Floods In USA
అంతర్జాతీయం, లేటెస్ట్ న్యూస్

New York Floods: ఫ్లాష్ ఫ్లడ్స్.. ఈశాన్య అమెరికా అతలాకుతలం

New York Floods: అమెరికాలోని ఈశాన్య ప్రాంత రాష్ట్రాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. తీర ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షాల ధాటికి వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. న్యూజెర్సీ, న్యూయార్క్ రాష్ట్రాల్లో అకస్మాత్తుగా వరదలు సంభవించాయి. దీంతో, ప్రధాన రహదారులు నీటమునిగాయి. చాలాచోట్ల వాహనాలు నిలిచిపోయాయి. కొన్నిచోట్ల సబ్‌వే లైన్లను మూసివేయాల్సి వచ్చింది. వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో విమానాల రాకపోకల్లో కూడా తీవ్ర ఆలస్యం జరుగుతోంది. పరిస్థితి అత్యంత ప్రతికూలంగా మారడంతో ఎమర్జెన్సీని ప్రకటించారు. తీవ్ర తుపాను నెమ్మదిగా కదులుతున్న నేపథ్యంలో న్యూజెర్సీ, న్యూయార్క్, పెన్సిల్వేనియా, పరిసర ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించే అవకాశం ఉందని మంగళవారం తీవ్ర హెచ్చరికలు జారీ అయ్యాయి. న్యూజెర్సీ రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధిస్తూ గవర్నర్ ఫిల్ మర్ఫీ ప్రకటించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైన పనులు ఉంటే తప్ప బయటకు రావొద్దని సూచించారు.

Read Also- Nimisha Priya: యెమెన్‌లో భారతీయ నర్సుకు మరణశిక్షలో కీలక పరిణామం

వీడియోలు వైరల్

వరదలు సంభవించిన ప్రాంతాలలో తీసిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. న్యూజెర్సీలోని స్కాచ్ ప్లైన్స్ ప్రాంతంలో మెయిన్ రోడ్ నీటిలో మునిగిపోయిన దృశ్యాలను చాలామంది షేర్ చేస్తున్నారు. రహదారి మునిగిపోవడంతో బస్సులు అక్కడికక్కడే నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల బస్సులు, ట్రైన్లను ఆలస్యంగా నడుస్తున్నట్టు స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కొన్ని సబ్‌వే లైన్లను పూర్తిగా మూసివేయగా, మరికొన్ని లైన్లలో వాహనాలు బాగా ఆలస్యంగా నడుస్తున్నాయని ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ప్రకటించింది. న్యూయార్క్‌లో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నవారు, లేదా బేస్‌మెంట్లలో ఉన్న వారు సురక్షితంగా ఉండేందుకు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని ఎమెర్జెన్సీ మెనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అప్రమత్తం చేసింది.

Read Also- Kriti Sanon: ప్రియుడితో క్రికెట్ మ్యాచ్ చూస్తున్న కృతి సనన్.. వైరల్ అవుతున్న సెల్ఫీ

న్యూయార్క్‌లో వరద బీభత్సం
న్యూయార్క్ సిటీలోని మిడ్-హడ్సన్ ప్రాంతంలో అకస్మాత్తుగా వరదలు సంభవిస్తు్న్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమర్జెన్సీ సర్వీసెస్ అప్రమత్తం చేసింది. వెచెస్టర్ కౌంటీలో కొన్ని వాహనాలు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో సంబంధిత అధికారులు సహాయ చర్యలు మొదలుపెట్టారు. జనాలు ప్రయాణాలు చేయవద్దని సూచించారు. ముఖ్యంగా నీట మునిగే అవకాశమున్న ప్రాంతాల్లో నివసించే వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. ఖాళీ చేయాలంటూ అధికారికంగా చెప్పిన ప్రాంతాల్లోని వారు తక్షణమే తరలి వెళ్లాలని ఓ అధికారి సూచించారు. మాన్‌హటన్‌లోని ఓ మెట్రో స్టేషన్ నీటితో నిండిపోవడం, ప్లాట్‌ఫాం మొత్తం మునిగిపోవడం, లోపలున్న ప్రయాణికులు ట్రెయిన్ సీట్లపై నిలబడడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. న్యూయార్క్‌లోని ప్రధాన రహదారుల్లో భాగమైన సా మిల్ రివర్ పార్క్వే, క్రాస్ బ్రాంక్స్ ఎక్స్‌ప్రెస్‌వేలను కూడా అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. వరదలపై అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు.

Read Also- Malnadu Restaurant Drugs Case: మల్నాడు డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. పోలీస్ అధికారుల సుపుత్రులు

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?