్ట్, ఫంక్షనల్ మెడిసిన్ నిపుణులు డా.సంజయ్ భోజ్‌రాజ్ ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో సమాచారంతో కూడిన పోస్ట్ పెట్టారు.

మీరు నిజంగానే మంచిగా తింటున్నారా? అని ప్రశ్నించిన డాక్టర్ భోజ్‌రాజ్, ‘‘మీరు నిజంగానే హెల్దీగా తింటున్నట్టే అయితే, మరి ఎందుకు అలసటగా, ఉబ్బరంగా లేదా ఇబ్బందికరంగా అనిపిస్తోంది?” అని ఆయన అడిగారు. చాలా మంది, తమ శరీరానికి సరిపోయే ఆహారం కాకుండా, సామాజికంగా బయట కనిపించే ‘ట్రెండ్స్’ ఆధారంగా ఆహారం తీసుకుంటుంటారని, ఇవి వారి శరీర జీవవైవిధ్యానికి సరిపోవని భోజ్‌రాజ్ సూచించారు. మంచిగా తింటున్నామని అనుకుంటున్న వారు కూడా అనారోగ్యంగా ఫీలవ్వడానికి ప్రధాన కారణం ఇదేనని ఆయన విశ్లేషించారు. చాలామందికి ఇలాంటి భావన కలుగుతుందని ఆయన వివరించారు.

Read Also- Viral News: విద్యార్థినిపై ఫిజిక్స్, బయాలజీ లెక్చరర్లు, వారి ఫ్రెండ్ అఘాయిత్యం

చాలామంది తమకోసం తాము అవసరమైన ఆహార నిబంధనలను సిద్ధం చేసుకోరని, బయట నడిచే ట్రెండ్స్‌‌ను పాటిస్తుంటారని చెప్పారు. ఇలా చేస్తే బరువు తగ్గినట్టే అనిపించినా, మళ్లీ పెరిగిపోతుందని డాక్టర్ పేర్కొన్నారు. దాదాపు 90 శాతం మంది మంచిగా తింటున్నామని భ్రమపడుతుంటారని చెప్పారు. బయట ట్రెండ్‌‌ను అనుసరించేవారు‌ ఆహారం తమ వ్యక్తిగత శరీర పరిస్థితులకు సరిపడకపోయినప్పటికీ, బయట ఫ్యాషన్ లేదా పాపులారిటీ అయిన రూల్స్‌ను పాటిస్తుందని డాక్టర్ భోజ్‌రాజ్ వివరించారు.

Read Also- Shubhanshu Shukla: స్ప్లాష్‌డౌన్ సక్సెస్.. భూమికి తిరిగొచ్చిన శుభాన్షు శుక్లా

అందుకే బరువు తగ్గరు
ఈ కారణంగానే బరువు తగ్గినట్టే అనిపించి మళ్లీ పెరుగుతుందని, నిద్ర సరిగ్గా పట్టదని, హెల్త్ టెస్టుల్లో ఫలితాలు కూడా సరిగ్గా రావని డాక్టర్ భోజ్‌రాజ్ పేర్కొన్నారు. అందరికీ ఒకే విధమైన ఆహారం సరిపడదని, వ్యక్తి ఆరోగ్యం, జీవవైద్యాన్ని బట్టి ఉంటుందని సూచించారు. ఆహారం అనేది పూర్తిగా వ్యక్తిగతమైనదని పేర్కొన్నారు. ‘‘నా క్లినిక్‌లో నేను, నా బృందం కలిసి దాదాపు 10 వారాల్లో ఓ పేషెంట్ 30 పౌండ్లు వరకు బరువు తగ్గేలా దోహదపడ్డాం. ఆ రోగి కండరాల శక్తిని కోల్పోకుండా, దుష్ప్రభావాలు లేకుండా, ఓజెంపిక్ వంటి తక్షణ ఫలితాలు ఇచ్చే మందులపై ఆధారపడకుండా చేశాం’’ అని ఆయన వివరించారు. ఎవరికి తగిన ఆహారాన్ని వారు తీసుకునే విధానాన్ని ‘ప్రిసిషన్ న్యూట్రిషన్’ అంటారని, ఫంక్షనల్ మెడిసిన్ పద్ధతులపై ఇది ఆధారపడి ఉంటుందని వివరించారు. ఈ విధానం వల్ల చక్కటి ప్రయోజనాలు ఉంటాయని డాక్టర్ భోజ్‌రాజ్ పేర్కొన్నారు. శక్తి మెరుగుపడుతుందని, బీపీ నియంత్రణలోకి వస్తుందని, ఆయువు పెరడంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా బావుంటుందని వివరించారు. చివరిగా, ‘మీ శరీరంలో తప్పేమీ లేదు… మీ ప్లాన్‌లో తప్పుంది!’ అంటూ డాక్టర్ తన సూచనను ముగించారు.

Disclaimer: సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు