Warangal News: పాలకుర్తి నియోజకవర్గం రాజకీయాలలో కాంగ్రెస్(Congress) పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల జిల్లాలోని చెర్లపాలెం గ్రామంలో చోటుచేసుకున్న సంఘటనలు పార్టీ నేతల్లో మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయన్న విషయాన్ని బహిర్గతం చేసింది. టిపిసిసి(TPCC) ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి(Jhansi Reddy)కి స్వగ్రామమైన చెర్లపాలెంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఝాన్సీ రెడ్డి మద్దతుతో వచ్చిన పార్టీ ఇంచార్జీలు గ్రామాన్ని సందర్శించగా స్థానిక నాయకులు, కార్యకర్తలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఏర్పాటైన సమావేశ టెంట్లను కూలగొట్టి, కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.
Also Read: Chandrababu: రెండ్రోజుల ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. ఏం చేయబోతున్నారు?
మా తిరుపతి రెడ్డి ఏడి?
ఈ పరిణామాల్లో మరింత సంచలనంగా మారిందేమంటే, ఎంపిటిసి(MPTC) క్లస్టర్ సమావేశానికి మా నాయకుడు తిరుపతి రెడ్డి లేకుండా సమావేశం ఏంటని కాంగ్రెస్ కార్యకర్తలు టెంట్లు కూల్చేసి వచ్చిన కార్యకర్తలను యువత కాంగ్రెస్ నాయకులు ఎల్లగొట్టారు. ఆయన కోసం మేము పోరాడతాం అంటూ పెద్ద ఎత్తున యువత నినాదాలు చేశారు. మా తిరుపతిరెడ్డి లేకుండా ఏలాంటి సమావేశం కానీ ఏ కార్యక్రమం చర్లపాలెంలో చేపట్టిన దాన్ని ఉద్రిక్తతం చేస్తామని కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిచే వరకు మా తిరుపతి రెడ్డి కావాలి గెలిచాక వద్ద అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీకి సంక్షోభ సంకేతాలు
ఝాన్సీ రెడ్డికి సొంత గ్రామంలోనే ఎదురైన ఈ పరిణామాలు ఆమె నాయకత్వం పై ప్రశ్నార్థకాన్ని మిగిలించాయి. అసలే పార్టీ బలహీన స్థితిలో ఉన్న సమయంలో ఇటువంటి అంతర్గత ఘర్షణలు బహిరంగంగా బయటపడటం స్థానికంగా తీవ్ర చర్చలకు దారి తీసింది. పార్టీ భవిష్యత్తు పై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Crime News: ‘దృశ్యం-2’ తలపించేలా అత్తను హత్య చేసిన అల్లుడు