Medak Crime (imagcredit:swetcha)
క్రైమ్

Medak Crime: కల్లు సీసాతో పొడిచి.. బండ రాయితో దారుణ హత్య

Medak Crime: మెదక్(Medak) జిల్లా కొల్చారం మండలం అంసాన్ పల్లి గ్రామపంచాయితీ పరిధిలో నీ వాసురామ్(Vasuram) తండా వాసి రామావత్ మంగ్యా(Ramavat Mangaya) 45 దారుణ హత్యకు గురయ్యారు. కల్లు డిపోలో శుక్రవారం సొంత అన్ననే తమ్ముడు దారుణంగా హత్య చేశాడు. వసురాం తండాకు చెందిన రమావత్ మంక్యా (45)ను అతని సొంత తమ్ముడు మోహన్(Mohan) బండ రాయితో మోది, కల్లు సీసాతో పొడిచి చంపాడు. అన్న దమ్ముల మధ్య ట్రాక్టర్ కిరాయి డబ్బులకు సంబంధించి కొద్ది రోజుల నుంచి గొడవ జరుగుతోంది. అంతేగాక అన్న మాంక్యా మంత్రాలు చేయడం వల్లే తన మనుమరాలు చనిపోయిందని మోహన్ అనుమానిస్తున్నాడు.

కోపంతో ఉన్న తమ్ముడు

ఈ క్రమంలో శుక్రవారం అంసాన్ పల్లి కల్లు డిపోలో అన్నదమ్ముల(Brothers) మధ్య ట్రాక్టర్ కిరాయి డబ్బుల విషయంలో మాట మాట పెరిగి గొడవ పెద్దదైంది. ఎప్పటి నుంచో కోపంతో ఉన్న తమ్ముడు మోహన్ అన్న మాంక్యా తలపై బండ రాయితో మోది, కల్లు సీసాతో పొడిచి చంపేశాడు. సంఘటన స్థలాన్ని మెదక్ డీఎస్పీ ,ప్రసన్న కుమార్, రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి సందర్శించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కోల్చారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు మాంక్యా డెడ్ బాడీని పోలీసులు పోస్ట్ మార్టం కోసం మెదక్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కు తరలించారు.

Also Read: Congress on KTR: మెదక్ ప్రజలను గాడిదలు అన్న కేటిఆర్.. ఎస్పీకి ఫిర్యాదు

ఇరు కుటుంబాల మధ్య గొడవలు
మంక్యా డెడ్ బాడీని పోలీస్‌లు మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్దకు నిందితుడు మోహన్‌కు దగ్గరి బంధువులు ఆసుపత్రి వద్ద కు రావడంతో మృతుడు మంక్యా బంధువులు వారిపై దాడికి ప్రయత్నించి గొడవకు దిగడంతో పోలీస్‌లు లాఠీ చార్జి చేసి అందరిని చెదర గొట్టారు. పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం పోలీస్(Police) బందోబస్తుతో డెడ్ బాడీని స్వగ్రామంకు తరలించారు. ఇదిలా ఉండగా నిందితుడు మోహన్ పోలీస్‌లకు లొంగిపోయినట్లు తెలుస్తుంది.

Also Read: KTR on India Map: చరిత్రను నిర్లక్ష్యం చేసిన బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలి

 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు