Chandrayangutta Crime: తరచూ తనపై చేయి చేసుకుంటుండడంతోపాటు పోలీస్ కేసుల్లో ఇరికిస్తానని భయపెడుతున్నాడని ఓ యువకుడు చిన్నప్పటి స్నేహితుడిని దారుణంగా హత్య చేశాడు. మూడు రోజుల్లోనే కేసు మిస్టరీని ఛేదించిన చాంద్రాయణగుట్ట పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. చాంద్రాయణగుట్ట (Chandrayangutta) ఏసీపీ సుధాకర్ (ACP Sudhakar) మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. వృత్తిరీత్యా క్యాబ్ డ్రైవర్ అయిన హఫీజ్ బాబానగర్ నివాసి మహ్మద్ అబ్దుల్ అజీజ్ (24), అదే ప్రాంతంలో నివాసముంటున్న మహ్మద్ యూసుఫ్ (18)లు బాల్య స్నేహితులు. తేలికగా డబ్బు సంపాదించవచ్చంటూ అజీజ్ తన మిత్రుడైన యూసుఫ్‌తో కొంతకాలంగా గంజాయి అమ్మిస్తూ వస్తున్నాడు. ఇలా వచ్చిన డబ్బు నుంచి కొంత కమీషన్‌గా (Yusuf) యూసుఫ్‌కు ఇచ్చేవాడు. కొన్ని రోజుల క్రితం ఇరువురి మధ్య విభేదాలు తలెత్తాయి.
Also Read: Fire Crime: నారాయణపేట జిల్లాలో దారుణం.. మంటల్లో చిక్కుకున్న బాలిక చివరికి!
11న రాత్రి అజీజ్‌కు ఫోన్
అప్పటి నుంచి అజీజ్ (Aziz) తరచూ యూసుఫ్‌పై చేయి చేసుకుంటుండడంతోపాటు గంజాయి కేసులో పోలీసులకు పట్టిస్తానని బెదిరించటం మొదలు పెట్టాడు. దాంతో యూసుఫ్ (Yusuf) అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఓ కత్తి కొని పెట్టుకున్నాడు. ఈ నెల 11న రాత్రి సమయంలో Aziz) అజీజ్‌కు ఫోన్ చేసి బాలాపూర్‌లోని జెప్టో స్టోర్ వద్దకు వస్తే తాను దాచి పెట్టుకున్న బంగారం ఇస్తానని చెప్పాడు. ఇది నమ్మి అక్కడకు వెళ్లిన (Aziz) అజీజ్‌పై వెనుక నుంచి బండరాయితో దాడి చేసిన యూసుఫ్, అతను కింద పడిపోగానే కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. దాంతో అజీజ్ (Aziz) అక్కడికక్కడే మరణించాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన సీఐ ఆర్ గోపి సిబ్బందితో కలిసి నిందితుడైన (Yusuf) యూసుఫ్‌ను అరెస్ట్ చేశారు. అతని నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Medak Crime: కల్లు సీసాతో పొడిచి.. బండ రాయితో దారుణ హత్య